Friday, 31 January 2014

Jaji Sarma
వివేకం - 1
వివేకం అనగా శరీరం ఆత్మ వేరు అని తెలియడం - భక్తి జ్ఞాన విరాగములతో వివేకం కలుగుతుంది.
మొదలు భక్తి కలగాలి - భగవంతుని మీద ప్రేమకు భక్తి అని పేరు. అప్పుడు భగవంతుని మాహత్యం తెలుస్తుంది - అదే జ్ఞానం. జ్ఞానం వల్ల విరాగం కలుగుతుంది
వివేకం - 2

గోవు గాయత్రి గంగ గీత సూర్యుడు ఇవన్నీ ఒకటే.

వివేకం - 3

పరీక్షిన్మహరాజు ప్రాయోపవేశం చేసినప్పుడు 6994 మంది ఋషులు వచ్చారు.
భాగవత ప్రవచనాలు పలురకాలు - సాత్వికం రాజసం తామసం
భాగవత సప్తాహం - రాజసం. ఇది ఖర్చుతో కూడుకున్నది. అందుకే రాజసం. కాని వెంటనే ఫలితం ఇస్తుంది
21 లేదా 14, 31, 62 రోజులు - సాత్వికం
ఒక యేడాది లేదా ఇంకా ఎక్కువ - తామసం
కాల నియమంలేకుండా చేసేది - నిర్గుణం - ఇది ఉత్తమోత్తమం

మనస్సును గెలవలేము కాబట్టి, మానవులు అల్పాయుష్కులు కాబట్టి, లోభాన్ని గెలవలేము కాబట్టి సప్తాహ శ్రవణం ఉత్తమం సత్యం మనోనిగ్రహంతో వినాలి.

బ్రహ్మపాప్తికి ఆరుమార్గములు

Jaji Sarma
బ్రహ్మపాప్తికి ఆరుమార్గములు
శుక్లయ‌జుర్వేద‌యునంద‌లి సుబాల ఉప‌నిష‌త్తులో బ్రహ్మప్రాప్తికి ఆరు మార్గములు చెప్పబ‌డిన‌వి.

"త‌ద్యైస‌త్యేన దానేన త‌ప‌సానాశ‌కేన బ్రహ్మచ‌ర్యేణ‌
నిర్వేద‌నేనా నాశ‌కేన ష‌డంగేనైవ సాధ‌యేత్‌"

స‌త్యము

మ‌నోవాక్కాయ క‌ర్మల‌యందు స‌త్యవ్రత‌మాచ‌రింప‌వ‌ల‌యును. సామ‌వేదాంత‌ర్గత కేనోప‌నిష‌త్తునందు బ్రహ్మ విద్యకు స‌త్యమేస్థాన‌మ‌ని స్పష్టప‌రుప‌బ‌డిన‌ది.

"త‌స్యైత‌పోద‌మః క‌ర్మేతిప్రతిష్ఠా, వేదాస్సర్వాం గాని స‌త్యమాయ‌త‌నం" (చ‌తుర్ధఖండ‌ము .8)

శిష్యున‌కు వేద‌మును బోధించి ఆచార్యుడు శాసించుచు ప్రప్రధ‌మ‌ములో "స‌త్యంవ‌ద" అనిప‌లికెను. (స‌త్యమును ప‌లుకుము అని అర్ధము) పొర‌పాటుగానైన‌ను అస‌త్య వాక్యమును ప‌లుక వ‌ల‌ద‌ని తిరిగి బోధించెను.

"స‌త్యాన్న ప్రమ‌దిత‌వ్యం" (స‌త్యము నుండి ప్రమాద‌మును పొంద‌వ‌ల‌దు. కృష్ణయ‌జుర్వేద తైత్తిరీయోప‌నిష‌త్తు. శిక్షావ‌ల్లి 11 అనువాక‌ము) అనృత‌ము ప‌లికిన‌వాడు స‌మూల‌ముగా న‌శించున‌ని మ‌రియెక వేద‌వాక్యము క‌ల‌దు.

"యో నృతంవ‌ద‌తి స‌మూలోవా ఏష‌ప‌రిశుష్యతి"

ముండ‌కోప‌నిష‌త్తునందును, శ్వేతాశ్వత‌ర ఉప‌నిష‌త్తునందును, ఆత్మ, స‌త్యము, త‌ప‌స్సు, స‌మ్యగ్జ్ఞాన‌ము, బ్రహ్మ చ‌ర్యమువ‌ల‌న ప్రాప్తమ‌గున‌నియు, స‌త్యమే జ‌యించున‌నియు, అందువ‌ల‌న దేవ‌యాన‌ము ల‌భ్యమ‌గున‌నియు, చెప్పబ‌డిన‌ది.

దాన‌ము

దాన‌ముకంటె మిక్కిలి క‌ష్టముగా జేయ‌వ‌ల‌సిన ప‌ని లేదు. అది త్యాగ‌ముతో గూడుకొన్నదిగ‌దా !

"దానాన్నాతిదుశ్చరం" (నారాయ‌ణ‌ప్రశ్నము. 78 అనువాక‌ము)
దాన‌ముజేయున‌పుడు గ‌మ‌నింప‌వ‌ల‌సిన విష‌య‌ముల గురించి వేద‌మిట్లు శాసించుచున్నది.

"శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం ! శ్రియా
దేయం ! హ్రియా దేయం ! భియాదేయం ! సంవిదా దేయం" ! (తైత్తిరీయోప నిష‌త్తు) శిక్షావ‌ల్లి.

శ్రద్దతోనివ్వ వ‌ల‌యును. అశ్రద్ధ కూడ‌దు. సంప‌ద‌న‌నుస‌రించి చేయ‌వ‌ల‌యును. సిగ్గుతో నివ్వవ‌ల‌యును. భయ‌ము చేత నివ్వవ‌ల‌యును. ప్రతిజ్ఞచేత నివ్వత‌గిన‌ది.

దాన‌ము సాత్విక‌మ‌నియు, రాజ‌స‌మ‌నియు. తామ‌స‌మ‌నియు, మూడు విధ‌ములు. దాన‌ము జేయుట త‌న‌కు క‌ర్తవ్యమ‌ను బుద్ధితో యోగ్యమ‌గుస్తల‌మును, కాల‌మును, పాత్రమును, విచారించి ప్రత్యుప‌కార‌మును కోర‌క జేయుదాన‌ము సాత్విక‌మ‌ని చెప్పబ‌డిన‌ది. చేసిన ఉప‌కార‌మున‌కు బ‌దులుగాగాని, లేక ముందేదో ఆశ‌పెట్టుకొనిగాని, లేక త‌ప్పించుకొన లేక చేయున‌ట్టిగాని దాన‌ము రాజ‌స‌మ‌ని చెప్పబ‌డిన‌ది.

అయోగ్యస్థల‌మందును, అకాల‌మునందును, పాత్రత లేక‌ను స‌త్కార ర‌హిత‌ముగ‌ను, లేక అవ‌మాన పూర్వక‌ముగ‌ను, చేయుదాన‌ము తామ‌స‌మ‌ని చెప్పబ‌డుచున్నది. (గీత‌. 17-20 21,22)

త‌ప‌స్సు

ప్రతిమాన‌వుడు త‌ప‌స్సు జేయ‌వ‌ల‌యును. త‌ప‌స్సు చేత బ్రహ్మమును తెలుసుకొనుమ‌ని వేదము చెప్పచున్నది.

