హైందవ సంస్కృతి మాస పత్రిక
మహాగణేశవైభవం...
మహాగణపతి సిద్ధి, బుద్ధి శక్తి సహితుడై సర్వ విఘ్నాలను పోగొడుతూ కోరికలన్నింటినీ తీరుస్తూ భక్త జనులకు కొంగు బంగారంగా భాసిల్లుతుంటాడు. విష్ణుపథాన్ని, బ్రహ్మపథాన్ని అనుగ్రహిస్తుంటాడు. పురాణ, ఇతి హాసాలలో మహాగణపతి గొప్పతనం అనేకచోట్ల కనిపిస్తుంది. వేదాలలో ‘గణానాంత్వా గణపతి గ్‌ంహవాయహే’ అనే గణేశ తత్వం ప్రతిపాదితమైంది. సాయనాచార్యుడు ఈ మంత్రానికి యజ్ఞపరంగా వ్యాఖ్యానం చేశాడు. పురాణాలలో ఉన్న ఏకదంత, వక్రతుండ, మహాహాస్తి లాంటి మహాగణపతి నామాలన్నీ వేద రుక్కులలో ప్రసిద్ధంగా ఉన్నాయి. గణపతి సర్వదేవతా రక్షకుడుగా సృష్టి, స్థితి లయ కారకుడిగా దేవతలందరికంటే ముందు పూజలందుకునే ఆది దేవుడుగా ప్రసిద్ధుడు. గజానన, గజాస్య శబ్దాల చేత వర్ణితుడైన గణపతి నిర్గుణ, సగుణ బ్రహ్మ అని పండితుల భావన. ‘యస్మాత్ బింబ ప్రతిబింబ యాప్రణవాత్మకమ్ జగత్ జాయక ఇతి జహ:’ అని గజ శబ్ద వ్యుత్పత్తి కనుపిస్తుంది.
గజ శబ్దం బ్రహ్మవాచకంగా ప్రణవాత్మక జగత్ వాచకంగానూ ఉంటుంది. గణపతి రూపం గజాకృతిగా, నరాకృతిగా ఉండటానికి కూడా కొన్ని కారణాలున్నాయి. తాత్విక దృష్టితో చూస్తే గజాకృతి నిరుపాదిక బ్రహ్మ అని నరాకృతి మాయా శబలిమైన సోపాదిక బ్రహ్మ అని వేదవిదులు సంభావిస్తారు. గణేశుని సోపాదిక, నిరుపాదిక రూపాలను గురించి గణేశ ఉపనిషత్తు ప్రతిపాదిస్తోంది. శ్రీ మహాగణపతిని ఉపాసించి సమాధినిష్టులై ఎందరెందరో గణపతి తత్వాన్ని సాక్షాత్కరింప చేసుకున్నారు. గణేశపురాణం, ముద్గల పురాణాలలో గణేశమహిమ అనేక కథలుగా కనిపిస్తుంది. ఆ కథలన్నీ గణపతి సగుణ తత్వాన్ని వివరిస్తుంటాయి.
నిర్గుణ, నిరాకార పరబ్రహ్మగా, మానవులను ఉద్దరించే దైవంగా గజాననం, వక్రతుండం, తదితర రూపాలలో గణేశుడు అవతరించినట్లు పురాణ వాజ్మయం వర్ణిస్తోంది. పూర్వం భీమ మహారాజు ఏకాక్ష గణపతి మంత్రజపం చేసి సంతానాన్ని పొందినట్లు ఆయనే ఆ జపంతోటే కుష్టురోగాన్ని పోగొట్టుకొన్నట్లు గణేశ పురాణంలో కన్పిస్తుంది. అంతేకాక ఇంద్రుడు గౌతమ ముని శాపం వల్ల పొందిన, వేయికళ్ల బాధనుండి విముక్తి పొందింది గణేశుడిని ఆరాధించేనని గణేశ పురాణం చెబుతుంది. ఇంద్రుడు క్షడక్షర గణపతి మంత్రాన్ని జపించి గణేశుడి అనుగ్రహాన్ని పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర వధ సమయంలో గణేశుడు పరమేశ్వరుడికి ప్రత్యక్షుడై తన నామ బీజంచేత అభిమంత్రించిన బాణాన్ని సంధించమని అపుడు శత్రుజయం కల్గితీరుతుందని చెప్పాడు.
