Wednesday 7 August 2013

ధర్మరాజునకి యక్షుడు వేసిన ప్రశ్న!

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
ధర్మరాజునకి యక్షుడు వేసిన ప్రశ్న!
ఏదైనా గొప్ప ఆశ్చర్యకర విషయం చెప్పు! అందరికి తెలిసుండాలి! కానీ ఆశ్చర్యపోవాలి!
ప్రపంచం అనే మూకుట్లో సూర్యుడు చంద్రుడు అనే సెగ పెట్టి కాలం వండుతుంది! ఆశ ఋతు అనే గరిటెతో తిప్పుతూ నిత్యం వండుతుంది! ఇందులో వండేది ఎవరిని అంటే భూతల ప్రాణికోటిని! అంటే మనం అంతా ఎక్కడ వున్నాం అంటే బానంలో ఉన్నాం! ఎందుకు ఎలా వేగుతున్నాం అంటే ఒక తేనెటీగ తేనెకోసం ఒక గిన్నె అంచున నిలబడి కొద్ది కొద్దిగా లోపలకి వస్తుంటే ఆ తేనే తన ఆకర్షణతో లోపలి లాగి మింగినట్టు ప్రాణికోటి అంతా మోహం మొహం అనే తేనే కోసం ఆరాటపడుతూ వేగిపోతున్నారు! ఇందులో బాగా వేగిన అంటే సర్వం మాయ అని తెలుసుకున్నవాడిని ఆ గరిటె తీసి బయట పడేస్తుంది! అంటే ఇంకా చావు పుట్టుకలు లేకుండా మోక్షపదం చేరుస్తుంది! ఎవరైతే జ్ఞానమనే సంపదతో మాయ అనే ప్రపంచం నుండి బయట పడతారో వారినే కాలం అనే గరిటె బయట పడేస్తుంది! ఇది నిత్యం, ఇది సత్యం, ప్రతిరోజూ ఇదే కొత్త విషయం.. ఇంతకుమించి కొత్త విషయం ఇంకొకటి లేదు! ఉండదు ... అందరికి తెలిసిన విషయం, తెలియని విషయం, అర్ధంకాని విషయం!ఆశ్చర్యకర విషయం!