"త‌పసా బ్రహ్మవిజిజ్ఞాస‌స్వం" (తైత్తిరీయోప‌నిష‌త్తు. భృగువ‌ల్లి. 2 అనువాక‌ము)

ఉపాస‌క ధ‌ర్మముల‌లో త‌ప‌శ్చ స్వాధ్యాయ ప్రవ‌చ‌నేచ‌. (త‌ప‌స్సున్ను, స్వాధ్యాయ ప్రవ‌చ‌న‌ములు అనుష్టింప‌ద‌గిన‌వి అని చెప్పబ‌డిన‌ది.)

త‌ప‌స్సన‌నేమో శ్రీ‌కృష్ణభ‌గ‌వానుడు భ‌గ‌వ‌ద్గీత‌యందు స్పష్టప‌ర‌చి యున్నాడు. ఆత‌పోవ్రత‌మునే మ‌న‌మాచ‌రింప‌వ‌ల‌శిన‌ది.

1. "దేవ‌ద్విజ‌గురుప్రాజ్ఞ పూజనం శౌచ‌మార్జవం
బ్రమ్మచ‌ర్య మ‌హింసాచ శారీరంతఉచ్యతే"

దేవ‌త‌ల యొక్కయు, బ్రాహ్మణుల యొక్కయు, విద్వాంసుల యొక్కయు, పూజ‌న‌మును, శుచిత్వము స‌ర‌ళ‌త‌, బ్రహ్మచ‌ర్యము, అహింస యనున‌వి శారీర‌క‌త‌ప‌స్సని చెప్పబ‌డిన‌ది.

2. "అనుద్వేగ‌క‌రం వాక్యం స‌త్యం ప్రియ‌హితంచ‌య‌త్ !
స్వాధ్యాయాభ్యస‌నంచైవ వాజ్ఞ్మయంత‌పఉచ్యతే"

మ‌న‌స్సున‌కు ఉద్వేగ‌మునియ్యనిదియు, స‌త్యమును, ప్రియ‌మును, హిత‌క‌ర‌మును, అయిన‌భాష‌ణ‌మును, స్వాధ్యాయ‌మును, వాచ‌క‌మైన‌త‌ప‌స్సు అని చెప్పుచున్నారు.

3." మ‌నఃప్రసాద‌స్సౌమ్యత్వం మౌన‌మాత్మవినిగ్రహః !
భావ‌సంశుద్ధి రిత్యేత‌త్తపోమాన‌స‌ముచ్చతే"

మ‌న‌స్సును ప్రసన్నముగ‌నుంచుట‌, సౌమ్యత‌, మౌన‌ము. మ‌నో నిగ్రహ‌ము, శుద్ధభావ‌న యనున‌వి మాన‌స‌త‌ప‌స్సని చెప్పుచున్నారు. ఈ మూడు విధ‌ముల‌గు త‌ప‌స్సులును తిరిగి సాత్విక‌, రాజ‌స‌, తామ‌సిక‌ త‌పస్సులుగా విభ‌జింప‌బ‌డిన‌వి.

1." శ్రద్ధయా ప‌ర‌యాత‌ప్తం త‌ప‌స్తత్త్రి విధంన‌రైః
అఫ‌లాకాంక్షిభిర్యుక్తైస్సాత్వికం ప‌రిచ‌క్షతే"

ఫ‌లాశ‌నువ‌దలి అధిక‌మ‌గుశ్రద్ధతో యోగ‌యుక్తమ‌గు బుద్ధితోడ‌ను చేయ‌బ‌డిన‌చో అది స్వాతిక‌ము.

2. "స‌త్కార మాన‌పూజార్ధంత‌పోదంభేన‌చైవ‌య‌త్‌!
క్రియ‌తే త‌దిహ‌ప్రోక్తం రాజ‌సం చ‌ల‌మ‌ధృవం"

త‌న‌కు స‌త్కార‌ము మాన‌ము పూజ కావ‌ల‌యున‌ని డంబ‌ముకొర‌కు చేయ‌బ‌డిన త‌ప‌స్సు అస్థిర‌మైన‌ది. అది రాజ‌స‌మ‌న‌బ‌డును.

3. "మూఢ‌గ్రాహేణాత్మనో య‌త్పీడ‌యాక్రియ‌తేత‌పః
ప‌ర‌స్యోత్సాద నార్ధంవాత్తామ స‌ముదాహృతం"!!

వెఱ్ఱిప‌ట్టుద‌ల‌చే త‌న్ను పీడించున‌దియు లేక లోకుల‌ను పీడించుట‌కు చేయ‌బ‌డున‌దియు, తామ‌సిక త‌ప‌స్సన‌బ‌డును.
(భ‌గ‌వ‌ద్గీత 17-14-19)

భూత‌హిత‌ము

4. మాన‌వుడు స‌ర్వభూత‌ముల యొక్క హిత‌మునందు త‌త్పరుడు కావ‌ల‌యును. ధ‌ర్మము (Religion) స‌ర్వ‌భూత‌ముల‌యోక్క హిత‌ముకొర‌కు యేర్పడియున్నది.
విష్ణుపురాణ‌మునందు (1-19-9) ఆత్మ స‌ర్వభూత‌ముల‌యందు వ్యాపించియుండుట‌చే అంద‌రియెడ‌ల‌ను శ్రేష్ఠులు ద‌య‌జూపుదుర‌ని చెప్పబ‌డిన‌ది.
జ‌గత్తున‌కంతకును ప‌ర‌మేశ్వరుడు తండ్రియ‌నియు, సృష్టిలోని మాన‌వులంద‌రు సోద‌రుల‌నియు, అల్పబుద్ధిక‌ల‌వారు వీరు నా బంధువులు వీరుకారు అను భేద‌బుద్ధితో వ‌ర్తింతుర‌నియు, ఉదార‌చ‌రితుల‌కు వ‌సుధ‌యావ‌త్తు ఒక కుటుంబ‌మ‌నియు, వేద‌ముచాటుచున్నది.

"అయంబంధుర‌యంనేతి గ‌ణ‌నాలఘ‌చేత‌సాం
ఉదార‌చ‌రితానాంతు వ‌సుధైవ కుటుంబ‌కం" (సామ‌వేదము. మ‌హొప‌నిష‌త్తు)

స‌ర్వభూత‌ముల‌యొక్క హిత‌మునందు త‌త్పరులైన‌వారు త‌న్నుత‌ప్పక పొందుదుర‌ని శ్రీ‌కృష్ణుడభ‌య‌మిచ్చియున్నాడు.

"తేప్రాప్నువంతి మామేవ స‌ర్వభూత హితేర‌తాః"

ఎవ‌రికి ద్వంద‌బుద్ధివ‌ద‌లిన‌దో యెవ‌రిపాప‌ములు న‌శించిన‌వో, యెవ‌రు స‌ర్వభూత‌ముల‌కు హిత‌ముచేయుట‌యందు త‌త్పరులైరో, వారికి బ్రహ్మనిర్వాణ రూప‌క‌మ‌గు మోక్షము ల‌భించున‌ని గీత చెప్పుచున్నది.

"ల‌భంతే బ్రహ్మనిర్వాణ‌మృష‌యః క్షీణ‌క‌ల్మషాః
ఛిన్నద్వైధాయ‌తాత్మాన‌స్సర్వభూత హితేర‌తాః "(గీత‌. 5-25)

జీవ‌కారుణ్యము (non-injury to any creature) క‌లిగియుండ‌వ‌లెను. అన‌గా ఎట్టిహింస‌యు ప‌నికిరాదు. జీహింస‌నుగురించి వేద‌మేమి చెప్పుచున్నదో విచారింత‌ము.

