Sunday, 8 April 2012


శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!



 ఈ పద్యంలో తెల్లని మల్లెలు, చల్లని వెన్నెల, స్వచ్ఛమైన కాంతులు ఎన్ని విధాలుగా ప్రకాశించగలవో అన్ని తెలుపురంగు కాంతుల ఉపమానాలతో అమ్మవారిని పోల్చడం జరిగింది. స్వఛ్ఛమైన ధవళకాంతులలో ఆమె నిండి వుంటుంది. అందుకే స్వచ్ఛమైన మనస్సు కలవారికి సమస్త విద్యలూ సంప్రాప్తిస్తాయి. సంగీత సాహిత్యాలు సరస్వతికి ఆటపట్టులు