Brahmasri Chaganti Koteswara RAO
విభిన్న పుష్పములతో శివపూజ
లక్షపుష్పములతో శివుని పూజించినచో సకల పాపములు నశించును. తక్కువ సంఖ్యతో పూజించిననూ ఫలం ఉంటుంది. లక్షసంఖ్య శీఘ్రఫలం. ఒకేసారి చేయలేకపోయినచో క్రమశః చేయవచ్చు.
సంపద కోరువారు - బిల్వపత్రము, కమలము, శతపత్రము, శంఖపుష్పము
మోక్షం కోరువారు - దర్భలతో, శమీ పత్రములతో, వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములతో
దీర్ఘాయువు కోరువారు - దూర్వారముతో
పుత్రుని అభిలషించువారు - ఉమ్మెత్త పూలతో(ఎర్ర కాడలు ఉన్నది శ్రేష్ఠం)
భోగమోక్షముల కొరకు - తులసీ దళములతో, ఎర్ర తెల్ల జిల్లేడు, శ్వేత కమలములతో
ధర్మానికి ద్రోహులైన శత్రు నాశనం కొకు - జపాకుసుమాలతో(ఎర్రగులాబీలు)
రోగనివారణకు - కరవీర(గన్నేరు)
వాహనలబ్ధికొరకు - జాజిపూలతో
శుభలక్షణసంపన్నయైన భార్యను కోరువారు - మల్లెలతో
సుఖసంపదలు - పారిజాతపుష్పములతో
సర్వకామ్యములకొరకు - శంఖుపుష్పములతో
అవిసె పుష్పములతో పూజించిన వాడు విష్ణుభగవానునకు ప్రియమైన వాడగును. లక్షబిల్వ పత్రములను శివునకు సమర్పించిన వానికి సకల కామ్య వస్తువులు ప్రాప్తించును. చంపక(సంపెంగ), మొగలి పుష్పములు తప్ప మిగతా పుష్పములన్నియు శివునకు సమర్పించవచ్చును. క్రమంగా కోటి చేస్తే(వేటితోనైనా) జ్ఞానం వస్తుంది. నేతితో అభిషేకం చేసినచో మధుర కంఠధ్వని, వాక్కు, విద్య ప్రాప్తిస్తాయి.