"ఏవాజినం ప‌రిప‌శ్యన్తి ప‌క్వంయ ఈమాహుః
సుర‌భ‌ర్రిర్హరేతి! యేచార్వతో మాంస‌భిక్షా
ముపాస‌త ఉతోతేషా మ‌భిగూర్తిర్న ఇన్వత్తు." (ఋగ్వేద‌ము, 1 మండ‌ల‌ము, 2 అష్టకం. సూక్తం 162, మంత్రము 12)

అన్నమును జ‌ల‌మును శుద్ధిప‌ర‌చి ప‌క్వము చేసి భుజించుట‌ను ఏమ‌నుష్యులు క‌నిపెట్టుదురో, ఎవ‌రు మాంస‌ముల‌ను విస‌ర్జించి శుద్ధాన్నమును భుజింతురో, అట్టివారు శ్రేష్టుల‌గుదురు.

"ఘృతం దుహ‌నామ‌దితం జ‌నాయాగ్నేమాహింసీః" (య‌జుర్వేద‌ము, 17 అధ్యాయం 49 మంత్రము)

నెయ్యినిచ్చున‌వియు, ర‌క్షాయోగ్యమ‌గు ప‌శువుల‌ను హింస‌చేయ‌కుడు.

"ఇమ‌మూర్ణాయుం వ‌రుణ‌స్య నాభింత్వచం
ప‌శూనాం ద్విప‌దాం చ‌తుష్పదాంత్వష్ణుః ప్రజా
నాం ప్రథ‌మంజ‌నిత్ర మ‌గ్నేమాహింసీః" (య‌జుర్వేద‌ము. 17 అధ్యాయ‌ము 50 మంత్రము)

రెండు కాళ్లుగ‌ల మ‌నుష్య ప‌క్ష్యాదులును, నాలుగుకాళ్లుగ‌ల గ‌వాదిప‌శువుల‌ను, మేక‌లుచ గొఱ్ఱెలు, మొద‌ల‌గువానిని హింసింప‌కుడు.

ప‌శూపాహి (య‌జుర్వేద‌ము. 1 అధ్యాయం ) జంతువుల‌ను ర‌క్షంపుడు.

"యఆమం మాంస‌మ‌ద‌న్తి పౌరుషేయంచ యేక్ర
విః ! గ‌ర్భా ఖాద‌న్తి కేశ‌వ‌స్తానితో నాశ‌యామ‌సి" (అధ‌ర్వణ వేద‌ము. 8 కాండ అను సూ 6 మం 27)

ఎవ‌డు మాంస‌ముతినునో, ఎవ‌డు గ్రుడ్లనుతినునో వానిని రాజు నాశ ప‌రుచుకోద‌గును. ఈ విధ‌ముగా జీవ‌హింస ప‌నికిరాద‌ని వేద‌ముల‌నేక విధ‌ముల ఘోషిల్లుచున్నవి. ఈ వేద‌ధ‌ర్మమునే స్మృతులును భార‌త‌మును చాటుచున్నవి. బ్రహ్మచ‌ర్యమునుగురించి వెనుక‌నేచెప్పబ‌డెను. ప్రాపంచ‌క‌విష‌య‌ముల‌యందు లంప‌టత్వము లేకుండుట‌నుగూర్చి ముందుప్రక‌ర‌ణ‌మున విచారింప‌బ‌డును.

Thursday, 30 January 2014

మాఘమాసం ఈ నెల 31వ తారీఖున ప్రారంభము అవుతోంది.

Bramhasri Samavedam Shanmukha Sarma
చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ఈ నెల 31వ తారీఖున ప్రారంభము అవుతోంది. కార్తీక మాసం లో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంతుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత....అంత ప్రాధన్యత!

ఈ మాసం అంత తెల్లవారుఝామునే లేచి,

దుఖఃదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రతః స్నానం కరోమధ్య మాఘే పాపవినాశనం "

అనే ఈ స్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువలలో గాని ,బావులవద్దగాని, స్నానం చెయ్యడం విసేషం.
పైన చెప్పిన ప్రదెసాలలో కుదరకపోతే ,కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ,గోదవరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటు స్నానం ఆచరించవలెను.
స్నానాంతరం ఎదైన ఆలయానికి వెల్లడం మంచిది.
ఈ మాసం లో శివాలయంలో నువ్వులనూనే తో దీపాలను వెలిగించవలెను.
ఈ మాసం లో ని ఆదివారాలు సూర్య ఆరధనకు ఎంతో ఉత్కృష్టమైనవి. అసలు మాఘ మాసం లో ప్రతి వారు సొర్ర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు.
అలాకాని పక్షం లో ప్రతి ఒక్కరు పొద్ద్దున్నే సూర్యొదయ సమయంలో,సుచిగా , సూర్యుడి నామాలు చెప్తూ, అర్ఘ్యం ఇచ్చుకోవాలి.
కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో తో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగ చెస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం.

ఈ మాసంలోని శుక్లపక్ష తదియనాడు బెల్లము,పప్పులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాల మంచిది.

అలాగే ఈ మాసం లో రథ సప్తమి తో పాటు చాల విసేషమైన రోజులు ఉన్నాయి...శ్రీ పంచమి, వరచతుర్డశి , వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ.

......లోకా సమస్థ సుఖినో భవంతు !

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.

Subha Mantrala
ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి.
తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి :
అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.

విదియ :
అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.

తదియ :
అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.

చవితి:
అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.

పంచమి:
అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.

షష్టి :
అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.

సప్తమి:
అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.

అష్టమి:
అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము.

నవమి:
అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.

దశమి:
అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.

ఏకాదశి:
అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.

ద్వాదశి:
అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.

త్రయోదశి:
అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.

చతుర్దశి:
అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.

అమావాస్య:
అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.

పౌర్ణమి:
అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

విష్ణువుకి ఏ పాత్రలో నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

Subha Mantrala

విష్ణువుకి ఏ పాత్రలో నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

did you know which metal container use naivedyam for lord vishnu

సాధారాణంగా ఆలయదర్శనానికి వెళ్ళినపుడు, అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతుండటాన్ని చూస్తుంటాం. ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ వుంది. ఆ కథను సాక్షాత్తు శ్రీమహావిష్ణువే చెప్పాడు. పూర్వం గుడాకేశుడనే రాక్షసుడుండేవాడు. అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికి, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతుండే వాడు. గుడాకేశుడు విష్ణుభక్తుడు. నిరంతరం విష్ణునామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తుందేవాడు.

ఇదిలాఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సుచేయాలనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చేసాడు. అతని తపస్సు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని అడిగాడు. దానికి గుడాకేశుడు, తనకు ఏమి అక్కరలేదని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణు చక్రం వల్ల సంభవించాలని, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధాన మయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు.

విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ద ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిశ్చయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా? అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించిది. వెంటనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారైంది. ఆ పాత్రలో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించదమంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి.

రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులుంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలాడని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. విష్ణుమూర్తికి రాగిపాత్రలో నైవేద్యాన్ని సమర్పంచడం వెనుక కధ ఇది. సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు, మహాలక్ష్మికి పానకం, వదపప్పు, శ్రీలలితామాతకు గోక్షీరాన్నం, పులిహోర ఇష్టం. కృష్ణునికి అటుకులు, బెల్లం ఇష్టం. ఇలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రసాదం ఇష్టం

బిల్వ వృక్షం :

Subha Mantrala
బిల్వ వృక్షం :

మారేడు లేదా బిల్వము.ఇది వెలగ అనే వ్యావహారికనామంతోనూ ప్రసిద్ధి.మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు.

హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు అకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చిట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి.

మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు బావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మముని పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి వుంచగలనని విన్నవించాడు. అంత శివుడు మారునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిని పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వశించినారు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి నాయందే నీవు వశించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సుర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.

మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంద్యాసమయము, రాత్రి వేళలందు, శిరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు కనుక ఈ దళాలను ముందు రోజు కోసి బభద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.

మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.

పురాణాలలో విశిస్టమైన త్రియాలు ఏవి ?

Subha Mantrala
పురాణాలలో విశిస్టమైన త్రియాలు ఏవి ?

బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ----------------- త్రిమూర్తులు
సరస్వతి , లక్ష్మి , పార్వతి ---------------------త్రిమాతలు
భూలోకము , స్వర్గలోకం ,పాతాళలోకం ----------త్రిలోకాలు 
భూత , వర్త , భవిష్యత్ కాలము ----------------త్రికాలాలు
సత్వ, రజో , తమో గుణము -------------------త్రిగుణాలు
పిత్రు ఋణము , ఋషి ఋణము , దేవ ఋణము---త్రిఋణాలు
ఉదయము , మధ్యాహ్నము , సాయంత్రము ------త్రిసమయాలు
కీర్తి -కాంత-కనకం--------------------------తాపత్రయాలు

కర్మత్రయం :--

ఎండ,వర్షం,చలి-----------------వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం,
అదుపు,స్వేచ్ఛ,ఉపేక్ష------------మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం,
నిజం,అబద్దం,రహస్యం-----------మనం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం,
రాజ్యం,సమాజం,వ్యక్తి------------రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం,
విశ్వాసం,శాస్త్రీయత,హేతుబద్ధత----ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం

సాధారణంగా మనందరం నిత్య పూజ చేస్తాము.

Padma Mvs
సాధారణంగా మనందరం నిత్య పూజ చేస్తాము. పూజ కుదరని వాళ్ళు కనీసం రోజు కొన్ని స్త్రోత్రాలు, దైవానికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటారు. వీటిలో ప్రాత: స్మరణ శ్లోకాలు అని కొన్ని ఉన్నాయి. నదులు, వృక్షాలు, పర్వతాలు--ఇలా ప్రకృతికి సంబంధించిన అన్ని అంశాలను పూజించే సంస్కృతీ మనది. భారతంలో "మహనీయ జపము " అనే పేరుతో ధర్మరాజుకు భీష్ముడు వివరించాడు. ప్రతిరోజూ మహనీయుల స్మరణ ఇలా చేయాలి అన్నాడు.

ముందుగ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, తరువాత వినాయకుడు, కుమారస్వామి, వాయువు, సూర్యచంద్రులు, ఇంద్ర, వరుణ, యమ, కుబేరులు, కామధేనువు, సప్త సముద్రములు, గంగాది మహానదులు,వసు రుద్రాది దేవతలు, పితృదేవతలు, వాలఖిల్యులు, ( వీరు అంగుశ్త ప్రమానములో ఉంది వేలాది సంఖ్యలో నిరంతరమూ తపస్సులో ఉండే మునులు, ) వేదవ్యాస నారదాది మహర్షులు, రంభ మెనకాది దెవతాంగనలు, దివారాత్రములు, తారకలు, మాస, రుతు, సంవత్సరములు, గరుత్మంతుడు, వాసుకి మొదలయిన మహానాగములు, కాశీ కురుక్షెత్రాది పుణ్య ప్రదేశాలు, నైమిశాది అరణ్యాలు, మేరు, కైలాస, హిమాచాలాది పర్వతాలు, భూమి, దిశలు, ఆకాసము, పుణ్య వృక్షములు, మాంధాత మొదలైన షట్ చక్త్రవర్తులు, ఇత్యాదులను ప్రతి దినము స్మరించడం వలన ఆయురారోగ్యాది సంపదలు మనుష్యునికి లభించడమే కాకా దారిద్ర్యము, వ్యాధి, శోకము నశిస్తాయని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు.

ప్రతి రోజు, ప్రతి వారు పథించ వలసిన విష్ణు స్తోత్రము ఇలా చెప్పాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ , నమ: పురుశొత్తమ్మయ,
నమ: సర్వలోక గురవే, నమ: సర్వలోక పిత్రే,
నమ: సర్వలోక పితామహాయ, నమ: సర్వలోక ప్రపితామహాయ,
నమ: సర్వలోక ప్రదానాయ, నమ:సర్వ లోకేశ్వరా

నమ: సర్వలోక విశిష్టాయ, నమ: సర్వ లోక సుఖప్రదాయ
నమ: సర్వ లోక హర్త్రే, నమ: సర్వలోక నిధయే
నమ:సర్వ లోక నిదానాయ, నమ: సర్వ లోక హితాయ
నమ: సర్వ లోక హితకరాయ, నమ: సర్వ లొకొద్భవాయ
నమ: సర్వ లొకొద్భవ కారాయ, నమో విష్ణవే, ప్రభవిష్ణవే !!

దీనిని స్మరించడం ద్వారా, ఘోరపాపాలు నశించడం, శుభాలు పొందడం మాత్రమే కాక, ధర్మాచరణ యందు కోరిక కలుగుతుంది అని భీష్ముడు దీని ఫలితాన్ని చెప్పాడు.

అనాయాస మరణం, పరం లో సౌఖ్యం కావాలి అంటే , ఇహం లో ధర్మ మార్గం అనుసరించడం ఎంతో ముఖ్యం. ఇట్టి ధర్మాచరణకు నిష్ఠ కలగడానికి భగవంతుని అనుగ్రహం ఎంతో అవసరము. ధర్మమూ, సౌశీల్యము, లేకుండా చేసే పుణ్య కార్యాలు, జపతపాలు, వినయం లేని పాండిత్యము, శ్రద్ధ లేని దానము, ఇవేవి మంచి ఫలితాలను ఇవ్వలేవు. కనుక ప్రతి మానవుడు ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.

నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?

Subha Mantrala
నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?

Special article on Naivedyam Step by Step Instructions Naivedyam Hindu Gods and Goddesss

మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం ... విత్తినా మొక్కలు రావు ... వచ్చినా ధాన్యం పండదు ... పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం ... తెచ్చుకున్నా తినలేం ... ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.

ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా
ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తం మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందరు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే, మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతిమాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు. కాని భవిష్యపురాణాది గ్రంథాల్లో చెప్పిన ప్రకారం ... కలియుగంలో బ్రాహ్మణుల్లో కంటే అబ్రాహ్మణుల్లోనే ఎక్కువమంది ఆధ్యాత్మిక మహాపురుషులు జన్మిస్తారు. కాబట్టి యుగధర్మాన్ని బట్టి అదొక లోపంగా భావించనక్కరలేదు.

ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.

హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీ మధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.
"శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.

భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి. హారతి ఇచ్చాకనే నైవేద్యం సమర్పించాలి.

