Wednesday, 27 November 2013

కానీ మనం చేసే ప్రతి పని లేక్కలోనే ఉంటుంది

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
మనం చేసే చిన్నతప్పులు ఎవరు చూస్తారులే అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి పని లేక్కలోనే ఉంటుంది. ముఖ్యంగా ఈమధ్య యువత అక్రమ సంభందాలు ఎక్కువగా కొనసాగిస్తుంది. పెళ్లి కాకుండానే తల్లులు అవుతున్నారు. అబార్షన్లు చేయిస్తున్నారు. పెళ్లి అయినవారు కూడా పక్క వారి గురించే ఆలోచిస్తున్నారు. ఇది మీ ఒక్కరితో ఆగిపోతుంది అనుకోకండి. తరతరాలు వెంటాడుతుంది. మీ పిల్లలకి ఆస్థి ఒక్కటే సంపాదించి ఇస్తున్నాం అనుకుంటున్నారు. అది ఎలా సంపాదించారో అలాంటి అక్రమ బుద్దులే వస్తాయి.
మీరు చేసే తప్పు మీ ఒక్కరితోనే ఆగదు. మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తారు. ఈ సామెత వినేవుంటారు.
''ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా'' ? మేయదు. ఆవుతో పాటే దూడ కూడా! అలాగే మీతో పాటే మీ పిల్లలు. ఎందుకంటే మీ రక్తమే కదా వారిలో పారేది. ఇది కాకా! యమలోకంలో శిక్షలు కూడా భీకరంగా ఉంటాయి. మీరు ప్రేమపేరుతో, అక్రమ సంభందం సాగించారో వారందరి రూపాలు నిప్పు కణికలై మీ వెంటపడి చిత్రవధ చేస్తారు. ఇక్కడ భూలోకంలో సుఖమైన కష్టమైనా ఒక హద్దు వరకు మాత్రమే అనుభవించి చనిపోతారు. అక్కడ యాతన మీ ఆత్మకి దేహాలు తొడిగి చిత్రవధ చేస్తారు. దీనికి హద్దులేదు. ఎంతైనా అనుభవించాల్సిందే.
కాబట్టి ఎవరి హద్దుల్లో వారు ఉండండి. చేసినదానికి పరిష్కారం ఏంటి?
హరినామ సంకీర్తనం.
ఇంతకు ముందు చాల సార్లు చెప్పాను కదా! ఈ కలికాలంలో మానవుడు చాల తేలికగా మోక్షాన్ని సాధించవచ్చు. అదే హరినామ సంకీర్తనం.
ఇది చదివిన దగ్గర నుండి మీలో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే అపెసేయండి. ఎందుకంటే తెలియనపుడు చేసిన దారి వేరు. తెలిసి చేస్తే మీకు పడే శిక్షకి కోటి రెట్లు ఎక్కువ అనుభవిస్తారు. ఇందులో సందేహం, సంశయం ఏమాత్రం లేదు. పరిష్కారాలు కూడా లేవు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలతో పాటు తరువాతి తరాల వారికీ కూడా మేలు చేసినవారు అవుతారు.