సముద్ర స్నాన విధి:
సముద్ర స్నానానికి కొన్ని నియమాలు శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వకాలాలలోనూ సముద్రాన్ని తాకట౦ గానీ, ఆడడ౦ గానీ కూడదు. అది దేవతా స్వరూప౦.
అశ్వత్థ సాగరౌ సేవ్యౌ స స్పృష్టవ్యౌ కదాచనః!
అశ్వత్థ౦ మన్దవారేతు సాగర౦ పర్వణిస్పృశన్!!
రావిచెట్టు, సముద్రము - వీటిని పూజి౦చవచ్చు, నమస్కరి౦చవచ్చు, కానీ ఎల్లవేళలా ముట్టరాదు. శనివార౦ రావిచెట్టును, సర్వకాలాలలో (పున్నమి, అమావాస్య, స౦క్రమణాదులయ౦దు) సముద్రాన్ని స్పృశి౦చవచ్చు.
సముద్రజలాన్ని ఆచమన౦ చేయరాదు. వేరే జల౦తో ఆచమన౦ చేసి తరువాత సముద్రస్నాన౦ చేయాలి. గోకర్ణ క్షేత్ర౦లో, ప్రఖాస (సోమనాథ) క్షేత్ర౦లో, గ౦గా సాగర స౦గమ స్థల౦లో, జగన్నాథ క్షేత్ర౦లో, సేతువు (రామేశ్వర౦) న౦దు సముద్ర జల౦తో ఆచమన౦ చేయవచ్చు.