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి శ్లోకం :
శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||
విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||
ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...
ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |

అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.
తరువాత--
ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |
అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.
నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత అర్థం మీకు తెలుసా?

Subha Mantrala
అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత అర్థం మీకు తెలుసా?

Information of Importance and Meaning Antakshari Maha Mantra in Telugu at Teluguone.com and many more

“ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.

అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.

జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,

“న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

“న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత స్వేతివైశ్రుతిః!

స్నానపానాదిగల సమస్తకర్మలలో “నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.

ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః
ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!!

సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర ‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.

ఆమ్నా యాభ్య సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం
మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని
తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద
ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః

‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).

శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,
హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్

‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. అంతటి పుణ్యకార్యాన్ని (నామస్మరణం) గతజన్మలో చేయకపోవడం వలెనే, ఇప్పుడు ‘ఈ దుఃఖభాజకమైన జన్మ’ కలిగింది.
Subha Mantrala's photo.
Subha Mantrala's photo.

మనోబుద్దులు అంటే ఏంటివి? వాటి పని ఏమి?

Subha Mantrala
మనోబుద్దులు అంటే ఏంటివి? వాటి పని ఏమి?

శుద్ధ చైతన్యమైన ఆత్మ సహాయం లేకుండా ఏ ఇంద్రియం కూడ పనిచెయ్యలేదు. ఆత్మ యొక్క శక్తి ద్వారానే ఇంద్రియాలన్ని జీవుని ద్వార నడుస్తున్నాయి. మాయ కమ్మిన ఆత్మే జీవుడు. ఆ జీవుడు నేను నాది అనే అహంకారంతో అంతఃకరణ చతుష్టయం లోనే ఉంది. మనోబుద్దులు శరీరం లోపల పని చేస్తూ ఉంటాయి, అవి నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి

1. మనస్సు: ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా ,కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకల్లోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.

2. బుద్ధి: ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.

3. అహంకారం: తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే ‘అహంకారం’ అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.

4. చిత్తం: చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది.ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.

అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ ఆ పరమాత్మ స్వరూపునిని హృదయంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.

ఓం నమో పరమాత్మయే నమః

తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?

Subha Mantrala
తపస్సు అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?

తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు. భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అట్లా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తోలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియలోలత్వాన్ని బుద్దిపుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి.

ప్రతి మానవుడు తానూ జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణంను పెంపొందించుకోవాలి. తన ఇల్లే తనకు, తపస్సుకు కూడ అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. మొదట తానూ మారాలి? ఎందుకు? ఎందుకంటే నిత్యమైన, శాశ్వతమైన దానిని తెలుసుకున్నాము మరియు జీవిత లక్ష్యము తెలుసుకున్నాము, అదియే మోక్షము. ఆ మోక్ష సాధన కోసం మారాలి. మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు ,ఉద్దేశించాడు) ఏర్పరచినాడు. మానవుడు దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్దిగా తపస్సంపన్నుడు కావాలి.

మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని అత్మనుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం. ఆత్మానుభూతి, ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్లవాల్లకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై అత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాశక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం నిరంతరం ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.

ఓం నమో పరమాత్మయే నమః

మోక్షము పొంది జన్మ రహిత్యమును పొందు వారెవరు?

Padma Mvs
ఒకానొకప్పుడు యమదూతలు మోక్షము పొంది జన్మ రహిత్యమును పొందు వారెవరు? మరియు, నరకార్హులై సంసారమున మగ్గు వారెవరు అని అడిగినపుడు విష్ణు దూతలు ఈ విధముగా సమాధానము ఇచ్చారట.

దుష్ట జన సాంగత్యము వీడి సాదు జనులను ఆశ్రయించు వారు, అనుక్షణము భగవత్ స్మరణతో నుండు వారు, స్నాన, సంధ్యా, జప, హోమ స్వాధ్యాయము లు ఒనరించు వారు, సర్వ భూతములను సమ భావముతో చూచువారు, నిత్యమూ అన్న దానము చేయువారు, గో, హిరణ్య, విద్య , కన్య దానము చేయువారు, పరోపకార పారిణులు, జ్ఞాన మార్గ నిష్ణాతులై, ఇతరులకు ఉపదేశించు వారు, కపట రహితులై శ్రద్ధా భక్తులతో భగవత్ ఆరాధనా చేయువారు, నిర్ధనులకు ఉపనయన, వివాహాది సుభ కార్యములు చేయువారు, అనాధలకు సుశ్రుష చేయువారు, నిత్యమూ సాలగ్రామ తీర్ధము సేవించువారు, తులసి మాలను ధరించి, విష్ణు అర్చన చేయువారు, తులసి వనము పెంచువరు, గృహములందు నిత్యమూ దేవతారాధన, గీత పారాయణము, నామ సంకీర్తన జరుపువారు, గృహమందు, భాగవత గ్రంధమును పూజించు వారు , సూర్యుడు తుల, మకర, మేష రాశులందు ఉన్నపుడు స్నానము చేయువారు, మణికర్ణికా ఘట్టము నందు మరణించు వారు, పవిత్ర భగవన్నామ స్మరణ చేయుచు మరణించు వారు, పంచ మహా పాతకములు చేసిన వారుకూడా నామ సంకీర్తన మాత్రమున వైకుంఠమును చేరగలరు.

త్యాగ శీలురు, సత్య అహింస లనే ఆధారముగా చేసికొని సాత్వికపు వృత్తిలో జీవితము గడుపువారు, హృదయ సదనమున పరమాత్మను పూజించువారు దేవాలయములు, గోవులు, ఆశ్రమములు, బ్రాహ్మణులూ కనపడినపుడు దండ ప్రణామములు చేయువారు ముక్తిని పొందగలరు.

ముక్తికి జాతి, మత, వయో బేధములు లేవు. జన్మ పరమ్పరలను తొలగించుకొనుతయె ముక్తి పొందుట. కావున సర్వులు ముక్తిని పొందుటకు సర్వదా త్రికరణ శుద్ధిగా ప్రయత్నించ వలెను.

(సశేషం)

సర్వ కార్య సిద్ధికి హనుమాన్ చాలీసా పారాయణము:

Padma Mvs
సర్వ కార్య సిద్ధికి హనుమాన్ చాలీసా పారాయణము:

రామచరిత మానసము అనే గ్రంధము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన పిదప ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి. కేవలం హనుమంతుని స్మరించటం వలన బుద్ది, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట ,వాక్సుద్ధి, సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగును.

బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా:
అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణా ర్భవెత్.

అని కదా శాస్త్ర వచనం.

హనుమంతుని అరటి తోట మధ్యలో కాని, అరటి చెట్లతో ఏర్పరిచిన మందిరంలో కాని పుజించినచొ విశేష ఫలములు కలుగును. స్వేతార్క పుష్పాలను హనుమ పూజలో ఉపయోగించ వచ్చును. శ్వేతార్క పుష్పములతో అరటి తోటలో హనుమను పూజించు వార్కి విశేష ఫలములు కలుగును. హనుమను పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును. రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును.

యుద్ధములో మూర్చ పోయిన లక్ష్మణునకు సంజీవని పర్వతమును తెచ్చి ఆరోగ్యమును నిలిపిన హనుమను రామచంద్రుడు చిరంజీవి అని ఆశీర్వదించెను. అందువలననే ఈయన చిరంజివులలొ ఒకడైనాడు.

