Friday 23 August 2013

సంకట చతుర్ధి పూజ గురించి

http://www.dhrishticreations.com/files/ganeshapooja1.htm

http://www.drikpanchang.com/festivals/sakat-chauth/sakat-chauth-date-time.html
కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారం గణేశుడు
ganeshaమనం సాధారణంగా ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పూజకి అయినా ముందుగా ఎలాంటి విఘ్నాలు రాకూడదని పూజించే దైవము విఘ్నేశ్వరుడే! పిల్లలకి చదువు సంధ్యలు... పెద్దలకి వృత్తి ఉద్యోగాలు... లభించాలన్నా; భారతదేశం అప్పులు తీర్చటానికైనా మనం తప్పక పఠించేది గణేశ శ్లోకాలే అంటే అతిశయోక్తి కాదు. ఏ పూజలోనైనా ముందుగా పసుపు వినాయకుని చేసి మండపారాధన కావించి సంకల్పం చెప్పుకొని అపుడు మిగిలిన పూజ కార్య్రకమాలు నిర్వహిస్తాము. ఇది అంతా ఎందుకు? వినాయకుని ప్రార్ధిస్తే అంతా విజయమని... అలాగే విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నములు తొలగించి ముందుకు నడిపే వాడని! వినాయక చవితిని కూడా చిన్నా, పెద్దా, ఆడ, మగా అందరూ ఎంతో ఇష్టంగా చేయటం పరిపాటి. వినాయకుని ప్రార్ధిస్తే సకల శుభాలు జరుగుతాయని బలమైన నమ్మం!
అసలు నమ్మకం అనే కాదు అది నూటికి నూరు పాళ్ళు నిజం! అలాంటి వినాయకునికి సంబంధించి నదే ఈ సంకష్ట హర చతుర్ధి!
సంకష్ట హర చతుర్ధి౎ లేక సంకష్ట చతుర్ధి౎ లేక సంకట్‌ గణేశ్‌ చతుర్ధి౎ అనేది ప్రతి మాసం కృష్ణ పక్షం లో నాలుగవ రోజు వచ్చే చవితి. సంకట హర చతుర్ధి మంగళవారం నాడు వస్తే అంగారక సంకష్ట చతుర్ధి అంటారు.

వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేశ పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసం ఆపి ఏదన్నా తింటారు.
అసలు ఈ సంకట చతుర్ధి౎ ప్రాముఖ్యత, ఉనికి అనేవి భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణం లోనూ చెప్పబడింది. ఈ సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడుచే యుధిష్టరునికి చెప్పబడింది. సంకట౎ అంటే కష్టములు/ఇబ్బందులు/ సమస్యలు హర౎ అంటే హరించటం/రూపుమాపటం మోచనమన్న అర్థంగా చెప్పవచ్చు.

అంటే సంకట హర అనగా ఎలాంటి కష్టములైనా హరించే అనచ్చు.
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు... ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
మనం ఇప్పుడు ఖర నామ సం వచ్చే సంకష్ట హర చతుర్ధి గురించి, సంకట నాశన గణేశ్‌ స్త్రోత్రం, షోడశోపచార పూజ విధానం అంటే ఏమిటి? వినాయకునికి పూజ చేసేపుడు పాటించాల్సిన నియమాలు/ పూజలో తెలుసుకోవల్సిన అంశాలు... వివరంగా చూద్దాం!
హిందువులలో ఉన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఏంటంటే ఏ వ్యక్తి అయినా స్ర్తీ/ పురుషులలో మోక్షం పొందటానికి ముందు 7 జన్మలు ఎత్తుతారు. ఆ ఏడు జన్మల అనంతరం మోక్షం పొందుతారు. కానీ ఎవరైతే సంకష్టహర చవితి చేస్తారో వారు గణేష లోకానికి వెడతారు. వారికిక పునర్జన్మ అనేది ఉండదు అని!

