Sunday, 29 April 2012

వాస్తు పేరుతో చాలామంది ఘోర పాపాలు చేస్తున్నారు .

వాస్తు పేరుతో  చాలామంది ఘోర పాపాలు చేస్తున్నారు .మన ధర్మ శాస్త్రం  జ్యేస్ట్టే మ్రుత్యప్రదః అని  చెప్పి ఇంగ్లీష నెలల ప్రకారం సుమారుగా మే ,జూన్ ,నెలలో గృహ నిర్మానాలకి సెలవు ప్రకటించింది .
ఎందుకంటే ఆ నెలలలో నదులలో మత్య సంపద వృద్ధికి ఆటకం కలగకుండా ,భూగర్భ జలాలు అడుగిడకుండా ,కట్టే నిర్మాణాలు ఎండలకు దెబ్బతినకుండా,చెట్లు నరికితే ఎండలు ఎక్కువ అవుతాయి కావున కర్తరి పేరుతో వృక్ష సంరక్షణకి శాస్త్రం ఆవిధంగా చేస్తే ..మనవాళ్ళు ముహూర్తాలు అయిపోతాయి అంటూ అందరూ ఒకేసారి ఆరాట  పడటం ,పైగా వాన నిరు ఇంకకుండా గచ్చు చేయించటం ,ప్రతి చిన్న ఆటన్కానికి వాస్తు పేరుతో కొంపలు కూల్చి కట్టటం ఇదంతా పాపం కాదా?

అసలు ప్రారబ్దం లో లేనిది ఎక్కడనుండి వస్తుంది?
దశ  ని బట్టే దిశ .........జాతకం లో గేఉహ యోగం వుంటేనే ..అంటే కాకుండా ఆ గృహ యోగం శుభ  యుక్తమైతేనే.
అంతే కాని ప్రతివారు ఇల్లు తొంభై డిగ్రీ ల  తూర్పుకి కడితే గొప్పవారు అయిపోరు.

దయచేసి పర్యావరణాన్ని కాపాడండి.
కొన్ని దోషాలకి  మొక్కలని పెంచటం ద్వారా అద్భుతమయన  మంచి ఫలితాలు వస్తాయి ..నమ్మి ఆచరించండి.విత్తు నాతంగానే ఫలం కొరకండి ..కొంత సంయమనం పాటించండి.
కావాలంటే మెయిల్ ద్వారానో ఫోన్ ద్వారానో సంప్రదించండి.

అమ్మానాన్నలను సేవించండి ..గృహ దోషాలే కాదు గ్రహ దోషాలు పోతాయి .
అమ్మానాన్నలను తరిమి ఎంత ఇల్లు కడితే మాత్రం ,ఎవరు ప్లాన్ చేస్తే మాత్రం ఏమి కలిసి వస్తుంది.?
అమ్మ చేత అన్నం తినే ఇంట్లో ,తల్లి తండ్రులను సేవించే గృహం లో పార్వతి పరమేశ్వరులు ఖచ్చితంగా వుంటారు.ఇంకా దిగులు ,కస్టాలు ఎలా వుండగలవు.
నేను చెప్పేది ...సూర్యుడు తూర్పున వుదయిస్తాడు అన్నంత నిజ౦ .

Wednesday, 25 April 2012

శ్రీమచ్చంకరాచార్య కృత శివమానస పూజ:
 















౧.రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం!నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం!జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా!దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం!!

౨.సౌవర్ణే మణిరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం!భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం!శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం!తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీ...కురు!!
౩.ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం!వీణాభేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యం తథా!సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా!సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో!!

౪.ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం!పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః!సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో!యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్!!

౫.కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా!శ్రవణ నయనజం వా మానసం వాపరాధం!విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ!జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో

Saturday, 21 April 2012

నాలుకతో జాగ్రత్త..
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్రబాంధవః

జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం

సంపదలు, బంధుమిత్రులు, అనుబంధాలు, మరణము - అన్నీ నాలుక చివరే ఉంటాయి. అంటే ఏదీ శాశ్వతం కాదు. కనుక నాలుకతో ఎప్పుడూ జాగ్రత్తగా మాట్లాడాలి. మంచి మాటలవల్ల ఎంత లాభమో, దురుసుగా మాట్లాడ్డం వల్ల అంత నష్టం కలుగుతుందని గ్రహించాలి.

Friday, 20 April 2012

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన:
(భగవత్ గీత 9 - 26)

క..
... దళమైన బుష్పమైనను, ఫలమైనను సలిలమైన బాయని భక్తిం
గొలిచిన జను లర్పించిన, నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్.
(పొతన భగవతం..దసమ స్కందం..కుచేలొపాక్యనం)

Monday, 16 April 2012


తర్పణం వదిలే నువ్వులు,నీళ్ళు మొదలగునవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి?

ఈ కర్మలలో నువ్వులు,నీళ్ళు మొదలగునవి వదులుతారు కదా? మరి అవి చనిపోయినవారికి ఎలా చేరుతాయి అనే సందేహము వస్తుంది. బ్రతికిఉన్నవారికి ఏమైనా ఇస్తే వాళ్ళు పుచ్చుకొంటారు. మరి చనిపోయినవారికి ఎలా అందుతాయి?
ఒక చిన్నకథ ద్వారా దీనిని అర్థం చేసుకోవచ్చు.

ఒక పెద్దమనిషి తన కుమారుణ్ణి చదవటానికి పట్టణంలో వదలి పెట్టినాడు. ఆ పిల్లవాడు పరీక్షకు డబ్బుకట్ట వలసి వచ్చింది. వెంటనే తండ్రికి నీవు డబ్బును మని యార్డరు చేయవలసినదని కోరినాడు. కుమారుడు అడిగిన డబ్బు తీసుకొని తండ్రి తపాలా ఆఫీసుకు వెళ్ళినాడు. ఈ పెద్దమనిషి ఒక పల్లెవాడు,అమాయకుడు. డబ్బును తంతీ(Telegram) ఆఫీసు ఉద్యోగికి అప్పచెప్పి దానిని పంపవలసిన దని కోరినాడు- తంతుల ద్వారా ఆ డబ్బు ఉద్యోగి పంపుతాడని, ఆ అమాయకుడు అనుకొన్నాడు. ఉద్యోగి డబ్బును తీసి, మేజాలో భద్ర పరచి, సరే పంపుతాను'- అని అన్నాడు. 'నే నిచ్చిన డబ్బు నీదగ్గరే వుంచుకొన్నావే ? అది మా వాడికి ఎట్లా పోయి చేరుతుంది?' అని అతని ప్రశ్న. 'ఎట్లా చేరుతుందా? ఇదో ఈ విధంగా' అని అతడు టెలిగ్రాఫ్ మీద తంతిని పంప సాగినాడు. డబ్బు ఇక్కడే వున్నదే? ఇతడేమో పోయి చేరుతుంది అని అంటున్నాడే. ఇదెట్లా సాధ్యం? అని పల్లెటూరి వాని సందేహం సందేహంగానే నిలచిపోయింది. మనియార్డరు మాత్రం పిల్లవానికి సురక్షితంగా పోయి చేరింది.

మనం పితరులకూ(అంటే చనిపోయినవారికి), దేవతలకూ అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే చేరవలసిన చోటుకుపోయి చేరుతాయి. శాస్త్రసమ్మతంగా మనం ఈ క్రియలను నిర్వర్తిస్తే పితృదేవతలు అవి ఎవరికి పోయి చేరవలయునో వారికి చేరేటట్లు చూస్తారు. ఒకవేళ చనిపోయినవారు ఆసరికే ఎక్కడో జంతువులుగానో లేక మనుషులుగానో లేక మరే విధముగానో పుట్టిఉంటే వారికి ఆహారరూపములోనో లేక మరే ఉపయోగకరమైన వస్తువుల రూపముగానో వారికి చేరుతాయి. ఈ విధంగా వస్తువులను తగిన రూపంలో చేరవేయటానికి వలసిన స్తోమతను పితృ దేవతలకు భగవంతుడుఇచ్చి వున్నాడు. అందు చేత శ్రాద్ధంలో మనము అర్పించే వస్తువులను స్వీకరించే దానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పనిలేదు.

శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసిన క్రియ అని అర్థము.
ఒక ఉత్తరం వ్రాసి దాన్ని పోష్టు చేయబోతూ " ఈ తపాలాపెట్టె (పోష్టుబాక్సు) అందముగాలేదు, నా వద్ద ఇంతకంటే మంచి పెట్టె ఉంది. అందులో వేస్తాను" అని అనుకొంటే ఆ ఉత్తరం చేరవలసిన వారికి చేరుతుందా? అందుచేత మనం ఏ పని చేయాలన్నా మనము సఫలము కావాలి అనుకొంటే వాటివాటి విధులను పాటించాలి. పెద్దలు అందులకే 'యథాశాస్త్రం, యథావిధి' అన్నారు. కర్మ సఫలం కావాలంటే శాస్త్రవిధులను పాటించక తప్పదు.
ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం - 1
రరోరరే రరరురో
రురూరూరు రురోరరే |
రేరే రేరారారరరే
రారేరారి రి రారిరా ||
... పదవిభాగం -
ర, రోః, అరేః, అర, రురోః, ఉః, ఊరూరుః, ఉరః, అరరే, ర, ఈరే, రీరారా, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
అన్వయం -
ర, రోః, అర, రురోః, అరేః, ర, ఈరే, ఉరః, అరరే, రీరారా, ఊరు + ఊరుః, ఉః, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
ప్రతిపదార్థాలు -
ర = రామశబ్దంలోని రేఫ (రకారం) వలన
రోః = భయం కలవాడైన,
అర = వేగంగా పరుగెత్తే
రురోః = హరిణరూపంలో ఉన్న మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని యొక్క
ర = కౌస్తుభమణిని
ఈరే = పొంది ఉన్న
అరః + అరరే = కవాటంవంటి వక్షస్థలంలో
రీరారా = లీల నాపాదించే (రలయో రభేదః)
ఊరు + ఊరుః = తొడలచే గొప్పదైన
ఉః = సీత భూమిక దాల్చిన లక్ష్మిని
అరరర = తన నిలయానికి తీసికొని వెళ్ళిన
ఇరార = సముద్రద్వీపాన్ని (లంకను) పొంది ఉన్న
ఇరారి = భూమికి విరోధి అయిన రావణునకు
రిః = నాశనాన్ని కల్గించిన దగుచు
ఆరి = చెలికత్తెలను
రా = పొందింది.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి)

Tuesday, 10 April 2012

ధ్య్తాన మూలం గురోర్మూర్తి:
పూజా మూలం గురో: పదం |
మంత్ర మూలం గురోర్వాక్యం
మోక్ష మూలం గురో: కృపా||
"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "
సుతుడు - పితరుడు

భగవద్గీతకు నాయకుడు శ్రీకృష్ణుడయితే శబరిమల కధానాయకుడు అయ్యప్ప. భగవద్గీతలో మురహరి ఆత్మసారాన్ని 18 అధ్యాయాల్లో చెబితే,అయ్యప్ప ఇదే ఆత్మసారాన్ని 18 పడిమెట్ల రూపంలో వివరించాడు. అంతర్గతంగా భగవద్గీత యోగసారమైతే అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లు జీవితానుభవసారం. భవగీతలోని 18 అధ్యాయాలకూ అయ్యప్ప గుడిలోని 18 పడిమెట్లకు ఎన్నో సారూప్య, సామీప్య జ్ఞాన, యోగ సంబంధాలున్నాయి. మోక్షసాధనకు, ఆత్మవిచారానికి శబరిమలేశుని సన్నిధిలోని 18 మెట్లు వంటివే భగవద్గీతలోని 18 అధ్యాయాలు, శబరిమలోనున్న 19 మెట్లయందు కొలువైన దేవతలూ, భగవత్గీతలోని 18 అధ్యాయాలు ప్రతిబింబిస్తున్న 18 మంది దేవతలూ ఒకరే కావటం ఒక విశేషం, వారు "-

శ్లో!! గీతాగంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ,
...బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తి గేహినీ,
అర్ధమాత్రా చిదానందా భవఘ్నే భయనాశినీ,
వేదత్రయా పరానంతా త్వత్త్వర్ధా జ్ఞానమంజరీ,
ఇత్యేతాని జపన్నిత్యం నరో నిశ్చలమానస,
జ్ఞానసిద్ధిం లభేత్ శీఘ్రం తధాంతే పరమంపదం.
వరాహపురాణం.
శ్రీరాముడు - అయ్యప్ప

శబరి మాతకు వరమిచ్చి మరికొంతదూరం వెళ్ళిన స్వామికి రామానామం అవిశ్రాంతంగా జపిస్తూ, రామధ్యానంలోనున్న ఆంజనేయుడు తారసపడ్డాడు. ఆంజనేయుని భక్తికి ముచ్చటపడిన మణికంఠుడు ఆంజనేయునికి మరొకసారి రాముని దర్శనం కలిగించాలని ఆశించాడు. ఆ వెంటనే నాయనా! ఆంజనేయా! ఇదిగో నీ రాముణ్ణి వచ్చాను. కనులు తెరిచి చూడు అంటూ ప్రశాంతంగా పలికాడు. కనులు తెరిచిన హనుమాంకు రాముడి బదులు వేరెవరో కనబడటం విసుగు కలిగించినది. నా రాముడినంటూ ప్రగల్భాలు పలకడం నీకు తగదు అని వారించాడు. నాయనా! నేను ప్రగల్భాలు పలకడం లేదు, ప్రశాంతంగా ఒక్కసారి కళ్ళు తెరిచి తీక్షణంగా చూడు. నీకు రాముడు తప్పక దర్శనమిస్తాడు. ఇదిగో నేనే నీ రాముణ్ణీ అని చిద్విలాసంగా పలికాడు మణికంఠుడు. ఈసారి కేసరీసుతుడు తదేకంగా చూసాడు. విల్లమ్ములు ధరించిన శ్రీరాచంద్రమూర్తి కనబడ్డాడు అయ్యప్పస్వామిలో. ఒక్క క్షణం జరిగినదేమిటో గ్రహించలేక తత్తరపడిన ఆంజనేయుడు ఆనందంతో లేచి స్వామికి అబివందనం చేసాడు. మనసారా ఆశీస్సులందించాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. దేవదేవులు సైతం ఈ తతంగం చూసి ముచ్చటపడ్డారు. యుగాలు మారినా మారని ఆంజనేయుని శ్రీరామభక్తికి ఇదొక చక్కని తార్కాణం. అయ్యప్ప కరుణకు ఇదొక ఉదాహరణ, అలా ముందుకు సాగాడు మహోన్నతుడైన మణికంఠుదు
అయ్యప్ప స్వామి - ఇరుముడి

ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్ధం, ఆ రెండిటిలో ఒకదానిలో నేతి కొబ్బరికాయని ఉంచుతారు.మరొక దానిలో భక్తులు దారిలో వండుకుతినటానికి కావలసిన పప్పుదినుసులు, దారిలో దేవుళ్ళకు కొట్టే కొబ్బరికాయలు ఉంచుతారు. నేతి కొబ్బరికాయతోనే స్వామికి అభిషేకం చేస్తారు. మూడు కన్నుల కొబ్బరికాయ పరిపూర్ణంగా శివ స్వరూపమే. ఏనెయ్యి అయినా విష్ణుస్వరూపంగా చెప్పబడుతుంది. ఇక,శ్రీమహాలక్ష్మిగా చెప్పబడేది ఆవునెయ్యి, అంటే నేతి కొబ్బరికాయ అంటే శివకేశవ. శ్రీమహాలక్ష్మిల సంపూర్ణ స్వరూపం అన్నమాట. అంటే సకల దేవతలను ఆరాధించడమే తన సంపూర్ణతత్వమని అలా ఏ బేధభావాలు లేనివారే తనకు అత్యంత ప్రీతి పాత్రులవుతారని స్వామి సందేశం. ఇలా దేవదేవుల పరిపూర్ణ స్వరూపం గనుకనే, నేతికొబ్బరికాయను పొందియుండే ఇరుముడిని ఎంతో పవిత్రంగా చూడాలని అంటారు. అందుకే, గురుస్వామిగనీ,లేదా శబరికొండకు మూడు సార్లుపైగా వెళ్ళి వచ్చిన వారు గానీ ఇరునుడిని క్రిందకు దించే అర్హతను పొందియుంటారే తప్ప కొండకు వెళ్ళే అందరూ ఎవరికి వారు ఇరుముడిని దించుకోవాడానికి అర్హతను పొందిఉండరు. ఏ బృందంలోనైనా మూడు సార్ల కంటే తక్కువగా వెళ్ళుతున్న వారి ఇరుముడిని గురుస్వామిగానీ, బృందంలో ఎక్కువసార్లు కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకున్నవారుగానీ దింపుతారు. ఇరుముడి ఇంత శ్రేష్టమైనది గనుకనే, పూర్వపు రోజులలో అయితే, ఇరుముడి లేనివారిని అసలు స్వామి దర్శనానికి అనుమతించేవారు కానేకాదు. కానీ కాలంతో ఏర్పడిన మార్పులతో దేవాలయ విధానాలలో కూడా కొన్ని మార్పులు చొటుచేసుకోవడంతో ఇరుముడి లేని వారికి కొంత సర్దుబాటుతో దేవాల ప్రవేశార్హత కలుగజేస్తున్నారు.
అనన్య భక్తి" యనునది పూర్వజన్మ సంచిత సుకృతవిశేషము చేతనే లభ్యము కావలసినది. ఐనను నిట్టి భక్తి భౌతికవిషయములను విడుచుటవలనను, దుస్సంగత్యాగము వలనను అల్వడ జేసికొనవచ్చుననియు, అఖండ నామసంకీర్తనము కూడా భక్తికి దోహదకారి యనియు నారదముని మతము.

ఇక శివానంలదహరిలో " భక్తి" నిర్వచన మిట్లు కలదు :
...
"అంకోలం నిజబీజసంతతి రయస్కాంతోఫలం సూచికా
సాధ్వీ నైజపతిం లతా క్షితిరుహం సింధు స్సరిద్వల్లభం!
ప్రాప్నోతీహ యధా తధా పశుపతే: పాదారవిందద్వయం
చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా "భక్తి" రిత్యుచ్యతే!!

