Tuesday, 14 May 2013

శంకర జయంతి : 15 మే 2013 

శంకర భగ్వద్పాదులు జీవిత చరిత్ర చూస్తే ఆయన మానవపుతృుడే, కానీ అలాంటి మానవుడు, ధీశాలి మరొకరు 

ఈ చరిత్రలొనెఆ మళ్లీ పుట్టలేదు అని తెలుస్తుంది ! ఆయన ఒక అవతార పురుషుడు, సాక్షాత్తూ శివస్వరూపం

 !!!!!!! 
శ్రీ శంకరులు కేరళలో కాలడి అనే గ్రామము లో నంబుద్రి బ్రాహ్మణ కుటుంబము లో శివగురువు,ఆర్యంబ


 దంపతులకు జన్మించారు. చిన్నతనం లోనే ఆయన తండ్రి మరణించగా, తల్లి ఆ బాలుడు కి ఇదో ఏట 

ఉపనయనం చేయించింది . ఆ తరువాత శంకరులు గొకర్ణ క్షేత్రానికి వెళ్ళి, మూడు సంవత్సరాలు సాంగోపాంగంగా 

వేదాలు నేర్చుకున్నారు. ఆయన ఏక సంధ గ్రాహి. ఆ చిన్న వయసులోనే అందరు ఆ బాల శంకరుల ప్రతిభ 

చూసి, ఆయనని భగవంతుని అవతరమని భావించేవారు. 

ఒక నాడు ఆయన ఒక ఇంటికి భిక్షకు వెళ్ళగా, ఆ ఇంటి పేద బ్రాహ్మణి ఇంట్లో ఏమీ లేక ,ఒక ఏండీ పోయిన ఉసిరి

 తీస్కుని వచ్చి,బాధతో సిగ్గుపడుతూ ఆ ఉసిరిని భిక్ష గా వేసింది. ఆమె దారిద్ర్యం, ధర్మబద్ధతతో హృదయం కరిగి

 , శ్రీ శంకరులు ఆశువుగా "కనకధారస్తవము" అనే మహోత్తరమైన స్తోత్రాని కల్పించి ఆ అమ్మవారిని స్తుతించారు. 

వెంటనే ఆ పేద బ్రాహ్మణి ఇంట, బంగారు ఉసిరికలు వర్షం కురిసింది! అదే శంకరులు చేసిన మొట్టమొదటి 

స్తోత్రం..కనకధార స్తోత్రం !


ఎనిమదొ ఏట నే వేదాలలో పాండిత్యాన్ని సంపాదించి, పన్నిండవ ఏటికి సర్వ శాస్త్రాలను మధించి,పదహారో ఏటికి


 భాష్యాన్ని రాసి, ముప్పైరెన్డవ ఎటికి శరీరాన్ని విడిచిపెట్టేసారు
.

ఆశేతు హిమాచలం భారతదేశము అంత మత సంక్షోభములో ఉండగా అవతరించిన శివ స్వరూపము శంకరులు!


ఆయన ఒక వ్యక్తి కాదు ! ఒక వ్యవస్థ . అద్వైత తత్వాన్ని ప్రభోదించి ఈ దేశపుతేల్లలు దాటి అవతలకి పోయేట్టు


 నాస్తిక వాదులను తరిమి కొట్టారు..

ఈ ఆధునిక వాహనాలు, రోడ్లు ఏమీ లేని రోజుల్లో కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా పర్యటించి ఈ జాతి జీవన


 విధానాని మార్చిన మహనీయులు..మనపై కరుణ తో ఆ శివుడు స్వయముగా దిగివచ్చిన అవతారం...శంకర 

భగవద్పాదులు!

ఇలాంటి పవిత్రమైన రోజున మనము అందరమూ ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఆయన మనకి అందించిన 


అపూరూపమైన ఆస్తులు... శబ్ద సౌందర్యముతో కూడిన స్తోత్రాలు... పఠిస్తూ...హర హర శంకర జయ శంకర !


భజ గోవిందం భజ గోవిందం


గోవిందం భజ మూఢమతే |


సంప్రాప్తే సన్నిహితే కాలే


నహి నహి రక్షతి డుక్రింకరణే |