Friday 14 October 2011

'ప్రతి విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి ' అని నిరాసపడుతుంటాము. భయపడుతుంటాం. అసలు 'సమస్య' అంటే ఏంటో చూద్దాం .


సృష్టిలో సమస్యలనేవి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కేవలం పరిస్థితులు మాత్రమే ఉంటాయి. మన దృక్పధాన్ని బట్టి కొన్ని సమస్యలుగా కనిపిస్తాయి. మనం వేటినైతే సమస్యలని భావిస్తామో అవి మనల్ని ఉన్నతస్థితికి చేర్చడానికి దేవుడిచ్చే అవకాశాలు మనలో మానసిక పరిణతి, సమభావన పెరగడానికి ఉపయోగపడేవే సమస్యలు. వాటిని అధిగామిస్తేనే కదా ముందుకు వెళ్ళేది. పై చదువులకు వెళ్ళే కొద్దీ నీ పరీక్షలు కష్టంగానే కదా ఉంటాయి. ప్రతిదానికీ నీరుగారి పొతే దాని చెడు ప్రభావం రెట్టింపుగా ఉంటుంది. అయ్యో! నాకే సమస్య వచ్చిందే అని కిందికి చూస్తూ కూర్చుంటే పై నుండి వచ్చే ఆశీస్సులు మనకు కనిపించవు. బాధపెట్టేది ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. చిత్రకారుడు బొమ్మ గీసేతప్పుడు మొదట పిచ్చిగీతలుగా కనిపించవచ్చు కాని బొమ్మ గీయడం పూర్తయ్యాకే కదా ఆ పిచ్చి గీతలతోనే ఎంత అందమైన బొమ్మ తయారైందో తెలిసేది. 'అయ్యో నొప్పి' అని పదిసార్లు అనుకుంటే నొప్పి పెరుగుతుంది.


ఎంత క్లిష్టమైన సమస్యలున్నా జీవితంలో పాజిటివ్ విషయాలు చాలా ఉంటాయి. ఎక్కువగా వాటినే చూడండి. ఏది లేదో చూడకుండా, ఏది ఉందో దాన్నే దాన్నే చూడడం అలవరుచుకోండి. దైవత్వంతో ఉన్నవాడు నరకానికి వెళ్ళినా అక్కడ స్వర్గాన్ని సృష్టిస్తాడు. అన్ కాన్షస్ గా ఉన్నవాడు స్వర్గంలో ఉన్నా దుఖంతోనే ఉంటాడు. ఉత్సాహంగా ధ్యానం చేస్తూ ఉన్నా మీలో ఉన్నా నెగటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చుట్టూ ఉన్నా సమస్యలన్నీ క్షణభంగురాలే కదా! సమస్య ఉన్నప్పుడు అదే శాశ్వతం అనుకోవడం వల్లే దుఖం వస్తుంది. 'ఎ క్షణం శాశ్వతంగా ఉండిపోడు. ప్రతిక్షణం మారుతూ ఉంటుంది' అన్నా విషయం అనుభవ పూర్వకంగా తెలిసిన క్షణం దుఖం ఉండదు. సముద్రంలో అలజడి ఎప్పటికీ ఆగాడు. అందులో మన పడవను ఎంత చాకచక్యంగా నడిపామన్నదే ముఖ్యం మనోబలం పెంచుకుంటే చుట్టూ ఉన్నా సమస్యలెవీ సమస్యలుగా కనిపించవు. పైగా జీవితంలో కొత్తదనాన్ని , ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రతి సమస్య , నీ సమభావనకు ఒక పరీక్ష . ప్రతి క్షణాన్ని హృదయ పూర్వకంగా స్వీకరించాలి. దేవుడిపట్ల కృతజ్ఞతా భావంతో ఉండు. అప్పుడు జీవితం ఆనందమయంగా ఉంటుంది.