ఊడుగు చెట్టు క్రింద బడిన తన గింజల నాకర్షించుట ఆ చెట్టునకు సహజము. కనుక నెండిన గింజ లన్నియు చెట్టు మొదటకు వచ్చిచేరును. ఇట్లే సూదంటురాయికి సూది నాకర్షించుట సహజముగాన, సూది సూదంటురాయిని జేరును. ఇదేవిధముగా పతివ్రత తన పతిని సహజముగా వచ్చి చేరినట్లును, లత తన కండగానున్న చెట్టుమీద కెగబ్రాకినట్లును, నది సహజముగనె సముద్రుని జేరుకొని యందు సంగమించినట్లును, సహజభక్తితో పరమేశ్వరుని పాదారవిందములను జేరిన మానసికవృత్తియే "భక్తి" యనిపించుకొనును.

ఇక పరమ భక్తుడు తన పూర్వకర్మ ననుసరించి లౌకికకృత్యములందు వ్యాపృతుడయ్యును, అతని మానసికవృత్తి మాత్రము పరమేశ్వ భజనమందే లగ్నమై యుండును.

ఉదాహరణగా ఈ క్రింది పద్యములో చక్కగా వివరణ యివ్వబడినది :

"పుంఖానుపుంఖ విషయేక్షణతత్పరోపి
బ్రహ్మావలోక నధియం న జహాతి యోగీ!
సంగీత తాళలయ వాద్యవశంగతాపి
మౌళిస్థకుంభ పరిరక్షణధీ ర్నటీవ !!

తన చుట్టూ వాద్యాదుల సరభసధ్వను లెన్నియో బుద్ధి నాకర్షించి తన మనస్సును చెదర జేయుచున్ననూ, తన శిరమునందు ఘటము నిలిపి నాట్యము సేయుచున్న యుత్తమనటి తన శిరమునందున్న ఘటమునందే తన బుద్ధిని కేంద్రీకరించి నటించినట్లు బ్రహ్మజ్ఞానసంపన్నుడైన యోగి (భక్తుడు) కర్మ వశమున లౌకిక కార్యములందు వర్తించుచున్నను తన మానసమును మాత్రము పరమేశ్వర భజనమునందే లగ్నము చేయును. ఇట్టిది పరమభక్తునికి సహజసిద్ధమైనది.

 కంచి పరమాచార్యులవారనుకుంటాను- ఈ శ్లోకానికి వ్యాఖ్యానిస్తు ఇలా అన్నారు.
అంకోలం…. సార్క్ష్య ముక్తి ( దగ్గర వరకు వెళ్ళుట)
అయస్కాంతో…. సామీప్య ముక్తి
సాధ్వీ నైజ…. సాలోక్య ముక్తి
లతా క్షితి….. సారూప్య ముక్తి
సింధు స్సరిద్వల్లభం… సాయుజ్య ముక్తి
అని. (చెట్టుకి లత అల్లుకుంటే చెట్టు ఆకారాన్నే పొందుతుంది) మిగతావి ఇలానే అన్వయం.
‎1)ధనుర్మాసంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఆ విశేషాలేమిటి?

ఇంటిముందు ముగ్గులువేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు.

లక్ష్మీ రూపంలో నున్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులువేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.
...
2)పూర్వకాలంలో తుఫానువంటి ఉపద్రవాలొస్తున్నాయని ఎలా కనిపెట్టారు?

తేనెపట్టులోని తేనెటీగలు బయటికొచ్చి ఝంకారనాదాలు పెడుతుంటాయి.

పావురాళ్ళు గమ్యం లేకుండా తిరుగుతూ అలజడిగా అరుస్తూంటాయి.

కుక్కలు చెవులు విప్పార్చి ఒకింత భయంతో తుఫాన్ దిశగా చూస్తాయి.

అడవిలోని ఏనుగులు గుంపులు గుంపులుగా అటూ ఇటూ పరిగెడుతాయి.
కొన్ని జంతువులు ఆహారం కోసం బయటికి రాకుండా లోపలే ఉండిపోతాయి.

ఆవులు, మేకలు వర్షపు రాకను పసిగట్టి ఎప్పటిలా కాక విరుద్ధంగా అరుస్తాయి.


3) భార్య ఏయే సేవలు చేస్తుంది?

ఎక్కడో పుట్టి పెరిగి మీ నీడకొస్తుంది.
మీ వంశాన్ని నిలబెడుతుంది.
సంసారాన్ని చక్కదిద్దుతుంది.
గృహన్ని సైనికులా కాపాడుతుంది.
భర్త కీర్తిప్రతిష్ఠల్ని పెంచేలా ప్రవర్తిస్తుంది.
ఆఖరున వృద్ధాప్యంలో కూడా చేతనయినంత సేవచేస్తుంది.

భార్య నుంచి అన్నీ పొందాడు కాబట్టే పరమశివుడు
మొదటి భార్యకు అర్ధశరీరాన్ని -
రెండవ భార్యను శిరస్సు నందు, అలాగే

శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వక్ష:స్థలమందూ -

బ్రహ్మదేవుడు చదువుల తల్లి సరస్వతి దేవికి
ముఖమునందు స్థానమేర్పరచి తమయొక్క ప్రేమను చాటుకున్నారు.

4) మంగళసూత్రాల్లో గుబ్బ ఎందుకుంటుంది?

ఆ ప్రదేశంలో వాయువు చేరుతుంది. ఊపిరి తిత్తులూ, గర్భకోశము కలిసే నరాలవద్ద ఆ మంగళసూత్రాలు తాకుతాయి.

అలా బంగారు సూత్రాలు తాకినప్పుడు గుబ్బలోని వాయువులు ఆమెకి పుట్టబోయే బిడ్డలకు మంచి చేస్తాయని శాస్త్రము చెపుతుంది.

5) తల్లీ,తండ్రీ గొప్పతనం గురించి శాస్త్రాలలో ఏమి చెబుతుంది?

ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి.
ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించిన, గోవును దానం చేసిన ఫలము దక్కును.

సత్యం తల్లి...జ్ఞానము తండ్రి.

పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.
వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.

ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది.

ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధయాగాలు చేసినా పోదు.

తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.
) దేవాలయ వాతావరణంలో నూతన శక్తి మనలొ ఎందుకొస్తుంది?

గుడిగంటలూ,శంఖనినాదాలూ, మంత్రాలూ, మనిషిలోని వినికిడిశక్తిని ఉధృతం చేస్తాయి. భగవంతునికి అర్పించే పుష్పాల్లోని సువాసనలు ఘ్రాణశక్తిని తట్టిలేపుతాయి.

స్వామి ప్రసాదంలో రోజూవారీ మనం వాడనివి ఉదాహరణకు పచ్చకర్పూరం వంటివి వేస్తారు. మనిషి అలోచనల్ని ధర్మమార్గం వైపు తీసుకెళ్ళే శక్తి ప్రసాదంలో ఉంది.
...
నుదుటున పెట్టుకునే చందనపు బొట్టూ, చెవిలో పెట్టుకొనే తులసివల్ల రక్తప్రసరణ పెరిగి శరీరం ఆరోగ్యవంతమవుతుంది.

2) నవరత్నాల ఉంగరాన్ని ధరించమని శాస్త్రాలు ఎందుకు చెప్పాయి?

మనిషి శరీరంలో తొమ్మిది ధాతువులు ఉన్నాయి. వాటి పరమార్ధాన్ని చెప్పేవే నవరత్నాలు. రక్తం పగడానికీ, ఎముకలు ముత్యానికీ, పుష్యరాగము మాంసానికీ, శిరోజాలు నీలానికీ, వైడూర్యానికి క్రొవ్వూ, గోమేధానికి బలమూ, కెంపునకు వీర్యమూ, వజ్రానికి వెన్నుపూసా, పచ్చకు గోళ్ళు సూచికలు.

అసలైనసిసలైన నవరత్నాలు దొరకటము, ధరించటం చాలా కష్టమే.


3) ప్రొద్దున లేవగానే ఎవరి మొహం చూశావు అని అంటారు గదా? అందులో ఉన్నటువంటి అంతరార్ధమేమిటి?

మనిషి శరీరం ఓ విద్యుత్ కేంద్రం. రాత్రంతా నిద్రపోయి మెలకువ రాగానే కనులు తెరచినప్పుడు దేహంలోని విద్యుత్ శక్తి కనులద్వారా బయటికి వస్తుంది.
మనకు ఎదురైన మనిషిలో దేహశక్తి ఎక్కువైతే ఆ ప్రభావం మనమీద పడుతుంది. అదే వారి దేహశక్తి తక్కువైతే మన ప్రభావం వారిమీద పడుతుంది.

శరీరమూ, మనస్సూ, బ్యాలెన్సు తప్పి చేయకూడని కార్యాలు చేసి ఊహించని సమస్యను తెచ్చుకుంటారు. అలా కాకూడదని లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుని ఆపై లేచి భగవంతుని పటాన్ని చూడమంటారు.
ఆది శంకరులు జన్మించిన పుణ్యక్షేత్రమేది?
కాలడి

... అనిమేషులు అంటే ఎవరు?
రెప్పపాటు లేనివారు దేవతలు

వాల్మీకి ఎవరి పుత్రుడు?
ప్రచేతనుడు.