ఖర నామ సంవత్సరంలో వచ్చే సంకష్ట హర చతుర్ధిలు
మే నెలలో : 20-5-11...   శుక్రవారం
జూన్‌ : 19-06-11... ఆదివారం
జులై : 19-07-11... మంగళవారం
ఆగస్ట్‌ : 17-08-11... బుధవారం
సెప్టెంబర్‌ : 16-09-11... శుక్రవారం
అక్టోబర్‌ : 16-10-11... ఆదివారం
నవంబర్‌ : 14-11-11... సోమవారం
డిసెంబర్‌ : 14-12-11... బుధవారం
జనవరి : 13-01-12... శుక్రవారం
ఫిబ్రవరి : 11-02-12... శనివారం
మార్చి : 12-03-12... ఆదివారం

ఇందులో మళ్ళీ మంగళవారంతో కూడిన సంకష్ట చతుర్ధిని మనం ‘అంగారక సంకష్ట చతుర్ధి’ అని వ్యవహరిస్తాం. అది జులై 19 నాడు వస్తున్నది.

ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకునికి పూజ చేయాలి. పూజలో కూడా ‘సంకట నాశన గణేశ స్తోత్రమ్‌’ ప్రత్యేకంగా 3సార్లు పఠించాలి. 

ఎవరెవరు ఏ విధమైన కోరికలు కోరుకుంటారో అవి అన్నీ తీరుతాయి. విద్యార్ధులకు విద్య, సంతానార్ధులకు సంతానం, ధనాన్ని కాంక్షించే వారికి ధనం.. ఇలా ఎవరెవరికి కావలసిన విధంగా వారు మనసారా వినాయకుని పూజించి, వేడుకొని వినాయకునికి సంబంధించిన దేవాలయాలు సందర్శిస్తారు. 
ఈ వ్రతాన్ని కేవలం దక్షిణ భారతీయులే కాక ఉత్తర భారతీయులు కూడా అమితంగా పాటిస్తారు.

ఈ క్రమంలో షోడశోపచార పూజా విధానం... అర్థం క్లుప్తంగా..
ఎవరైనా పెద్దవారు మనింటికి వస్తే ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ఎలా మర్యాదలు చేస్తామో, అదే రకంగా మన ఇష్టదైవాన్ని 16 రకాల ఉపచారాలు చేసి సేవించటమే షోడశోపచార పూజా విధానం. ఇది మన సత్సంప్రదాయం.

1. ఆవాహనం - వారిని మన ఇంటిలోకి మనస్ఫూర్తిగా రమ్మని ఆహ్వానించుట.
2. అర్ఘ్యం - కాళ్ళు, చేతులు కడుగుకోవటానికి నీళ్ళని వినయంగా అందించుట
3. పాద్యం- ’’
4. ఆసనం - వచ్చిన పెద్దలు కూర్చోవటానికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయుట
5. ఆచమనీయం - మంచినీళ్ళు (దాహం) ఇవ్వడం
6. స్నానం- వారి ప్రయాణ అలసట తొలగేందుకు స్నానం వగైరా ఏర్పాట్లు
7. వస్త్రం - స్నానానంతరం ధరించేందుకు మడి లేక పొడి బట్టలు ఇవ్వడం
8. యజ్ఞోపవీతం- మార్గమధ్యలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9. గంధం - శరీరానికి సుగంధం, చల్లదనానికి గంధాన్నివ్వడం
10. పుష్పం - సుగంధాన్ని ఆస్వాదించేలా అలంకరణకి
11. ధూపం - సుగంధ వాతావరణం కల్పించటానికి
12.. దీపం - వెలుతురు కోసం, చీకటిలో ఉండకూడదు కనుక అనుకూలతకై
13. నైవేద్యం - తన తాహతు రీత్యా, తనకి అనుకున్న దానిని ముందుగా ఆ దైవానికి సమర్పించటం 
14. తాంబూలం- ముఖ సుగంధార్ధంగా, భుక్త పదార్ధాలలోని లోపాలు తొలగింపుకు
15. నమస్కారం - మనం చేసిన మర్యాదలలో లోపాన్ని మన్నించ మని కోరడం
16. ప్రదక్షణం - ఆ దైవం యొక్క గొప్పతనాన్ని త్రికరణ శుద్ధిగా 
అంగీకరించటం. 

