Sunday, 1 April 2012

దశరథనందన రఘురామా! ధరణిజకామా,దానవభీమా!
దశముఖ మర్దన జయరామా!దశదిశ ప్రసరిత గుణధామా! ||దశరథ||

... భరతున కొసగిన పాద రక్షలు
భారతీయులకు రామ రక్షలు
భళిరా! మొదలిక అసురుల శిక్షలు!
భవ్య ధర్మ,జన రక్షణ దీక్షలు! ||దశరథ||

గోదావరి సరి వర విరజానది,
భద్రగిరి చరులు పాల జలధులు,
శ్రీ సతి, శ్రీ పతి, సీత, రఘుపతి
శేష ఫణి అచట లక్ష్మణు డిచట ||దశరథ||

భద్రునకిడితివి శుభ వరదానం
భద్రాచలమని నీకిక ధామం
భక్త జనులకది ఇల వైకుంఠం
పాహి వికుంఠం!నుత శ్రీకంఠం! ||దశరథ||