వైదికకాలంలో " ఓక:సారి" అంటే ఏమిటి?
పిల్లి

ధారణ,ధ్యానం, సమాధి - ఈ మూడింటిని కలిపి అష్టాంగయోగంలో ఏమంటారు?
సంయమమం

సామవేదం ఏ మహర్షికి భోధించబడినది?
జైమిని

రామాయణంలో వాల్మీకి నహర్షి అదీనవాది అని ఎవరిని వర్ణిస్తాడు?
హనుమంతుడు.

అహం బ్రహ్మాస్మి అను మహా వాక్యము ఏ వేదములోనిది?
యజుర్వేదం.

ద్రౌపది స్వయంవరం ఏ నగరంలో జరిగినది?
కాంపిల్య

నూరు దివ్యాస్త్రాలను సృష్టించిన దక్షప్రజాపరి కుమర్తెలెవరు?
జయ, సుప్రజ

ఉజ్జయిని పాత పేరేమి?
అవంతిక

ఒక పువ్వు ఆకారంలో ఉన్న 100 నక్షత్రాల కలయికను మనం ఏ నక్షత్రం అని పిలుస్తాము?
శతభిషం

ఓంకారాన్ని ఉపాసించటం ఏ ఉపనిషత్ లో కనిపిస్తుంది?
మాండుక్యోపనిషత్

పూర్వజన్మలో అంజనాదేవి ఎవరు?
పంజికస్థల అనే అప్సరస.

వాలిసుగ్రీవుల తండ్రి ఎవరు?
ఋక్షరజసుడు


భార్యభర్తల మధ్య సంవాదం ఏ ఉపనిషత్తు లో కనిపిస్తుంది?
బృహదారణ్యాక ఉపనిషత్తు

లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించిన నక్షత్రము ఏది?
ఆశ్లేష

భరతుడు జన్మించిన నక్షత్రం, లగ్నం ఏమిటి?
పుష్యమి, కర్కాటక రాశి, మీనలగ్నం

వేదమంత్రాలను ఏమంటారు?
రుక్కులు

జ్యోతిష్య శాస్త్రానికి మరో పేరేమి?
ఆత్మవిద్య.

కలియుగం ఎన్ని సంవత్సరాలు?
43,2000

వీణ ఎవరి రధానికి జెండా మీద చిహ్నంలా కనిపిస్తుంది?
రావణుడు.

Sunday, 8 April 2012

శ్రీకృష్ణ మహామంత్రం అర్ధం:-

శ్రీ: సౌభాగ్యమునిస్తుంది.ధనమును,లోకప్రియత్వములు కలుగజేస్తుంది.

కృ: పాపములను నశింపజేస్తుంది.
...
ష్ణ: ఆధిభౌతిక, ఆధిదైవిక దు:ఖాలను హరింపజేస్తుంది.

శ: జననమరణ, దు:ఖముల వంటివి లేకుండా జేసుంది.

ర: భగవత్ జ్ఞాన్నాన్ని కలుగజేస్తుంది.

ణ: భగవంతుని యందు ధృఢమైన భక్తిని కుదుర్చుతుంది.

మ: భవత్సేవను ఉపదేశంచేసే గురువునందు ప్రీతిని కల్గిస్తుంది.

మ: :భగవత్ సాయుజ్యాన్ని ఇస్తుంది. తిరిగి జన్మలేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

2) మంత్రం అనగానేమి?

మననాత్ త్రాయతే ఇతి మంత్ర:
మననం చేస్తే రక్షించేది మంత్రం.
అంటే ఇష్టమైన దైవము పేరును మనసులో స్మరిన్స్తూంటే అదే మిమ్మల్ని కాపాడుతంది అని ఉవాచ.

3) త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు లింగరూపంలో ఎందుకుంటాడు?

భృగుమహర్షి శాపంవల్ల పరమేశ్వరుడు, లింగరూపంలో ఉంటాడు. లింగానికి పూజిస్తేనే ఫలమెక్కువ.

4) జపం తర్వాత ఎంత నిగ్రహంగా ఉండాలి?

జపవిధి అయ్యాక వారిలో ఓ అపూర్వశక్తి వస్తుంది. వాక్కు సత్యమవుతుంది. జపం చేసిన తర్వాత పలికే
మాటలను ఎంతో వివేకంతో పలికితే మంచిది.
చెడు పలకటం ద్వారా వచ్చిన జపసిద్ధి పోవటమే గాక చెడుమాటలు భవిష్యత్తులో యధార్ధాలవుతాయి. మంచి మాటలు మాట్లాడితే మనసు మంచిగా ఉండటమేగాక, మంచి జరుగుతుంది.

శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!



 ఈ పద్యంలో తెల్లని మల్లెలు, చల్లని వెన్నెల, స్వచ్ఛమైన కాంతులు ఎన్ని విధాలుగా ప్రకాశించగలవో అన్ని తెలుపురంగు కాంతుల ఉపమానాలతో అమ్మవారిని పోల్చడం జరిగింది. స్వఛ్ఛమైన ధవళకాంతులలో ఆమె నిండి వుంటుంది. అందుకే స్వచ్ఛమైన మనస్సు కలవారికి సమస్త విద్యలూ సంప్రాప్తిస్తాయి. సంగీత సాహిత్యాలు సరస్వతికి ఆటపట్టులు
Press with thumb for 5 seconds & release for 3 seconds, in the affected point. Repeat for 2-3 minutes for 5 to 10 days. u will get relief....dont forget to share...it costs nothing..it may be useful to some one .....plz share....

Friday, 6 April 2012

ధర్మ సూక్ష్మాలు ౫

నాగులచవితికి పుట్టలో పాలు పోస్తే సంతానం కలుగుతుందా?

కార్తీకశుద్ధ చవితినాడు, తర్వాత వచ్చే నాగపంచమి రోజు సంతానం కోసం నానబెట్టి మొలకెత్తిన ధాన్యములతోనూ, పాలతోనూ నాగపుట్టను పూజించి పాలు పోస్తారు. ఇలా చెయ్యటం భక్తితోపాటు, సంతానవంతులయ్యే విశేషం కూడా ఉంది. కొత్త ధాన్యముల ప్రసాదాన్ని స్వీకరించటము వల్లా, పుట్ట వద్ద పూజచేస్తూ స్పందించటంవల్ల, స్త్రీలలో నాడీమండలం ఉత్తేజం పొంది సంతానవంతులయ్యే అవకాశాలెక్కువ.

సుందరకాండాలో అరిష్టపర్వతమున్నదా?
...
పర్వతం పేరే అరిష్టం, దానిపై ఎక్కిన హనుమంతుడిని అదృష్టం వరించింది కదా మరి.

ఏ శివాలయంలో పూజ చేస్తే ఏ ఫలం?

శిధిలమవనున్న శివాలయంలో అభిషేకం చేస్తే మహామహిమాన్వితమైన జ్యోతిర్లింగంలో చేసిన అభిషేకానికి పదిరెట్లు ఫలం.
 
సంఖ్యాశాస్త్ర ప్రకారం పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలి?

ఆడపిల్లలకి బేసి సంఖ్యతో, మగపిల్లలకి సరి సంఖ్యతో వచ్చే పేర్లు పెట్టాలి.

ఏ సుగుణం ద్వారా ఏది సిద్ధిస్తుంది?
...
సామర్ధ్యం ద్వారా అధికారం, జ్ఞానం చేత వైరాగ్యం, దానం చేత కీర్తి, మర్యాద,వినయం ద్వారా సంపద లభిస్తాయి.
ప్రియమైన పలుకుల ద్వారా మంచి మిత్రులు, భక్తి ద్వారా భగవంతుని ఆశీర్వాదం అందుతాయి.

ఏ సంతానాన్ని దానమివ్వాలి?

పెద్ద కొడుకు తొలి సంతానం, దైవ సంతానం, చివరి కొడుకు జ్ఞాన సంతానం, కనుక మధ్య సంతానం కామసంతానం, కాన వాడిని దత్తత ఇవ్వాలి.

జననలోపాల నివారణకు మర్రి ఆకులలో భోజనం చేస్తే నయమవుతుబ్దా?

పుట్టుకతో వచ్చే జననలోపాలను సరిదిద్దే శక్తి ఒక్క మర్రి ఆకులలో ఉంది. గర్భిణీ స్త్రీలు ఈ ఆకులలో భోజనం చేయటం చాలా ఉత్తమం.

ఆత్మ ఎలాఉంటుంది?

తామర మొగ్గ ఆకారంలో ఉండే మన హృదయంలో వరికంకి గింజంత చిన్నదిగా, సన్నగా దివ్యకాంతితో, పసుపుపచ్చ వర్ణంతో అణువంతగా మహోజ్జ్వలంగా వెలిగిపోతుందని మంత్రపుష్పంలోని శ్లోకం ఆధారాంగా తెలుస్తోంది.

ఏ దేవాలయాలు ఏ దిశగా ఉంటాయి?
పరమేశ్వరుని ఆలయం ఈశాన్యదిశలో, శ్రీమహావిష్ణువు ఆలయం పశ్చిమ దిశలో, సకలజీవకోటికి అన్నప్రదాత సూర్య భగవానుడి ఆలయం తూర్పు దిశగా, దుర్గాదేవి అమ్మవారి ఆలయం ఉత్తరవైపుగా, అదే బ్రహ్మ ఆలయం నిర్మిస్తే నగరం మధ్యభాగంలో ఉంటుంది.

