Thursday, 5 April 2012

హర్తుర్యాతి న గోచరం కిమపి శం పుష్ణాతి యత్సర్వదా-
ప్యర్థిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాప్నోతి వృద్ధిం పరామ్‌ ।
కల్పాంతేష్వపి న ప్రయాతి నిధనం విద్యాఖ్యమంతర్ధనం
యేషాం తాన్ప్రతిమానముజ్ఝత నృపాః కస్తైః సహ స్పర్ధతే ॥ 12

తాత్పర్యము: విద్య అనే ధనాన్ని దొంగలు అపహరించలేరు. దానివలన ఎల్లప్పుడూ సుఖము కలుగుతుంది, దానిని పరులకు యిచ్చిన కొద్దీ అది వృద్ది చెందుతూ వుంటుంది. ప్రళయ సమయమున కూడా అది నశించదు. ఇట్టి విద్యాధనుల ముందు సామాన్య ధనాధిపతులు గర్వము ప్రదర్శించరాదు. విధ్యాధనులనెదిరించుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. అనగా విద్వత్తుల ముందు వినయముగా నుండవలెనని భావము.



విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భొగకరి విద్య గురుండు విదేశ బంధుడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నెఱుంగని వాడు మర్త్యుడే---- (అదే తెలుగులో)