Sunday, 29 April 2012

వాస్తు పేరుతో చాలామంది ఘోర పాపాలు చేస్తున్నారు .

వాస్తు పేరుతో  చాలామంది ఘోర పాపాలు చేస్తున్నారు .మన ధర్మ శాస్త్రం  జ్యేస్ట్టే మ్రుత్యప్రదః అని  చెప్పి ఇంగ్లీష నెలల ప్రకారం సుమారుగా మే ,జూన్ ,నెలలో గృహ నిర్మానాలకి సెలవు ప్రకటించింది .
ఎందుకంటే ఆ నెలలలో నదులలో మత్య సంపద వృద్ధికి ఆటకం కలగకుండా ,భూగర్భ జలాలు అడుగిడకుండా ,కట్టే నిర్మాణాలు ఎండలకు దెబ్బతినకుండా,చెట్లు నరికితే ఎండలు ఎక్కువ అవుతాయి కావున కర్తరి పేరుతో వృక్ష సంరక్షణకి శాస్త్రం ఆవిధంగా చేస్తే ..మనవాళ్ళు ముహూర్తాలు అయిపోతాయి అంటూ అందరూ ఒకేసారి ఆరాట  పడటం ,పైగా వాన నిరు ఇంకకుండా గచ్చు చేయించటం ,ప్రతి చిన్న ఆటన్కానికి వాస్తు పేరుతో కొంపలు కూల్చి కట్టటం ఇదంతా పాపం కాదా?

అసలు ప్రారబ్దం లో లేనిది ఎక్కడనుండి వస్తుంది?
దశ  ని బట్టే దిశ .........జాతకం లో గేఉహ యోగం వుంటేనే ..అంటే కాకుండా ఆ గృహ యోగం శుభ  యుక్తమైతేనే.
అంతే కాని ప్రతివారు ఇల్లు తొంభై డిగ్రీ ల  తూర్పుకి కడితే గొప్పవారు అయిపోరు.

దయచేసి పర్యావరణాన్ని కాపాడండి.
కొన్ని దోషాలకి  మొక్కలని పెంచటం ద్వారా అద్భుతమయన  మంచి ఫలితాలు వస్తాయి ..నమ్మి ఆచరించండి.విత్తు నాతంగానే ఫలం కొరకండి ..కొంత సంయమనం పాటించండి.
కావాలంటే మెయిల్ ద్వారానో ఫోన్ ద్వారానో సంప్రదించండి.

అమ్మానాన్నలను సేవించండి ..గృహ దోషాలే కాదు గ్రహ దోషాలు పోతాయి .
అమ్మానాన్నలను తరిమి ఎంత ఇల్లు కడితే మాత్రం ,ఎవరు ప్లాన్ చేస్తే మాత్రం ఏమి కలిసి వస్తుంది.?
అమ్మ చేత అన్నం తినే ఇంట్లో ,తల్లి తండ్రులను సేవించే గృహం లో పార్వతి పరమేశ్వరులు ఖచ్చితంగా వుంటారు.ఇంకా దిగులు ,కస్టాలు ఎలా వుండగలవు.
నేను చెప్పేది ...సూర్యుడు తూర్పున వుదయిస్తాడు అన్నంత నిజ౦ .