Friday 27 September 2013

సాయంసంధ్య

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు
మాములుగా అందరు రోజు అంటే రాత్రి పగలు కలిపి ఒకరోజు అనుకుంటారు. కాని పగలు రాత్రి కానీ సమయం ఒకటి వుంది. అదే సాయంసంధ్య. ఇది 4-6 మధ్య కాలం. రెండు గంటల సమయం. దీనికి పగలు రాత్రికి సంబంధం లేదు.

మానవుడి జీవితం 100ఏళ్ళు అనుకుంటారు అందరు. కాని 100 ఏళ్ళలో ప్రతి నిత్యం ఈ రెండు గంటలు కూడా చేరిస్తే ఎంత వస్తుందో అదే అసలు వయస్సు అని మహాభారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో తెలియచేయబడింది. అంటే రోజులో 22 గంటలు ఒకరోజు 2 గంటలు ఇంకో భాగం.. 2 X 12 = 24గంటలు. ఇంచుమించుగా 90ఏళ్ళు మాత్రమే కలియుగంలో మానవుడి అసలు వయస్సు అని శాస్త్రం చెపుతుంది. ఇది పంచమవేదం. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం ఈ నాలుగు వేదాల సారం మహాభారతం.
ఇలాంటి ఎన్నో మనకి తెలియని విషయాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కనీసం మహాభారతం లాంటి పంచామవేదాన్ని చదవండి. 4 వేదాల సారం దాదాపు 80% ఈ ఒక్క గ్రంధంలో ఉంది.