Sunday, 8 September 2013

బ్రిటీష్ వాళ్ళు భారతీయ విద్యా వ్యవస్థను, భారతీయ సమాజాన్ని ఎలా నాశనం చేశారు?

Hindu Nava Nirman Samithi

బ్రిటీష్ వాళ్ళు భారతీయ విద్యా వ్యవస్థను, భారతీయ సమాజాన్ని ఎలా నాశనం చేశారు?

( స్వర్గీయ రాజీవ్ దీక్షిత్(Social activist, Bharat Swabhiman Andolan) ఉపన్యాసం నుండి అనువాదం )

భారతీయ సంస్కృతిని నాశనం చేయుటకు మెకౌలే అనే వ్యక్తిని భారతదేశానికి పంపించారు. మెకౌలే భారతదేశానికి వచ్చిన తరువాత ఒక సర్వే నిర్వహించాడు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే భారతదేశ సంస్కృతి, విద్యా వ్యవస్థ ఇక్కడ ఉండే గురుకుల పాఠశాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారతదేశంలో ఉండే పాఠశాలలను/స్కూళ్ళను అప్పుడు గురుకులాలు అని పిలిచేవారు. 1835 లో మెకౌలే ఆదేశాల మీదగా 1500 మంది ఆఫీసర్లు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, దేని మీద ఆధారపడి ఉంది అని సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే భారతదేశం మొత్తం విద్యా వ్యవస్థ గురుకులాలలో ఆశ్రమ పద్దతిలో జరుగుతుంది. ఈ పాఠశాలలో ఏమేమి భోదిస్తున్నారు అని కూడా సర్వే చేశారు. ఆ సర్వేలో ఒక భాగాన్ని చూడండి, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో !

బ్రిటీషు సర్వే రిపోర్ట్ ప్రకారం 1835 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక లక్ష 50 వేల కాలేజీలు/కళాశాలలు ఉండేవి. నేను అప్పటి బ్రిటీషు లాండ్ రెవెన్యూ రికార్డ్స్ను భారతీయ లైబ్రరీ ఆఫీసును నుండి తీసుకుని చూశాను. వాటిని ఎందుకు చూశాను అంటే 1853/1840 లో మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తం మీద పల్లెటూళ్ళు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి. కాబట్టి మొత్తం 1 లక్ష 57 వేల పల్లెటూళ్ళు మరియు ఒక లక్ష 50 వేల కాలేజీలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. అంటే సరాసరి చూసుకుంటే ప్రతీ ఊర్లో ఒక కాలేజీ ఉండేది. దాన్ని బ్రిటీషు పరిభాషలో చెప్పాలి అంటే Higher learning institutes అంటే చిన్న చిన్న పాఠశాలు కాదు. స్కూళ్ళ విషయానికి వస్తే ప్రతి ఊర్లో రెండు మూడు ఉండేవి. ఈ 1 లక్ష 50 వేల కాలేజీలలో ఏం భొదిస్తున్నారు అని బ్రిటీషు వారు చేసిన సర్వే ప్రకారం వీటిలో 1500 శస్త్ర చికిత్స/సర్జరీ కాలేజీలు. ఇవి కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీలోనివి మాత్రమే భారత దేశం మొత్తం కాదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సర్జరీ కాలేజీలలో చదువుకునే వారు మంగల జాతి వారు. బ్రిటీషు వారి పుణ్యమా అంటు మన దేశంలో ఒక తప్పుడు ప్రచారం ఉంది. అది ఏమిటంటే శూద్రులను పై కులాలవారు చదువుకోనివ్వలేదు అని. మన దేశం లో ఒక మంగల వాడు సర్జన్ అయినప్పుడు తక్కువ జాతి వారు చదువుకోకపోవడం అసంభవం ! బ్రిటీషు వారి సర్వే ప్రకారం ఆ కాలేజీలలో 70% శూద్రులు, 30% మంది బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు విద్యను అభ్యసించేవారు.

ఆ రిపోర్ట్ లోని ఇంకొక విషయం ఏమిటంటే భారతదేశంలో ఉండే శూద్ర జాతి వారి చేతిలో గొప్ప టెక్నాలజీ/విజ్ఞానం ఉండేది. ఇది నా రెపోర్ట్ కాదు బ్రిటీషు వారి రిపోర్ట్. ఇప్పుడు కూడ మీరు మద్రాసు కు వెళ్ళి చూస్తే "పెరియార్" అనే జాతివారు ఉంటారు. వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రిటీషు వారి సర్వే ప్రకారం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే 2200/2300 Architect /భవన నిర్మాణ కాలేజీలలో ఉపాధ్యాయులు/ఆచార్యులు ఆ పెరియార్ జాతి వారే. అక్కడ వాస్తు కళ, భవన నిర్మాణం గురించి చదువుకున్నది పెరియార్ జాతి వారే. దక్షిణ భారతదేశం లో మనం చూసే ఆలయాలు మీనాక్షిపురం, మదురై వంటివి అన్నీ పెరియార్లు కట్టించినవే. నిర్మాణం పరంగా చూసినా, డిజైన్ పరంగా చూసినా అటువంటి ఆలయాలను మనం ఉత్తర భారతదేశంలో చూడలేము. వాటన్నిటిని పెరియార్లు కట్టించేవారు. పెరియార్లు అనబడే వారి పని మందిర నిర్మాణం. కాని 1890 తరువాత బ్రిటీషు వారు పెరియార్లను నాశనం చేశారు. ఎ. ఓ. హ్యూం అనే ఆఫిసర్ మద్రాస్ ప్రెసిడెన్సీ కి కలెక్టరుగా ఉండేవాడు. ఆ అదికారంతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఒక చట్టాన్ని సృష్టించాడు. అప్పటిదాకా మందిర నిర్మాణం పెరియార్లు చేశారు కాని ఎ. ఓ. హ్యూం చట్టం ప్రకారం పెరియార్లు మందిర నిర్మాణం చేయకూడదు. ఒకవేళ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. అలా పెరియార్లను మందిర నిర్మాణం చేయకుండా అపేశాడు. ఫలితంగా పెరియార్ జాతి వారు తక్కువ అవుతూ వచ్చారు. బ్రిటీషు వాళ్ళు భారతీయ సమాజాన్ని అలా విభజించారు.

-(స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసం నుండి అనువాదం )

Video link: http://www.youtube.com/watch?v=rcUaUfesoRE