అశ్వద్ధామ బలిర్వ్యాసో, హనుమన్స్చ విభీషణ,
కృప, పరశురామశ్చ, సప్తైతే: చిరజివిన:

ఈ శ్లోకం చదువుకోను వారికీ అన్ని వ్యాధులు పోయి సుఖముగా దీర్ఘాయువుతో జివించెదరు.

పరమ పవిత్రమైన హనుమంతుని నామం భక్తి శ్రద్ధలతో 12 పర్యాయములు స్మరణ చేయువారికి ఏ కార్యమైనను నిశ్చయముగా సిద్ధించును. అని పరాశర మహర్షి స్వయముగా చెప్పెను.

1. అతులిత బలధామమ్ స్వర్ణ శైలాభ దేహం,
దనుజ వన క్రుశానుం జ్ఞానిన మగ్రగన్యమ్
సకల గుణ నిదానం, వానరానా మదీశం
రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి.

2. గోష్పదీకృత వారాసిం మశకి కృత రాక్షసమ్
రామాయణ మహామాలా, రత్నం వందే అనిలాత్మజమ్

3. యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర క్రుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం.

శ్రీ హనుమతే నమ:

మాఘ మాసంలో సముద్ర స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మాఘ పూర్ణిమ నాడు అందరు తప్పనిసరిగా సముద్ర స్నానం చేస్తారు.

Padma Mvs
మాఘ మాసంలో సముద్ర స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మాఘ పూర్ణిమ నాడు అందరు తప్పనిసరిగా సముద్ర స్నానం చేస్తారు. సముద్ర స్నానమే కాకుండా, ఏదైనా నదిలో కానీ, జలాశయం లో కానీ, మనకు ఎక్క్కడ వీలుంటే అక్కడ పుణ్యస్నానాలు చేసేటప్పుడు ఆ జలములో గంగాదేవి వసించి ఉన్నది, గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది , విష్ణు లోక ప్రాప్తిని కలిగిస్తుంది అని భావించి స్నానం చేస్తాము. అటువంటి సందర్భాలలో చదువుకోవలసిన శ్లోకాలు:

1. గంగా గంగే తి యో బ్రుయాత్ యోజనానాం శతైరపి,
ముచ్యతే సర్వ పాపెభ్యో, విష్ణు లోకం సగచ్చతి.

2. అంబ: త్వ ద్దర్శన్నాన్ముక్తి: న జానే స్నానజం ఫలం
స్వర్గారోహణ సౌపానౌ మహా పుణ్య తరంగినే

3. యౌ సౌ సర్వగతో విష్ణు: చితస్వరుపే నిరంజన:
న ఏవ ద్రవ రూపేణ గంగాంభో నాత్ర సంశయ:

4.నందిని, నళినీ, సీతా, మాలిని, చ మహాపగా
విష్ణు పాదాబ్జ సంభూత, గంగా, త్రిపథ గామినీ,
భాగిరథి, భోగవతి, గంగా త్రిదశేశ్వరి,
ద్వాదశైతాని నామాని, యత్ర యత్ర జలాశయే,
స్నానకాలే పఠెన్నిత్యమ్, మహా పాతక నాశనం.

మాఘ మాసం సూర్యునికి ప్రీతికరమైనది అని అందరికి తెలుసు.

Padma Mvs
మాఘ మాసం సూర్యునికి ప్రీతికరమైనది అని అందరికి తెలుసు. ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అని ప్రతీతి. ఈ మాఘ మాసం లో సూర్యుని నుంచి వచ్చే కిరణాలూ మన శరీరం లోని అన్ని రుగ్మతలను తొలగిస్తాయి అని అంటారు. మాఘమాసం లో వచ్చే అన్ని ఆది వారాలలొను , ముఖ్యంగా రధ సప్తమి నాడు సూర్యుడిని ఎర్రటి పుష్పాలు, ఎర్రని గంధము, జిల్లేడు పూవులతో పూజిస్తారు. చిక్కుడు కాయలతో రథం చేసి, రాగి పళ్ళెం లో సూర్యుడిని ఆవాహన చేసి ఆవు పాలతో నైవేద్యం వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదిస్తారు.

ఈ మాసం అంతా ఆదిత్య హృదయం, సూర్య నమస్కార స్తోత్రాలు, చదువుకుంటారు. చిన్న పిల్లలు కూడా చదువుకోనేందుకు వీలుగా 4 శ్లోకాలు ఇక్కడ ఇస్తున్నాను . గమనించ గలరు. ఆదిత్య హృదయం, సూర్యుని స్తోత్రాలు చదువుకోవడానికి వీలు లేని వాళ్ళు, ఓపిక, తీరిక లేని వాళ్ళు. ఈ మాసం ఆంతా ఇవి చదువుకొన్నా చాలు.

సూర్యనారాయణ మూర్తిని బ్రహ్మ విష్ణు, మహేశ్వర రూపంగా కూడా భావిస్తారు.

1. నమ: సవిత్రే జగదేక చక్షుసే, జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే
త్రయీ మయీ త్రిగుణాత్మ ధారిణే, విరించి నారాయణ శంకరాత్మనే.

2. భానో భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకర:
ఆరోగ్య మాయు ర్విజయమ్ శ్రియం పుత్రాంశ్చ దేహిమే

3. బ్రహ్మ స్వరూప ముదయే, మధ్యహ్నెతు మహేశ్వరం,
సాయం సంధ్యా యెత్సదా విష్ణుం , త్రిమూర్తిశ్చ దివాకర:

4. ఓం నమ: సూర్యాయ శాంతాయ సర్వ వ్యాధి నివారినే,
సర్వొపద్రవ నాశాయ భాస్కరాయ నమో నమ:

Wednesday, 29 January 2014

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః !! పూర్తి అష్టకం .,,,,

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః !! 

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||

అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౫ ||

సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |
వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః || ౬ ||

చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః || ౭ ||

జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః || ౮ ||

అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః || ౯ ||

శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః || ౧౦ ||

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౧ ||

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః || ౧౨ ||

గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౩ ||

బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి || ౧౪ ||

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౧౪ ||

కుజదోషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదోషం ఉండదు....

Nerella Raja Sekhar

  • కుజదోషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదోషం ఉండదు....

    కుజదోషం ఉంటే వివాహం ఆలస్యమవుతుంది అని ఒక ప్రచారం ఉంది. శాస్త్ర దూరమైన అంశం. మరి కుజదోషం ఉండి చిన్న వయసులో సకాలంలో వివాహమైన వారు ఎందరో ఉన్నారు. అలాగే కుజదోషం ఉంటే భార్యాభర్తలు విడిపోతారు అని మరొక నానుడి. భార్యాభర్తలు విడిపోవడానికి కుజదోషం ఒక్కటే కారణం కాదు.

    కుజుడు అనారోగ్య కారకుడు. కలహకారకుడు. అటువంటి వాడు లగ్నంలో ఉంటే కళత్ర భావమును చూస్తాడు. అలాగే వ్యయంలో వుంటే కళత్ర భావంను చూస్తాడు. కుటుంబ స్థానాన్ని చూడరాదు.

    చతుర్థంలో ఉంటే కళత్ర స్థానాన్ని చూస్తాడు. అష్టమంలో కుటుంబ స్థానాలలో ఎక్కడ ఉన్నా కుటుంబ స్థానాన్ని చూస్తాడు. ఇటువంటి సందర్భంలో కుటుంబ కళత్ర స్థానాలతో ఆయనకు చూపు, స్థితి వంటివి వుంటే కలహాలు సృష్టించి కుటుంబ జీవనం పాడుచేసే అవకాశం ఉంది.

