Bramhasri Samavedam Shanmukha Sarma
ఎవరెవరు యే యే రూపాల్లో ఉపాసిస్తారో, వారందరికీ ఆయా రూపాల్లోనే విశ్వాసం కలిగిస్తాను. వారి దృక్పథాన్ని అనుసరించి, నేను వారికి దర్శనం ఇస్తాను" అన్నాడు శ్రీకృష్ణుడు.
లోకంలో అనేకరకాలైన ఆరాధనల్ని మనం చూస్తున్నాం. దేవుడి కోసమే దేవుణ్ణి ప్రేమించడం అత్యున్నతమైన ఆరాధన. దేవుడనేవాడు ఒకడుంటే లోకంలో ఇంత దుఃఖం ఎందుకుండాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. భక్తుడు ఇలా జవాబిస్తాడు: "లోకంలో దుఃఖం ఉంది. అంతమాత్రం చేత దేవుణ్ణి ప్రేమించడం నేను మానుకోను. నాకష్టాన్ని తొలగించాల్సించిగా నేను దేవుణ్ణి ప్రార్థించను. అతడు - ప్రేమ స్వరూపుడు కాబట్టి నేనతణ్ణి ప్రేమిస్తాను.
ఈజీవితాన్ని గడుపుతూ పవిత్రులం కావడం ఎలా? మనమంతా అడవులకో, కొండ గుహలకో పోదామా? దానివల్ల మనకేం ప్రయోజనం? మనస్సు మన అధీనంలో లేనప్పుడు కొండ గుహల్లో నివసించినంత మాత్రాన ఉపయోగం ఏమిటి? ఈమనస్సే అక్కడ కూడా మనకు ఇరవై భూతాలు ప్రత్యక్షమవుతాయి. ఎందుకంటే అవన్నీ మన మనస్సులో ఉన్నవే కాబట్టి, మనస్సు మన అధీనంలో ఉంటే మనం ఉన్నచోటనే గుహను సృష్టించుకోవచ్చు.
మనకు ప్రపంచం కనబడే తీరు మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మన మనోభావాలను అనుసరించి వస్తువులు సుందరంగానో, వికృతంగానో కనపడతాయి. లోకమంతా మన మనస్సులోనే ఉంది. సమ్యక్ దృక్పధంతో వస్తువులను చూడడం అలవరచుకోండి. ముందుగా ప్రపంచం మీద విశ్వాసం ఉంచండి. ప్రతిదానికీ అర్థం ఉందని నమ్మండి. లోకంలోని ప్రతి వస్తువూ మంగళకరమైనది, పవిత్రమైనది, సుందరమైనది. మీకేదైనా చెడు కనబడితే దాన్ని మీరు సరైన దృష్టితో దర్శించలేదని గ్రహించండి. భారం మీమీదే వేసుకోండి! లోకం భ్రష్టమైపోతున్నట్లు మనకు తోచినప్పుడల్లా మనల్ని మనం విశ్లేషించుకోవాలి. ఆతరువాత వస్తువుల యథార్థ స్వరూపాన్ని చూసే శక్తి మనలో లోపించిందని తెలియవస్తుంది. రేయింబవళ్ళూ కృషి చేయండి. "చూడండి! ప్రతి కర్మా బంధమే. నేను నిష్కామంగా కృషిచేస్తాను. నిమిషమైనా పని మానుకుంటే అరాచకం, సంక్షోభం ఏర్పడతాయి. కాబట్టి మీరూ నిష్కామంగా పనిచెయ్యండి."
ఈప్రపంచం ఒక ఆట. ఆటలో మీరు భగవంతుడు సహచరులు. ఏవిధమైన దుఃఖానికీ, దైన్యానికీ తావివ్వక, మీకర్తవ్యాన్ని నిర్వర్తించండి. మురికివాడల్లో, విశాలమైన చావడుల్లో అతడి ఆటను గమనించండి. ప్రజోద్ధరణకు కృషి చేయండి. వారు నికృష్టులు, పతితులు అనే భావంతో మాత్రం కాదు.