హనుమ విజయ మంత్రం

హనుమ విజయ మంత్రం.సకల కార్య సిద్ధిని కలుగ చేస్తుంది.

Thursday, 5 April 2012

హర్తుర్యాతి న గోచరం కిమపి శం పుష్ణాతి యత్సర్వదా-
ప్యర్థిభ్యః ప్రతిపాద్యమానమనిశం ప్రాప్నోతి వృద్ధిం పరామ్‌ ।
కల్పాంతేష్వపి న ప్రయాతి నిధనం విద్యాఖ్యమంతర్ధనం
యేషాం తాన్ప్రతిమానముజ్ఝత నృపాః కస్తైః సహ స్పర్ధతే ॥ 12

తాత్పర్యము: విద్య అనే ధనాన్ని దొంగలు అపహరించలేరు. దానివలన ఎల్లప్పుడూ సుఖము కలుగుతుంది, దానిని పరులకు యిచ్చిన కొద్దీ అది వృద్ది చెందుతూ వుంటుంది. ప్రళయ సమయమున కూడా అది నశించదు. ఇట్టి విద్యాధనుల ముందు సామాన్య ధనాధిపతులు గర్వము ప్రదర్శించరాదు. విధ్యాధనులనెదిరించుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. అనగా విద్వత్తుల ముందు వినయముగా నుండవలెనని భావము.



విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భొగకరి విద్య గురుండు విదేశ బంధుడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నెఱుంగని వాడు మర్త్యుడే---- (అదే తెలుగులో)
కాళిదాసళిదాయోమా చంద్రంతేరిపురంజకమ్ |
కంజరంపురితేంద్రంచ మాయోదాళిసదాళికా|
(ఈ శ్లోకాన్ని ఎటునుండి చదివినా ఒక్కటే!)
కాకాననదేదేవివిసాసాహహభూభూ
రారాదదరారామమనానామమహేహే |
యాయామమఖేఖేదదనానాఘఘనానా
త్వంత్వంగగదాదావవనీనీతతమామా ||

... పదవిభాగం -
కాక, అననదే, దేవి, విసాసా, హహ, భూభూః, ఆరాత్, అదరా, రామమనాః, నామ, మహా, ఈహే, యాయాః, మమ, ఖే, ఖేదద, నానా+అఘ, ఘన, అనా, త్వంతు, అంగ, గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, మా.

అన్వయం -
కాక, అననదే, భూభూః, నామ, మహా, ఈహే, అంగదేవి, విసాసా, అదరా, రామమనాః, ఖే, ఖేదద, నానా + అఘ, ఘన, అనా, గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, త్వంతు, మమ ఆరాత్, మా యాయా.

ప్రతిపదార్థాలు -
కాక = కాకాసురునికి
అననదే = రక్షణ నిచ్చినదానా!
భూభూః = భూమినుండి పుట్టినదానా!
నామ = నమస్కారమందు
మహా = గొప్పనైన
ఈహే = అభిలాష కలదానా!
అంగదేవి = ఓ సీతాదేవీ!
విసాసా = నిర్దోషురాలవు,
అదరా = భయం లేనిదానివి,
రామమనాః = రాముని యందే మనస్సు కలదానివి,
ఖే = మనస్సులో
ఖేదద = దుఃఖాన్ని కలిగించే
నానా + అఘ = రకరకాలైన పాపాలచేత
ఘన = దుర్బలులైనవాళ్ళను
అనా = రక్షించేదానివి,
గద + ఆదౌ = రోగాలు మొదలైనవాటినుండి
అవనీ = జనులను కాపాడేదానివి.
నీత = తొలగింపబడ్డ
తమాః = తమోగుణం కలదానివై
త్వంతు = నీవు మాత్రం
మమ ఆరాత్ = నాకు దూరంగా
మా యాయా = వెళ్ళకు సుమా!

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ! నిన్
నమ్మిన వారి కెన్నఁటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!

పోతన గారి ' మహాభాగవతం ' నుండి

శ్రీ కళ్యాణరామ సుప్రభాతం

శ్రీ కళ్యాణరామ సుప్రభాతం

భాన్విందు భూజ బుధ గీష్పతి శుక్రమందా:
స్వర్భాను కేతు సహితా శ్శుభటమంటపే ద్య!
తిష్ఠంతి శ్రీచరణయుగ్మముపాసింతుతే
... కళ్యాణరామ! భవతాత్తవ సుప్రభాతం!!

తా!! సూర్య,చంద్ర,అంగారక, బుధ,గురు,శుక్ర,శని,రాహు,కేతువులు (నవగ్రహములు) నీ పవిత్ర పాదసేవ చేయుటకై మంటపమున కేతెంచి యెదురుచూచు చున్నారు. కళ్యాణ రామా!నీ కిదే సుప్రభాతము.

శ్రీ మత్స్య,కఛ్ఛప,వరాహ,నృసింహ,వర్ణిన్,
శ్రీ జామదగ్న్య, రఘురామ, హలాంకరామ,
శ్రీ రుక్మిణీ హృదయ వల్లభ,కల్కిరూప,
కళ్యాణరామ! భవతాత్తవ సుప్రభాతం!!

తా!! మత్స్య,కూర్మ,వరాహ,నృసింహ,వామన,పరశురామ,దాశరధిరామ (నాగలి ధరించిన) బలరామ (రుక్మిణీ హృదయేశుడైన) శ్రీకృష్ణ కల్కి రూపములైన దశావతారములు ధరించిన కళ్యానరామా! నీకిదే సుప్రభాతం )

శ్రీకేశవాచ్యుత,ముకుంద,కపీశసేవ్యా!
నారాయణాశ్రిత జనార్తి హరప్రభావ!
గోవింద,మాధవ,త్రివిక్రమ,రావణారే!
కళ్యాణ రామ,భవతాత్తవ సుప్రభాతం!!

కేశవ, నాశనము లేనివాడా, మోక్షమునిచ్చువాడా; హనుమంతుడు సుగ్రీవుడు మున్నగు వానర రాజులచే పూజింపబడువాడా; నారాయణా, శరణు జేరినవారి బాధలు మాంపగల ప్రభావము గలవాడా; గోవిందా, లక్ష్మీవల్లభా, వామనా, రావణశత్రువైన రామా! నీకిదే సుప్రభాతం!!

sivaanandalahari

శ్రీః శివాభ్యాం నమః
కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః- ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక-త్రిభువన-శివాభ్యాం హృది పునర్భవాభ్యామానంద-స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ 1

గలంతీ శంభో త్వచ్చరిత-సరితః కిల్బిషరజో దలంతీ ధీకుల్యా-సరణిషు పతంతీ విజయతామ్ దిశంతీ సంసార-భ్రమణ-పరితాపోపశమనం వసంతీ మచ్చేతో-హృదభువి శివానంద-లహరీ 2

త్రయీ-వేద్యం హృద్యం త్రి-పుర-హరమాద్యం త్రి-నయనం జటా-భారోదారం చలదురగ-హారం మృగ ధరమ్ మహా-దేవం దేవం మయి సదయ-భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి-విడంబం హృది భజే 3

సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్ర-ఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత-ఫలమ్ హరి-బ్రహ్మాదీనామపి నికట-భాజాం-అసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ-భజనమ్ 4

స్మృతౌ శాస్త్రే వైద్యే శకున-కవితా-గాన-ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి-నటన-హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోऽహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత-కృపయా పాలయ విభో 5

ఘటో వా మృత్పిండోऽప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోర-శమనమ్ వృథా కంఠ-క్షోభం వహసి తరసా తర్క-వచసా పదాంభోజం శంభోర్భజ పరమ-సౌఖ్యం వ్రజ సుధీః 6

మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్ర-ఫణితౌ కరౌ చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన-విధౌ తవ ధ్యానే బుద్ధిర్నయన-యుగలం మూర్తి-విభవే పర-గ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః 7

యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణిః జలే పైష్టే క్షీరం భవతి మృగ-తృష్ణాసు సలిలమ్ తథా దేవ-భ్రాంత్యా భజతి భవదన్యం జడ జనో మహా-దేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే 8

గభీరే కాసారే విశతి విజనే ఘోర-విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడ-మతిః సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమా-నాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో 9

నరత్వం దేవత్వం నగ-వన-మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది-జననమ్ సదా త్వత్పాదాబ్జ-స్మరణ-పరమానంద-లహరీ విహారాసక్తం చేద్ హృదయమిహ కిం తేన వపుషా 10

వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిద్-భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశు-పతే తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి 11

గుహాయాం గేహే వా బహిరపి వనే వాऽద్రి-శిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్ యోగోऽసౌ స చ పరమ-యోగీ స చ సుఖీ 12

అసారే సంసారే నిజ-భజన-దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ-కృపయా పాతుముచితమ్ మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి-నిపుణః- త్వదన్యః కో వా మే త్రి-జగతి శరణ్యః పశు-పతే 13

ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమ-బంధుః పశు-పతే ప్రముఖ్యోऽహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్కర్తవ్యం మదవనమియం బంధు-సరణిః 14

ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవద్ధ్యాన-విముఖాం దురాశా-భూయిష్ఠాం విధి-లిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశు-పతే కథం వా నిర్యత్నం కర-నఖ-ముఖేనైవ లులితమ్ 15

విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పర-శిరశ్చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం
 లిఖితవాన్ విచారః కో వా మాం విశద-కృపయా పాతి శివ తే కటాక్ష-వ్యాపారః స్వయమపి చ దీనావన-పరః 16

ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేऽపి స్వామిన్ భవదమల-పాదాబ్జ-యుగలమ్ కథం పశ్యేయం మాం స్థగయతి నమః-సంభ్రమ-జుషాం నిలింపానాం శ్రేణిర్నిజ-కనక-మాణిక్య-మకుటైః 17

త్వమేకో లోకానాం పరమ-ఫలదో దివ్య-పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరి-ముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ కదా వా మద్రక్షాం వహసి కరుణా-పూరిత-దృశా 18

దురాశా-భూయిష్ఠే దురధిప-గృహ-ద్వార-ఘటకే దురంతే సంసారే దురిత-నిలయే దుఃఖ జనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్ 19

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచ-గిరౌ నటత్యాశా-శాఖాస్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ-కపిమత్యంత-చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో 20

ధృతి-స్తంభాధారం దృఢ-గుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి-దివస-సన్మార్గ-ఘటితామ్ స్మరారే మచ్చేతః-స్ఫుట-పట-కుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైస్సేవిత విభో 21

ప్రలోభాద్యైః అర్థాహరణ పర-తంత్రో ధని-గృహే ప్రవేశోద్యుక్తస్సన్ భ్రమతి బహుధా తస్కర-పతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ 22

కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వమ్ దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి-మృగతాం- అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో 23
కదా వా కైలాసే కనక-మణి-సౌధే సహ-గణైః- వసన్ శంభోరగ్రే స్ఫుట-ఘటిత మూర్ధాంజలి-పుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః 24
స్తవైర్బ్రహ్మాదీనాం జయ-జయ-వచోభిః నియమానాం గణానాం కేలీభిః మదకల-మహోక్షస్య కకుది స్థితం నీల-గ్రీవం త్రి-నయనం-ఉమాశ్లిష్ట-వపుషం కదా త్వాం పశ్యేయం కర-ధృత-మృగం ఖండ-పరశుమ్ 25
కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రి-యుగలం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట-జలజ-గంధాన్ పరిమలాన్- అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే 26
కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధన-పతౌ గృహస్థే స్వర్భూజాऽమర-సురభి-చింతామణి-గణే శిరస్థే శీతాంశౌ చరణ-యుగలస్థే-అఖిల శుభే కమర్థం దాస్యేऽహం భవతు భవదర్థం మమ మనః 27
సారూప్యం తవ పూజనే శివ మహా-దేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి-ధుర్య-జనతా-సాంగత్య-సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తను-ధ్యానే భవానీ-పతే సాయుజ్యం మమ సిద్ధిమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహమ్ 28
త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోక-గురో మదీయ-మనసః సౌఖ్యోపదేశం కురు 29
వస్త్రోద్ధూత విధౌ సహస్ర-కరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధ-వహాత్మతాऽన్న-పచనే బహిర్ముఖాధ్యక్షతా పాత్రే కాంచన-గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడా-మణే శుశ్రూషాం కరవాణి తే పశు-పతే స్వామిన్ త్రి-లోకీ-గురో 30

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షి-గతాన్ చరాచర-గణాన్ బాహ్య-స్థితాన్ రక్షితుమ్ సర్వామర్త్య-పలాయనౌషధం అతి-జ్వాలా-కరం భీ-కరం నిక్షిప్తం గరలం గలే న గలితం నోద్గీర్ణమేవ-త్వయా 31
జ్వాలోగ్రస్సకలామరాతి-భయదః క్ష్వేలః కథం వా త్వయా దృష్టః కిం చ కరే ధృతః కర-తలే కిం పక్వ జంబూ-ఫలమ్ జిహ్వాయాం నిహితశ్చ సిద్ధ-ఘుటికా వా కంఠ-దేశే భృతః కిం తే నీల-మణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద 32
నాలం వా సకృదేవ దేవ భవతస్సేవా నతిర్వా నుతిః పూజా వా స్మరణం కథా-శ్రవణమప్యాలోకనం మాదృశామ్ స్వామిన్నస్థిర-దేవతానుసరణాయాసేన కిం లభ్యతే కా వా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా 33
కిం బ్రూమస్తవ సాహసం పశు-పతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మనః స్థితిరియం చాన్యైః కథం లభ్యతే భ్రశ్యద్దేవ-గణం త్రసన్ముని-గణం నశ్యత్ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానంద-సాంద్రో భవాన్ 34
యోగ-క్షేమ-ధురంధరస్య సకలఃశ్రేయః ప్రదోద్యోగినో దృష్టాదృష్ట-మతోపదేశ-కృతినో బాహ్యాంతర-వ్యాపినః సర్వజ్ఞస్య దయా-కరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్ 35
భక్తో భక్తి-గుణావృతే ముదమృతా-పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ తవాంఘ్రి-పల్లవ యుగం సంస్థాప్య సంవిత్ఫలమ్ సత్త్వం మంత్రముదీరయన్నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీ కరోమి రుచిరం కల్యాణమాపాదయన్ 36
ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాః-సముద్యన్మనో మంథానం దృఢ భక్తి-రజ్జు-సహితం కృత్వా మథిత్వా తతః సోమం కల్ప-తరుం సుపర్వ-సురభిం చింతా-మణిం ధీమతాం నిత్యానంద-సుధాం నిరంతర-రమా-సౌభాగ్యమాతన్వతే 37
ప్రాక్పుణ్యాచల-మార్గ-దర్శిత-సుధా-మూర్తిః ప్రసన్నశ్శివః సోమస్సద్-గుణ-సేవితో మృగ-ధరః పూర్ణాస్తమో మోచకః చేతః పుష్కర లక్షితో భవతి చేదానంద-పాథో నిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే 38
ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామ-క్రోధ-మదాదయో విగలితాః కాలాః సుఖావిష్కృతాః జ్ఞానానంద-మహౌషధిః సుఫలితా కైవల్య నాథే సదా మాన్యే మానస-పుండరీక-నగరే రాజావతంసే స్థితే 39
ధీ-యంత్రేణ వచో-ఘటేన కవితా-కుల్యోపకుల్యాక్రమైః- ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశి-దివ్యామృతైః హృత్కేదార-యుతాశ్చ భక్తి-కలమాః సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతిః కుతః 40
పాపోత్పాత-విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుం-జయ స్తోత్ర-ధ్యాన-నతి-ప్రదిక్షిణ-సపర్యాలోకనాకర్ణనే జిహ్వా-చిత్త-శిరోంఘ్రి-హస్త-నయన-శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేऽవచః 41
గాంభీర్యం పరిఖా-పదం ఘన-ధృతిః ప్రాకార ఉద్యద్గుణ స్తోమశ్చాప్త బలం ఘనేంద్రియ-చయో ద్వారాణి దేహే స్థితః విద్యా-వస్తు-సమృద్ధిరిత్యఖిల-సామగ్రీ-సమేతే సదా దుర్గాతి-ప్రియ-దేవ మామక-మనో-దుర్గే నివాసం కురు 42
మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు స్వామిన్నాది కిరాత మామక-మనః కాంతార-సీమాంతరే వర్తంతే బహుశో మృగా మద-జుషో మాత్సర్య-మోహాదయః తాన్ హత్వా మృగయా వినోద రుచితా-లాభం చ సంప్రాప్స్యసి 43
కర-లగ్న మృగః కరీంద్ర-భంగో ఘన శార్దూల-విఖండనోऽస్త-జంతుః గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచ ముఖోస్తి మే కుతో భీః 44
ఛందశ్శాఖి శిఖాన్వితైః ద్విజ-వరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేద-భేదిని సుధా-సారైః ఫలైర్దీపితే చేతః పక్షి శిఖా-మణే త్యజ వృథా సంచారం అన్యైరలం నిత్యం శంకర-పాద-పద్మ-యుగలీ-నీడే విహారం కురు 45
ఆకీర్ణే నఖ-రాజి-కాంతి-విభవైరుద్యత్-సుధా-వైభవైః ఆధౌతేపి చ పద్మ-రాగ-లలితే హంస-వ్రజైరాశ్రితే నిత్యం భక్తి-వధూ గణైశ్చ రహసి స్వేచ్ఛా-విహారం కురు స్థిత్వా మానస-రాజ-హంస గిరిజా నాథాంఘ్రి-సౌధాంతరే 46
శంభు-ధ్యాన-వసంత-సంగిని హృదారామే-అఘ-జీర్ణచ్ఛదాః స్రస్తా భక్తి లతాచ్ఛటా విలసితాః పుణ్య-ప్రవాల-శ్రితాః దీప్యంతే గుణ-కోరకా జప-వచః పుష్పాణి సద్వాసనా జ్ఞానానంద-సుధా-మరంద-లహరీ సంవిత్ఫలాభ్యున్నతిః 47
నిత్యానంద-రసాలయం సుర-ముని-స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్ద్విజ-సేవితం కలుష-హృత్ సద్వాసనావిష్కృతమ్ శంభు-ధ్యాన-సరోవరం వ్రజ మనో-హంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయ-పల్వల-భ్రమణ-సంజాత-శ్రమం ప్రాప్స్యసి 48
ఆనందామృత-పూరితా హర-పదాంభోజాలవాలోద్యతా స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికా శాఖోపశాఖాన్వితా ఉచ్ఛైర్మానస కాయమాన-పటలీమాక్రంయ నిష్కల్మషా నిత్యాభీష్ట ఫల-ప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా 49
సంధ్యారంభ-విజృంభితం శ్రుతి-శిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహా-లింగం శివాలింగితమ్ 50
భృంగీచ్ఛా-నటనోత్కటః కరి-మద-గ్రాహీ స్ఫురన్- మాధవాహ్లాదో నాద-యుతో మహాసిత-వపుః పంచేషుణా చాదృతః సత్పక్షస్సుమనో-వనేషు స పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల-వాసీ విభుః 51
కారుణ్యామృత-వర్షిణం ఘన-విపద్-గ్రీష్మచ్ఛిదా-కర్మఠం విద్యా-సస్య-ఫలోదయాయ సుమనస్సంసేవ్యం ఇచ్ఛాకృతిమ్ నృత్యద్భక్త-మయూరం అద్రి-నిలయం చంచజ్జటా మండలం శంభో వాంఛతి నీల-కంధర సదా త్వాం మే మనశ్చాతకః 52
ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రా కలాపీ నతాऽనుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యో గీయతే శ్యామాం శైల సముద్భవాం ఘన-రుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహార-రసికం తం నీల-కంఠం భజే 53
సంధ్యా ఘర్మ-దినాత్యయో హరి-కరాఘాత-ప్రభూతానక- ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్మయూరీ శివా యస్మిన్నుజ్జ్వల తాండవం విజయతే తం నీల-కంఠం భజే 54
ఆద్యాయామిత తేజసే శ్రుతి పదైర్వేద్యాయ సాధ్యాయ తే విద్యానంద-మయాత్మనే త్రి-జగతస్సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగిభిస్సుర-గణైర్గేయాయ మాయావినే సంయక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే 55
నిత్యాయ త్రిగుణాత్మనే పుర-జితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబినే ముని-మనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్త్రయాయ సకలామ్నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే 56
నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్య-పాక బలతస్త్వం శర్వ సర్వాంతరః- తిష్ఠస్యేవ హి తేన వా పశు-పతే తే రక్షణీయోऽస్మ్యహమ్ 57
ఏకో వారిజ బాంధవః క్షితి-నభో వ్యాప్తం తమో-మండలం భిత్వా లోచన-గోచరోపి భవతి త్వం కోటి-సూర్య ప్రభః వేద్యః కిం న భవస్యహో ఘన-తరం కీదృఙ్-భవేన్-మత్తమస్- తత్సర్వం వ్యపనీయ మే పశు-పతే సాక్షాత్ ప్రసన్నో భవ 58
హంసః పద్మ-వనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః కోకః కోక-నద ప్రియం ప్రతి-దినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశు-పతే చిన్మార్గ మృగ్యం విభో గౌరీ నాథ భవత్పదాబ్జ-యుగలం కైవల్య సౌఖ్య-ప్రదమ్ 59
రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితః భీతః స్వస్థ గృహం గృహస్థం అతిథిర్దీనః ప్రభం ధార్మికమ్ దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతస్సర్వ భయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్ 60

అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతా క్షితి-రుహం సింధుస్సరిద్ వల్లభమ్ ప్రాప్నోతీహ యథా తథా పశు-పతేః పాదారవింద-ద్వయం చేతో-వృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే 61
ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్ఛాదనం వాచా శంఖ ముఖే స్థితైశ్చ జఠరా-పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా- పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి 62
మార్గావర్తిత పాదుకా పశు-పతేరంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పుర-రిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంస-శేష-కబలం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరోత్యహో వన-చరో భక్తావతంసాయతే 63
వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం భూభృత్ పర్యటనం నమత్సుర-శిరః కోటీర సంఘర్షణమ్ కర్మేదం మృదులస్య తావక-పద ద్వంద్వస్య గౌరీ-పతే మచ్చేతో మణి-పాదుకా విహరణం శంభో సదాంగీ-కురు 64
వక్షస్తాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటీరోజ్జ్వల రత్న-దీప-కలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తి-వధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీ-పతే యచ్చేతస్తవ పాద-పద్మ-భజనం తస్యేహ కిం దుర్లభమ్ 65
క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా-మృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామక రక్షణం పశు-పతే కర్తవ్యమేవ త్వయా 66
బహు-విధ పరితోష బాష్ప-పూర స్ఫుట పులకాంకిత చారు-భోగ భూమిమ్ చిర-పద ఫల-కాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే 67
అమిత ముదమృతం ముహుర్దుహంతీం విమల భవత్పద-గోష్ఠమావసంతీమ్ సదయ పశు-పతే సుపుణ్య పాకాం మమ పరిపాలయ భక్తి ధేనుమేకామ్ 68
జడతా పశుతా కలంకితా కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ అస్తి యది రాజ-మౌలే భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ 69
అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరి-వసితుం సులభః ప్రసన్న మూర్తిః అగణిత ఫల-దాయకః ప్రభుర్మే జగదధికో హృది రాజ శేఖరోస్తి 70
ఆరూఢ భక్తి-గుణ కుంచిత భావ చాప యుక్తైశ్శివ స్మరణ బాణ-గణైరమోఘైః నిర్జిత్య కిల్బిష-రిపూన్ విజయీ సుధీంద్రస్సానందమావహతి సుస్థిర రాజ-లక్ష్మీమ్ 71
ధ్యానాంజనేన సమవేక్ష్య తమఃప్రదేశం భిత్వా మహా-బలిభిరీశ్వర-నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగ-భూషణముద్వహంతి యే పాద పద్మమిహ తే శివ తే కృతార్థాః 72
భూ-దారతాముదవహద్ యదపేక్షయా శ్రీ- భూ-దార ఏవ కిమతస్సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య 73
ఆశా-పాశ-క్లేశ-దుర్వాసనాది- భేదోద్యుక్తైః దివ్య-గంధైరమందైః ఆశా-శాటీకస్య పాదారవిందం చేతఃపేటీం వాసితాం మే తనోతు 74
కల్యాణినం సరస-చిత్ర-గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువ లక్షణాఢ్యమ్ చేతస్తురంగమ్ అధిరుహ్య చర స్మరారే నేతస్సమస్త జగతాం వృషభాధిరూఢ 75
భక్తిర్మహేశ పద-పుష్కరమావసంతీ కాదంబినీవ కురుతే పరితోష-వర్షమ్ సంపూరితో భవతి యస్య మనస్తటాకః- తజ్జన్మ-సస్యమఖిలం సఫలం చ నాన్యత్ 76
బుద్ధిఃస్థిరా భవితుమీశ్వర పాద-పద్మ సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ సద్భావనా స్మరణ-దర్శన-కీర్తనాది సంమోహితేవ శివ-మంత్ర జపేన వింతే 77
సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సదుపాశ్రితామ్ మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వర-గుణేన నవోఢ వధూమివ 78
నిత్యం యోగి మనస్సరోజ-దల సంచార క్షమస్త్వత్ క్రమశ్శంభో తేన కథం కఠోర యమరాడ్ వక్షఃకవాట-క్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రి యుగలం హా మే మనశ్చింతయతి- ఏతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే 79
ఏష్యత్యేష జనిం మనోऽస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై గిరి సీమ్ని కోమల-పదన్యాసః పురాభ్యాసితః నోచేద్ దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలా-తలేషు నటనం శంభో కిమర్థం తవ 80
కంచిత్కాలముమా-మహేశ భవతః పాదారవిందార్చనైః కంచిద్ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యఃప్రాప్నోతి ముదా త్వదర్పిత మనా జీవన్ స ముక్తఃఖలు 81
బాణత్వం వృషభత్వం అర్ధ-వపుషా భార్యాత్వం ఆర్యా-పతే ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్పూజ్య-తరస్స ఏవ హి న చేత్ కో వా తదన్యోऽధికః 82
జనన-మృతి-యుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖ లేశస్సంశయో నాస్తి తత్ర అజనిమమృత రూపం సాంబమీశం భజంతే య ఇహ పరమ సౌఖ్యం తే హి ధన్యా లభంతే 83
శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణ-ధుర్యాం బుద్ధి-కన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ-గేహే సర్వదా సంవస త్వమ్ 84
జలధి మథన దక్షో నైవ పాతాల భేదీ న చ వన మృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అశన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందు-మౌలే 85
పూజా-ద్రవ్య సమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే పక్షిత్వం న చ వా కీటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ జానే మస్తకమంఘ్రి-పల్లవముమా జానే న తేऽహం విభో న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా 86
అశనం గరలం ఫణీ కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి 87
యదా కృతాంభో-నిధి సేతు-బంధనః కరస్థ లాధః కృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మ-సంభవః తదా శివార్చాస్తవ భావన-క్షమః 88
నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన-సమాధిభిర్న తుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వద తే ప్రీతి-కరం తథా కరోమి 89
వచసా చరితం వదామి శంభోరహం ఉద్యోగ విధాసు తేऽప్రసక్తః మనసాకృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి 90