    కాబట్టి ఆయన స్పర్శ కుజదోషంగా ఉన్న జాతకులకు అటువంటి జాతకులతోనే వివాహం చేయమని, కుజదోషం లేనివారికి కుజదోషం లేని వారితోనే వివాహం చేయమని మహర్షి వచనం. మరి కుజదోషం అని ఎందుకు వచ్చింది అంటే కుజుడు దోషాలను కలుగజేసే సంచారంలో వున్నారు కావున దానికి కుజదోషం అని పేరు పెట్టారు.

    చాలా గ్రంథాల సమీకరణ ద్వారా ఎన్నో సూత్రాలు ఈ కుజదోషం గురించి చెప్పారు. అలాగే కొన్ని గ్రహాల స్థాన సంచారం దృష్ట్యా కుజదోషం పరిహారాలు చెప్పారు. దోష పరిహారాలు అంటే లగ్నాత్ కుజుడు ఏయే స్థానాలలో ఉంటే కుజదోషం ఉన్నది అని చెప్పారో ఆ కుజుడికి ఇతర గ్రహాల యుతివీక్షణల దృష్ట్యా దోషం తగ్గుతుంది అనే అంశాలు చెప్పారు. ఇలా ఎన్నో విశేషాలు గ్రహ సంచారం దృష్ట్యానే చెప్పారు. వీటిని అన్నింటినీ సమీక్షించి చేయు నిర్ణయం మీద వివాహం చేసుకోబోయే దంపతుల జీవన శైలి నిర్ణయించారు.

    ‘నచేచ్ఛు భయు తేనితః’ అని వున్న కారణంగా శుభ గ్రహముల వీక్షణ లేదా శుభ గ్రహముల కలయిక ఉంటే కుజదోషం ఉండదు.

    శుభ గ్రహముల కలయిక అంటే శుభ గ్రహములతో 12 డిగ్రీలలోపు కలయిక ఉండాలి. 12 డిగ్రీలు దాటిన తరువాత శుభ గ్రహం ఉంటే ఉపయోగం ఉండదు.

    ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా అని చెప్పిన శ్లోకం దేద కేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిధున కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు. మిధున లగ్నానికి కుజుడు ఆరవ శత్రు,ఋణ సహజ కారకాధిపతిగా ఉండటం వలన,కన్యా లగ్నానికి కుజుడు మూడవ సహజ సోదర కారకాధిపతి కావటం వలన ఈ రెండు లగ్నాల వాళ్ళకు కుజదోషం వర్తించదు.

    వృషభం పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు స్వక్షేత్రంలో ఉంటే కుజదోషం ఉండదు.

    మేష వృశ్చిక లో కుజుడు స్వక్షేత్రంలో వున్న దోషం ఉండదు.

    మకర కుంభ లగ్నంలో పుట్టిన వారికి సప్తమంలో కుజుడు వున్న దోషం ఉండదు.మకరం కుజుడికి ఉచ్చస్ధానం,కుంభ లగ్నానికి తృతీయ సహజ కారకత్వం వల్ల దోషం ఉండదు.

    ధనస్సు మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు వున్న దోషం ఉండదు. ఈ రెండు లగ్నాలకి కుజుడు యోగకారకుడు.

    సింహం లగ్నములో పుట్టిన వారికి కుజదోషం ఉండదు అని దేవకేరళ అనే గ్రంథమందలి విశేషం. సింహలగ్నానికి కుజుడు యోగా కారకుడు కావటం వలన కుజదోషం ఉండదు.

    మేష వృశ్చికములు కుజుడికి స్వక్షేత్రములు. మకరము ఉచ్ఛ కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. మృగశి, ధనిష్ఠ, చిత్త నక్షత్రములు కుజ ఆధిపత్యం వున్న నక్షత్రములు అందువలన ఈ నక్షత్రములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు.

    పుట్టిన సమయానికి కుజదశ వెళ్లిపోయినా వైవాహిక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధిలోకి తీసుకోనవసరం లేదు.

    చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచంలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువ.

    కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారుడు కుజుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కళత్ర కారకుడు శుక్రుడు. కలహకారుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో కలహ కాపురం తప్పదు. ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి విషయంగా కుజదోషం లలేకపోతే వారు సుబ్రహ్మణ్య ఆరాధనలు నిత్యం చేస్తే కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వస్తుంది.

వాస్తు విషయంలో దిశలు, అంటే దిక్కులు చాలా ప్రధానమైనవి.......

Nerella Raja Sekhar

వాస్తు విషయంలో దిశలు, అంటే దిక్కులు చాలా ప్రధానమైనవి.......

‘దుర్జనం ప్రథమం వందే’ అని పెద్దలు చెప్పిన హితవు. అంటే దుర్మార్గునికి ముందుగా నమస్కరించాలట. అంటే చెడు చేయకుండా ఉండేందుకు, అలాగే వాస్తులో హానికారక దిశలైన నైరుతి, వాయవ్యాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ‘నైరుతీ పాప రాక్షసీ’ అనీ, వాయవ్యం ‘చరకీపూతనా విదారే’ అని చెప్పారు. నైరుతికి ‘నిబ్బుతి’ దిక్పాలకుడు - రాహువు గ్రహము అధిపతులు - అలాగే వాయవ్యానికి ‘వాయువు’ దిక్పాలకుడు ‘కేతువు’ గ్రహము అధిపతులు. రాహు కేతువులు పాప గ్రహాలు .

వాయవ్య దిశలో ఉన్న కైబర్, ఖోలాన్ కనుమల ద్వారానే మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీ, ఛెంగిజ్‌ఖాన్, తైమూరు, బాబర్ మొదలైన వారంతా మన దేశం మీదకు దండయాత్ర చేశారు. ‘క్రూర రూపిణే కేతవే’ అని కేతువునకు పేరు. ‘రౌద్రం రుణాత్మకం ఘోరం’ అని కేతువును వేదాలు వర్ణించాయి.

మహాభారత యుద్ధానికి మూల కారకుడు గాంధార దేశాధీశుడైన శకుని అన్న వాస్తవాన్ని కాదనగలమా? నాటి గాంధార దేశమే నేటి ఆఫ్గనిస్తాన్. ఇప్పటికీ తాలిబన్లు, ఉగ్రవాదులూ ఆ దిశ నుండే మనకు చిక్కులు కల్పిస్తున్నారు కదా. పాకిస్తాన్ కూడా అదే దిశ కదా. అందుకే వాయవ్య దిశ వాస్తులో ప్రమాదకరమైన దానిగా చెప్పి, వాయవ్యం ఎత్తుగా ఉండాలని చెప్పారు. ఎత్తుగా ఉంటే అవతలి భాగం పల్లంగా ఉంటుంది కనుక చెడు శక్తిని రాకుండా ఉన్నత భాగం అడ్డుకుంటుంది.