ఏది ఏమైనా సంవత్సరంలో ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో నాలుగవ రోజైన ఈ చవితికి అత్యంత మహిమగల చవితిగా పేరున్నందున వినాయకుని సంపూర్ణ విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆనాడు ఉపవాసం రాత్రి వరకూ ఉండి తర్పక్రియుడైన వినాయకునికి ఆయనకి ప్రియమైన వస్తువులతో పూజ చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా ఆ లంబోదరుడు మనల్ని దాటిస్తాడు.

సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి కాక సంవత్సరంలో నెలనెలా వచ్చే ఈ సంకష్ట చతుర్ధిని కూడా ఆప్యాయంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులైనా దూరం అవుతాయన్నది అతిశయోక్తి కాదు.
విద్య, ధనం, సంతానం, మోక్షం అన్నిటికీ కూడా ఆయన్ని పూజించి వేడుకుంటే నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ‘అయినవిల్లి’ (తూర్పుగోదావరి జిల్లా) అమలాపురం దగ్గర వినాయకుని దేవాలయాలలో ప్రత్యేకమైంది. 

చిత్తూరు జిల్లా ‘కాణిపాకం’ వరసిద్ధి వినాయకుని దేవాలయం తెలియనిది కాదు.
రాజధాని అయిన భాగ్యనగరంలో ‘లక్ష్మీ గణపతి దేవాలయం, విజయ గణపతి దేవాలయం’ ఎంతో అద్భుతమైనవి. 

ఎవరికి ఎలాంటి కష్టాలు వచ్చినా మనసా వాచా కర్మణ వినాయకుని నమ్మి ఈ సంకష్ట చతుర్ధి వ్రతాన్ని ఆచరిస్తే మేలు కలుగుతుందని జను ల విశ్వాసం. అన్ని గణపతి దేవాలయాలు ఈ చతుర్ధి నాడు సాయం కాలం చంద్రోదయ సమయానికి కిటకిటలాడిపోతాయి భక్తులతో. 

పూజలో తెలుసుకోవలసిన ముఖ్యాంశాలు
1. గణపతికి 21 ఉండ్రాళ్ళతో పూజ చేయాలి.
2. గరికతో పూజి చేస్తే ఆటంకాలు తొలుగును
3. నీటితో పూజ చేస్తే సంతోషం కలుగుతుంది
4. 21 ప్రదక్షణలు చెయ్యటం మంచిది.
5. పావుకిలో ఉలవలు దానం చేయాలి
6. బుధవారం ప్రీతికరమైన రోజు.
7. బుధవారం, హస్త, చవితి కలసి వచ్చిన రోజున 
వినాయకునికి అష్టోత్తరం చేయిస్తే అన్ని కార్యాలు శ్రీఘ్రంగా 
నెరవేరును.

సంకట నాశన గణేశ స్త్రోత్రమ్‌
నారద ఉవాచ:
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం 
భక్తావాసం స్మరే న్నిత్యమాయుః కామార్థ సిద్ధయే ‚
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్‌
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకమ్‌ 
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్‌ 
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్‌ 
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్‌ 
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యఃపఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో 
విద్యార్ధి లభతే విద్యాం ధనార్ధీ లభతే ధనమ్‌
పుత్రార్ధీ లభతే పుత్రాన్‌ మోక్షార్ధి లభతే గతిమ్‌ 
జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్‌
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః 
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్‌
తస్య విద్యా భవే త్సర్వా గణేశస్య ప్రసాదతః 
ఈ సంకటనాశ గణేశ స్తోత్రాన్ని 3 కనీసం పఠించటం చాలా మేలు. 

డా. ఈడుపుగంటి పద్మజారాణి