Wednesday, 20 March 2013

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?

గాయత్రీ మంత్రంలో 24 అరాలున్నాయి. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో శ్రీరామాయణాన్ని రచించి, ప్రతి వెయ్యి 

శ్లోకాలకు మొదటి శ్లోకంలో గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు సంపుటీకరించి, రామాయణాన్ని పవిత్రం

 చేశాడు. గాయత్రీ మొదటి అక్షరం 'త' శ్రీరామాయణ ప్రారంభ శ్లోకం'తపస్వాధ్యాయ నిరతం' అని శ్లోకం 


ప్రథమాక్షరంగా ఉంది. అలాగే పట్టాభిషేక సర్గలో, చివరశ్లోకం, చివరి అక్షరం 'త'గా ఉంది.


ఇదే ఫలశ్రుతి శ్లోకం. పఠన్‌ద్విజో వాగృషభత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో భూమిపతిత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో 

భూమిపతిత్వమీయాత్ పణిగ్జనః పుణ్యఫలత్వమీయాత్ జనశ్చశూద్రోపి మహత్వమీయాత్ ఇలా, 'త' అనే 


అక్షరంలో శ్రీరామాయణం పరిసమాప్తమైంది. గాయత్రీ మంత్రంలో 'థియోయోనః ప్రచోదయాత్' అని 'త్' కడపటి 

అక్షరంగా ఉంది. అందువల్ల శ్రీరామాయణం శ్రీ గాయత్రీమంత్రార్థ ప్రతిపాదకం. గాయత్రీమంత్రద్రష్ట అయినందువల్లే 


విశ్వామిత్రుడికి శ్రీరాముడి పూర్తి రక్షణ లభించింది.