శివుడు అలాచేసి విజయాన్ని పొందాడని పురాణ కథల సారం. పరమశివుడు గణపతి ప్రదత్తమైన గణపతి సహస్ర నామ స్త్రోత్రాన్ని శ్రద్దతో పఠించి శత్రుసంహారానికి కదలిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. వినాయకుడు బ్రహ్మ, విష్ణు, శివాత్మకుడైన దేవదేవుడు ఆయన రూపం స్థూలదృష్టికి విచిత్రంగా ఉంటుంది. కాని ఆరూపంలో ఎన్నెన్నో విజ్ఞాన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రహాస్యాలను తెలుసుకోవడానికి ఉత్తమ గురువుల సహాయం ఎంతో అవసరం. గణేశుడు ఏకదంతుడు ఏక అనే శబ్దంచేత మాయ దంతా శబ్దంచేత మాయకుడైన ఈశ్వరుడు స్ఫురిస్తుంటారు. దీని నిరూపిస్తూనే ఆయనకు ఏకదంతం (ఒకే ఒక దంతం) మనకు కన్పిస్తుంటుంది. మాయా యుక్తంగా బ్రహ్మ, వాచకంగా వతం ఉన్న మస్తకం కలవాడు కనుక ఆత్మ స్వరూపుడైన గణపతి వక్రతుండుడుగా పిలుపులందుకొంటున్నాడు.
ఆత్మ స్వరూపం వక్రం అని తత్వవేత్తలు భావిస్తారు. ‘యతో వాచోనివర్తంతే అప్రాప్యమనసా సహా’ అని ఆత్వతత్వం వాక్కుకు, మనసుకు అంత త్వరగా స్ఫురించదని, ఈ స్ఫురణకు గణేశ ఉపాసన, గణాశతత్వ అవగాహన ఉపయుక్తమవుతాయని పండితులు చెబుతుంటారు. గణపతి చేటవంటి చెవులు కలిగిన వాడు చేలు ధాన్యంలోని తప్పును తాలును చెరిగి వేసినట్లుగా ప్రాణుల పాప పుణ్యరూపమైన రజస్సును మాలిన్యాన్ని దూరంచేసి నిర్మలమైన అంతఃకరణాన్ని ప్రసాదించే దేవుడు కనుక గణపతి ఇలా చేటలవంటి చెవులతో కనిపిస్తాడు. గణేశుడు మూషికవాహనుడు గణపతి వాహనమైన మూషికం ప్రాణుల అజ్ఞానాన్ని పోగొట్టే ఒక మహత్తర శక్తి అని చెబుతారు. ఈశ్వరుడే గణపతిని సేవించటానికి మూషిక రూపాన్ని ధరించినట్లు వేద వాజ్మయం వివరిస్తుంది. ‘మూషికం వాహనాఖ్యాం పశ్వన్తి వాహనం పరమ్! తేన మూషిక వాహోయం వేదేషు కధితో భవత్!! ముషస్తేయే తధా ధాతుః స్తేయ బ్రహ్మధృక్! నామరూపాత్మకం సర్వం తత్రాసద్ బ్రహ్మవర్తతే, భాగేషు భోగభోక్తాచ బ్రహ్మ కారేణ వర్తతే, అహంకార యతాస్తం వైన జానన్తీ విమోహితాః, ఈశ్వరః సర్వభోక్తా చచోర వత్తత్ర సంస్థితః నపెవ మూషకః ప్రోక్తో మనుజానాం ప్రచాలక:|| ఇలా గణపతి తత్వం, గణపతి స్వరూపం అంతా ఒక మహాన్నతమైన వేద విజ్ఞాన సంకేతంగా కనిపిస్తుంటుంది