Thursday, 7 August 2014

పూజలో కూర్చొనడానికి ముందు

విభాత మిత్ర


 || కౌశేయం కంబలం చైవ అజినం పట్టమేవచ |
దారుజం తాడ పత్రం వా ఆసనం పరికల్పయేత్ ||


దర్భాసనం , పట్టు వస్త్రం , కంబళి , జింక చర్మం , చెట్టు బెరడు , చెక్కపీట , తాటిఆకులు , వీటిలో దేనిపైన అయినా కూర్చోవచ్చు. 
దారుజం తాడ పత్రం వా ఆసనం పరికల్పయేత్ ||
దర్భాసనం , పట్టు వస్త్రం , కంబళి , జింక చర్మం , చెట్టు బెరడు , చెక్కపీట , తాటిఆకులు , వీటిలో దేనిపైన అయినా కూర్చోవచ్చు. 

ఇక పూజలో కూర్చొనడానికి ముందు , " పృథ్వీ త్వయా ధృతా లోకా.... " అనే మంత్రాన్ని చెప్పాలి. ఆ మంత్రానికి ఋషి , మేరుపృష్టుడు. ఛందస్సు--సుతలం.. దేవత--ఆదికూర్మము. ఆ భూమి , అనంతుని చేత , వరాహుడి చేత , కూర్మము చేత మోయబడింది. కాబట్టి అనంతాసనాయ నమః , వరాహాసనాయ నమః కూర్మాసనాయ నమః అని చెప్పి , ’ లోకమును ధరించావు , ఆ విష్ణువే నిన్ను ధరించాడు , నన్ను కూడా నువ్వు ధరించి నా ఆసనాన్ని పవిత్రం చెయ్యి " అని ప్రార్థన చేస్తాము.