Saturday 9 August 2014

భక్తి సాధన

భక్తి సాధన
భక్తి సాధనకు జాతులు, వర్ణములు, రూపము, కులము, క్రియ భేదములు ఆటంకములు కాజాలవు.

1. నాస్తి తేషు జాతివిద్యారూపకులధనక్రియాది భేద: -- నారద భక్తి సూత్రములు - 72
భక్తుల మధ్య జాతి విద్యా రూప కుల ధన క్రియాది భేదములుండవు

2. అనింద్యయోన్యధిక్రియత్ సామన్యవత్ - శాండిల్య భక్తి సూత్రములు -78
అహింసాది సామాన్య ధర్మముల వలెనే - భక్తిమార్గమును అనుసరించుటకు గూడా చండాలురు మొదలగు
పాపయోనులందరికిని అధికారము గలదని శాస్త్రములు చెప్పుచున్నవి.
3. భక్త్యాహమేకయా గ్రాహ్య: శ్రద్ధయా~~త్మా ప్రియ: సతామ్
భక్తి: పునాతి మన్నిష్టా శ్వపాకానపి సంభవాత్ - శ్రీ మద్భాగవతము 11/14/21
ఓ ఉద్ధవ! సత్పురుషులకు ఆత్మస్వరూపుడను, పరమ ప్రియుడను ఐన నేను కేవలము భక్తి శ్రద్ధలద్వారానే వశమగుదును.
నా యెడల గల భక్తి జన్మత: చండాలురైనవారిని గూడా పవిత్రులును జేయును.