Friday, 28 October 2011

నాలుగు రకాల రుద్ర పారాయణలు ఉన్నాయట.
రుద్రం
ఏకాదశ రుద్రం
మహా రుద్రం
అతి రుద్రం
కృష్ణయజుర్వేదం లో 4.5 వ అధ్యాయం నమకం, 4.7 వ అధ్యాయం చమకం, ఈ రెంటినీ కలిపి శ్రీ రుద్రప్రశ్న,శతరుద్రీయం, లేక రుద్రధ్యాయం అని కూడా అంటారు.
ఒకసారి నమక,చమకాలను పారాయణ చేయటాన్ని రుద్ర పారాయణ అంటారు.
ఏకాదశ రుద్రం అంటే 11 సార్లు నమకం, ఒక్కో నమకం తో చమకంలోని ఒక్కో అనువాకం చదవటాన్ని ఏకాదశ రుద్రం అంటారు. అంటే పదకుండు సార్లు నమకం, ఒక సారి చమకం మొత్తంమ్మీద.
ఇక మహారుద్రం - 121 ఎకాదశ రుద్రాలను మహా రుద్రం అంటారు. అంతే 11 * 121 = 1331 సార్లు రుద్ర నమకం, 121 సార్లు చకమం చదివినట్టన్నమాట.
ఇక అతి రుద్రం అంటే 11 మహా రుద్రాలను అతి రుద్రం అంటారన్నమాట. అనగా 14641 సార్లు నమకం, 1331 సార్లు చమకం చెయ్యటమన్నమాట.