శ్రీమద్రామాయణంలో కూడా శ్రీరామచంద్ర మూర్తి సాగరునిపై కోపంతో ధనుస్సులు ఎక్కుపెట్టగా, సముద్రుడు శరణు గోరతాడు. అప్పుడు శ్రీరాముడు, ఎక్కుపెట్టిన బాణం వృధా పోదు. ఎవరి మీద ప్రయోగించమంటావు అంటే నైరుతి దిశలో సముద్ర రాక్షసులున్నారు. వారిపైన ప్రయోగించండి అంటాడు. అంటే నైరుతి దిశ ప్రమాదకారి దిశ. అందుకే నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశలు ఉన్నతంగా ఉండాలని వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. ఉన్నతంగా ఉంటే అవతలి వైపు నుండి వచ్చే చెడు ప్రభావాన్ని అడ్డుకోవటం జరుగుతుంది.

మిగతా దిశల్లో-
‘ఇంద్రేచ శుభదం’ తూర్పు శుభప్రదం.
‘యమేచీ శుభదం’ దక్షిణం కూడా.
శుభప్రదమే అయితే పల్లంగా ఉండకూడదు. మలయ పర్వతాలు (నల్లమల కొండలు) నుండి వచ్చే గాలి ఆరోగ్యకరం.
‘మాష మాత్రంతు ఈశాన్యం శుభం’ అంటే మినపగింజ ప్రమాణమైనా ఈశాన్యం పెరగాలి.
‘వ్రీహి మాత్రంతు ఆగ్నేయం’ ‘తిలమాత్రం తు నైరుతీ, వాయవ్యం’ ‘దోషప్రదం’ - అంటే బియ్యపు గింజ ప్రమాణం ఆగ్నేయం కాని, నువ్వుగింజ ప్రమాణం నైరుతి, వాయవ్య దిశలుగానీ పెరిగితే అశుభాన్ని కలిగిస్తాయి. అందుకే వాస్తు నిర్ణయంలో దిక్కులను నిర్ణయించటం దిక్సూచీ సహాయంతో నిర్ణయించాలి.

Tuesday, 28 January 2014

మాఘమాస వ్రత మహాత్యాలు..

Nerella Raja Sekhar
మాఘమాస వ్రత మహాత్యాలు........................

మాఘమాసం
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది.

మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి.

మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు.

శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్ల పువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది. ఈ చవితినాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు.

శుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామదహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు.

శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామ షష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి.

శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది.

అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం.

నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు.దీన్నే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు.

ద్వాదశినాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు. త్రయోదశి విశ్వ కర్మ జయంతిగా పేరు పొందింది.

మాఘపూర్ణిమకు మరీ మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు.

మాఘమాసంలో వచ్చే కృష్ణపాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు.

కృష్ణ సప్తమినాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి.

అష్టమినాడు మంగళా వ్రతం చేస్తుంటారు.

కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు.

కృష్ణ ద్వాదశినాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు.

మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు.

మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు.

మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్యనాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు.

ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

సూర్యభగవానుడే వాస్తు పురుషుడు............

Nerella Raja Sekhar
సూర్యభగవానుడే వాస్తు పురుషుడు...............

‘రుద్రుడు’ అంధకాసురునితో యుద్ధం చేస్తూ ఉండగా స్వేదబిందువు జారి అదే వాస్తు పురుషునిగా ఉద్భవించాడని కథ. రుద్రుడు అగ్నితత్వానికి ప్రతీక. అంతేకాదు జలకారకాత్వమునకు ప్రతీక. ‘ద్రావయతీతి రుద్రః’ అని వ్యుత్పత్తి. అగ్ని నుండే నీరు జనించినదని, నీటి నుండి పృథ్వి జనించినదని ఉపనిషత్తులు సృష్టి రహస్యాన్ని విప్పి చెప్పాయి.

‘ఆకాశాద్వాయుః నామోరగ్నిః
అగ్నేరాపః ఆద్భ్యః పృథివీ- పృథివ్యా
ఓషధయః - ఓషధీభ్యో అన్నః
అన్నాద్భూతాని జాయంతే’ ఉపనిషత్తు వాక్యాలు.

అంధకాసురుడు అంటే సృష్టికి పూర్వం ఉన్న కాళరాత్రి - యుద్ధం అంటే ఘర్షణ రాపిడి - చీకటికి, రుద్మాత్మయైన అగ్ని తేజస్తత్వానికి రాపిడి జరిగి తద్వారా జలము - ఆ జలము నుండి భూమి. ఆ భూమి నుండి వస్తుజాలము - అదే వాస్తు పురుషుడు ఉద్భవించాడని. ఆ కథలోని శాస్త్ర రహస్యం- అందుకే భూమికి, ‘వసుంధారయతీ వసుంధరా’ అని పేరు. ఇవి అన్ని కూడా అష్టదిక్పాలకులు - అష్టవిధ వస్తువులకూ ఆధారమైన ‘ఇంద్ర, అగ్ని, యమ (నియమ) నిర్రుతి - వరుణ- వాయు, కుబేర, ఈశానులు అధిదేవతలుగా నిర్వచించారు.
వారే వాస్తుకు అధిపతులు.

వాస్తుకు అష్టదిక్పతులూ అధిదేవతలు. - ఆగ్నేయంలో అగ్ని (వంటిల్లు),

తూర్పు వైపు ముఖము - దక్షిణమున శయన మందిరము - పఠనాలయం.

నైరుతి - ఆయుధ మందిరము (క్షత్రియోచిత వృత్తుల వారికి) సామాన్యులకు ఉపకరణాలు రోలు, రోకలి - తదితర సాధనాలు.ఆరుబయట కాలకృత్య గృహాలు - ఉండాలన్నారు.

నైరుతి దిశ గురించి మంత్రశాస్త్రంలోనైతే గృహాంతర్భాగ నైరుతిలో (బంధాలు కాదు) నైరుతి దిశగా దిశోన్ముఖుడై జపతపాదులు చేస్తే ఇష్టదేవతా సాక్షాత్కారంగా చెప్పారు. అంతేకాదు గృహాంతర్భాగంలో నైరుతి దిశ ఆధిపత్య స్థానం కనుక గృహ యజమాని శయ్యామందిరం ఉండాలని చెప్పారు.

ఇక పూర్తి పశ్చిమం వరుణ దిశ - జలభాండాలు ఉండవచ్చు. భోజనశాల ఉండవచ్చునన్నారు.

వాయవ్యం - అంతర్భాగంలోనైతే ధాన్యాగారం - ఆరుబయట ఐతే పశువులు పెంపుడు జంతువులకూ నిర్దేశించారు. ఉత్తరం కుబేర స్థానం ధనాగారం.

ఈశాన్యం - గృహాంతర్భాగంలోనైతే దేవపూజా మందిరం - ఆరుబయటనైతే నూతులు - జలాధార వసతులు నిర్దేశించారు. ఇదే స్థూలంగా వాస్తు శాస్త్ర శాస్ర్తియత ఏ పనినైనా శాస్ర్తియంగా చేస్తే శ్రేయస్సు కలుగుతుందని ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ’ అని గీతావాక్యము. ‘లోకులకు అక్షి శాస్తమ్రు’ అని పండితసూక్తి. అంటే లోకులకు శాస్తమ్రు కన్ను వంటిది అని చెప్పారు. వస్తు నిర్మాణంలో వాస్తు శాస్త్రం ప్రధానం. వస్తువు అంటే - ఇల్లు, భవనం, నగరం, ప్రతిమ, శిల్పం మొదలైనవి.

Monday, 27 January 2014

తెలుగు నెలలు (తెలుగు మాసములు) :

తెలుగు నెలలు (తెలుగు మాసములు) :

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము

ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.