ఆద్యాऽవిద్యా హృద్గతా నిర్గతాసీత్- విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీ-కరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజ-మౌలే 91
దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షైః 92
సోమ కలా-ధర-మౌలౌ కోమల ఘన-కంధరే మహా-మహసి స్వామిని గిరిజా నాథే మామక హృదయం నిరంతరం రమతామ్ 93
సా రసనా తే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యా యే యౌ యో భర్గం వదతీక్షేతే సదార్చతః స్మరతి 94
అతి మృదులౌ మమ చరణావతి కఠినం తే మనో భవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథా ప్రవేశః 95
ధైయాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి-శృంఖలయా పుర-హర చరణాలానే హృదయ మదేభం బధాన చిద్యంత్రైః 96
ప్రచరత్యభితః ప్రగల్భ-వృత్త్యా మదవానేష మనః-కరీ గరీయాన్ పరిగృహ్య నయేన భక్తి-రజ్జ్వా పరమ స్థాణు-పదం దృఢం నయాముమ్ 97
సర్వాలంకార-యుక్తాం సరల-పద-యుతాం సాధు-వృత్తాం సువర్ణాం సద్భిస్సంస్తూయమానాం సరస గుణ-యుతాం లక్షితాం లక్షణాఢ్యామ్ ఉద్యద్భూషా-విశేషామ్ ఉపగత-వినయాం ద్యోతమానార్థ-రేఖాం కల్యాణీం దేవ గౌరీ-ప్రియ మమ కవితా-కన్యకాం త్వం గృహాణ 98
ఇదం తే యుక్తం వా పరమ-శివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పద-శిరో-దర్శన-ధియా హరి-బ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమ-యుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః 99
స్తోత్రేణాలం అహం ప్రవచ్మి న మృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా-ప్రసంగ-సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్ర-విచారణ-ప్రకరణే ధానా-తుషస్తోమవత్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకాః 100
ఇతి శ్రీమత్పరమ-హంస పరివ్రాజకాచార్య- శ్రీమత్ శంకరాచార్య విరచితా శివానంద లహరీ సమాప్తా

Wednesday, 4 April 2012

Why We Shout In Anger"

A Hindu saint who was visiting river Ganges to take bath found a group of family members on the banks, shouting in anger at each other. He turned to his disciples smiled and asked.

'Why do people shout in anger sho...ut at each other?'

Disciples thought for a while, one of them said, 'Because we lose our calm, we shout.'

'But, why should you shout when the other person is just next to you? You can as well tell him what you have to say in a soft manner.' asked the saint

Disciples gave some other answers but none satisfied the other disciples.
Finally the saint explained, .

'When two people are angry at each other, their hearts distance a lot. To cover that distance they must shout to be able to hear each other. The angrier they are, the stronger they will have to shout to hear each other to cover that great distance.

What happens when two people fall in love? They don't shout at each other but talk softly, Because their hearts are very close. The distance between them is either nonexistent or very small...'

The saint continued, 'When they love each other even more, what happens? They do not speak, only whisper and they get even closer to each other in their love. Finally they even need not whisper, they only look at each other and that's all. That is how close two people are when they love each other.'

He looked at his disciples and said.

'So when you argue do not let your hearts get distant, Do not say words that distance each other more, Or else there will come a day when the distance is so great that you will not find the path to

Tuesday, 3 April 2012

Scientific Reasons :

There are thousands of temples all over India in different size, shape and locations but not all of them are considered to be built the Vedic way. Generally, a temple should be located at a place where earth's magnetic wave path passes through densely. It can be in the outskirts of a town/village or city, or in middle of the dwelling place, or on a hilltop. The essence of vis...iting a temple is discussed here.

Now, these temples are located strategically at a place where the positive energy is abundantly available from the magnetic and electric wave distributions of north/south pole thrust. The main idol is placed in the core center of the temple, known as "*Garbhagriha*" or *Moolasthanam*. In fact, the temple structure is built after the idol has been placed. This *Moolasthanam* is where earth’s magnetic waves are found to be maximum. We know that there are some copper plates, inscribed with Vedic scripts, buried beneath the Main Idol. What are they really? No, they are not God’s / priests’ flash cards when they forget the *shlokas*. The copper plate absorbs earth’s magnetic waves and radiates it to the surroundings. Thus a person regularly visiting a temple and walking clockwise around the Main Idol receives the beamed magnetic waves and his body absorbs it. This is a very slow process and a regular visit will let him absorb more of this positive energy. Scientifically, it is the positive energy that we all require to have a healthy life.

Further, the Sanctum is closed on three sides. This increases the effect of all energies. The lamp that is lit radiates heat energy and also provides light inside the sanctum to the priests or *poojaris* performing the pooja. The ringing of the bells and the chanting of prayers takes a worshipper into trance, thus not letting his mind waver. When done in groups, this helps people forget personal problems for a while and relieve their stress. The fragrance from the flowers, the burning of camphor give out the chemical energy further aiding in a different good aura. The effect of all these energies is supplemented by the positive energy from the idol, the copper plates and utensils in the *Moolasthan*am / *Garbagraham*.

*Theertham*, the “holy” water used during the pooja to wash the idol is not plain water cleaning the dust off an idol. It is a concoction of Cardamom,*Karpura* (Benzoin), zaffron / saffron, *Tulsi* (Holy Basil), Clove, etc...Washing the idol is to charge the water with the magnetic radiations thus increasing its medicinal values. Three spoons of this holy water is distributed to devotees. Again, this water is mainly a source of magneto-therapy. Besides, the clove essence protects one from tooth decay, the saffron & *Tulsi* leafs protects one from common cold and cough, cardamom and *Pachha Karpuram* (benzoin), act as mouth fresheners. It is proved that *Theertham* is a very good blood purifier, as it is highly energized. Hence it is given as *prasadam* to the devotees. This way, one can claim to remain healthy by regularly visiting the Temples. This is why our elders used to suggest us to offer prayers at the temple so that you will be cured of many ailments. They were not always superstitious. Yes, in a few cases they did go overboard when due to ignorance they hoped many serious diseases could be cured at temples by deities. When people go to a temple for the *Deepaaraadhana*, and when the doors open up, the positive energy gushes out onto the persons who are there. The water that is sprinkled onto the assemblages passes on the energy to all. This also explains why men are not allowed to wear shirts at a few temples and women are requested to wear more ornaments during temple visits. It is through these jewels (metal) that positive energy is absorbed by the women. Also, it is a practice to leave newly purchased jewels at an idol’s feet and then wear them with the idol’s blessings. This act is now justified after reading this article. This act of “seeking divine blessings” before using any new article, like books or pens or automobiles may have stemmed from this through mere observation.

Energy lost in a day’s work is regained through a temple visit and one is refreshed slightly. The positive energy that is spread out in the entire temple and especially around where the main idol is placed, are simply absorbed by one's body and mind. Did you know, every Vaishnava(Vishnu devotees), “must” visit a Vishnu temple twice every day in their location. Our practices are NOT some hard and fast rules framed by 1 man and his followers or God’s words in somebody’s dreams. All the rituals, all the practices are, in reality, well researched, studied and scientifically backed thesis which form the ways of nature to lead a good healthy life.

The scientific and research part of the practices are well camouflaged as “elder’s instructions” or “granny’s teaching’s” which should be obeyed as a mark of respect so as to once again, avoid stress to the mediocre brains.

Monday, 2 April 2012

అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది

అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
చారిత్రకంగా దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. ఇతడు శంకరుని గురువైన గోవింద భగవత్పాదునకు గురువు. అయితే మనకు లభించిన సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి మూలగ్రంధాలు ప్రస్థానాత్రయం (Prasthanatrayi) — అనగా ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలకు శంకరుడు రచించిన భాష్యాలు.
అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరుని వచనాలు -
బ్రహ్మ సత్యం జగన్మిధ్యజీవొ బ్రహ్మైవ నా పరః
బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.
భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంధంలో శంకరుడు ఇలా వివరించాడు -
ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?
పూర్వ జన్మ లలోని కర్మ వలన.
కర్మ ఎందుకు జరుగుతుంది?
రాగం (కోరిక) వలన.
రాగాదులు ఎందుకు కలుగుతాయి?
అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన.
అభిమానం ఎందుకు కలుగుతుంది?
అవివేకం వలన
అవివేకం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానం వలన
అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?
అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం.
అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి

Sunday, 1 April 2012

దశరథనందన రఘురామా! ధరణిజకామా,దానవభీమా!
దశముఖ మర్దన జయరామా!దశదిశ ప్రసరిత గుణధామా! ||దశరథ||

... భరతున కొసగిన పాద రక్షలు
భారతీయులకు రామ రక్షలు
భళిరా! మొదలిక అసురుల శిక్షలు!
భవ్య ధర్మ,జన రక్షణ దీక్షలు! ||దశరథ||

గోదావరి సరి వర విరజానది,
భద్రగిరి చరులు పాల జలధులు,
శ్రీ సతి, శ్రీ పతి, సీత, రఘుపతి
శేష ఫణి అచట లక్ష్మణు డిచట ||దశరథ||

భద్రునకిడితివి శుభ వరదానం
భద్రాచలమని నీకిక ధామం
భక్త జనులకది ఇల వైకుంఠం
పాహి వికుంఠం!నుత శ్రీకంఠం! ||దశరథ||