Sunday 8 April 2012

శ్రీకృష్ణ మహామంత్రం అర్ధం:-

శ్రీ: సౌభాగ్యమునిస్తుంది.ధనమును,లోకప్రియత్వములు కలుగజేస్తుంది.

కృ: పాపములను నశింపజేస్తుంది.
...
ష్ణ: ఆధిభౌతిక, ఆధిదైవిక దు:ఖాలను హరింపజేస్తుంది.

శ: జననమరణ, దు:ఖముల వంటివి లేకుండా జేసుంది.

ర: భగవత్ జ్ఞాన్నాన్ని కలుగజేస్తుంది.

ణ: భగవంతుని యందు ధృఢమైన భక్తిని కుదుర్చుతుంది.

మ: భవత్సేవను ఉపదేశంచేసే గురువునందు ప్రీతిని కల్గిస్తుంది.

మ: :భగవత్ సాయుజ్యాన్ని ఇస్తుంది. తిరిగి జన్మలేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

2) మంత్రం అనగానేమి?

మననాత్ త్రాయతే ఇతి మంత్ర:
మననం చేస్తే రక్షించేది మంత్రం.
అంటే ఇష్టమైన దైవము పేరును మనసులో స్మరిన్స్తూంటే అదే మిమ్మల్ని కాపాడుతంది అని ఉవాచ.

3) త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు లింగరూపంలో ఎందుకుంటాడు?

భృగుమహర్షి శాపంవల్ల పరమేశ్వరుడు, లింగరూపంలో ఉంటాడు. లింగానికి పూజిస్తేనే ఫలమెక్కువ.

4) జపం తర్వాత ఎంత నిగ్రహంగా ఉండాలి?

జపవిధి అయ్యాక వారిలో ఓ అపూర్వశక్తి వస్తుంది. వాక్కు సత్యమవుతుంది. జపం చేసిన తర్వాత పలికే
మాటలను ఎంతో వివేకంతో పలికితే మంచిది.
చెడు పలకటం ద్వారా వచ్చిన జపసిద్ధి పోవటమే గాక చెడుమాటలు భవిష్యత్తులో యధార్ధాలవుతాయి. మంచి మాటలు మాట్లాడితే మనసు మంచిగా ఉండటమేగాక, మంచి జరుగుతుంది.