Monday, 2 September 2013మ|| కొడుకుల్ పుట్టరంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులు లేని యా శుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా! 28వ పద్యము శ్రీ కాళహస్తీశ్వర శతకము -దూర్జటి
తా|| ఈశ్వరా! లోకములోని జనులెంత అవివేకులు! కొడుకు పుట్టాలేదనియు, తమకు ఉత్తంగతులు లేవనియు అజ్ఞానముచే ఏడ్చుచుందురు. కౌరవచక్రవర్తి యైన ధృతారష్ట్రునకు వందమంది కొడుకులు పుట్తిరిగదా! వారివల్ల అతడెంత ఉత్తమగతికి బోయినాడు? బ్రహ్మచారిగా నుండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు గలిగినవి? ఇదంతయు భ్రాంతి తప్ప మరొకటి కాదు; అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసికొని పోవునా? వట్టిది. “జ్ఞానేనహి నృణాం మోక్షః”.