Wednesday 20 March 2013

శివలింగ నిర్మాణం :

Suvarna Radhaakrishna
శివలింగ నిర్మాణం :

పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. కాబా గోడలో అమర్చిన అస్వాద్ అనే నల్లని రాయిని స్వర్గ రాయి గా భావించి ముస్లిములు హజ్ యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు