Tuesday 26 August 2014

కాంతి వేగాన్ని ఎవరు ముందు కనిపెట్టినట్లు?

కాంతి వేగాన్ని ఎవరు ముందు కనిపెట్టినట్లు?
క్రీ.శ.1675 లో రోమర్ అనే అతను కాంతి వేగాన్ని లెక్కించాడని అంటుంది ప్రాశ్ఛ్యాత్య ప్రపంచం. ఇందులో నిజం లేదు. ఎందుకంటే? అంత కంటే ఇంచు మించు నాలుగు వందల సంవత్సరాల క్రితమే శ్రీ సాయణాచార్యులు 1284 వ సంవత్సరంలో ఋగ్వేద భాష్యంలోఒక ఋగ్వేద శ్లోకానికి భాష్యంగా కాంతి వేగాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం వ్రాశారు.
అది పరిశీలించండి.
శ్లో: యోజనానాం సహస్త్రం ద్వే ద్వేశతేద్వె చ యోజనే| ఏకేన నిమిషార్థేన క్రమమాణ్ నమో స్తుతే||
...
అనగా అరనిమిషానికి 2202 యోజనాల దూరం ప్రయాణించు ఓ కాంతి కిరణమా నీకు నమస్కారము అని ఆ శ్లోకానికి అర్థం. ఇక్కడ యోజనము అంటే 9.11 మైళ్ళకు సమానం. భారతీయ కాల గమన ప్రకారం...... 1 పగలు రాత్రి + 810,000 అర్థ నిమిషాలు. కనుక ప్రతి అరనిమిషమునకు 2202 x 9.11 = 20060 మైళ్ళు అట్లే .... 20062 8.75 = 188064 మైళ్ళు ప్రతి సెకనుకు. ఇది అధునికులు కనుగొన్న కాంతి వేగానికి దాదాపు సమీపముగానే వున్నది. 20 వ శతాబ్దపు శాస్త్రవేత్త లయిన మెకీల్ సన్స్, మోర్లే కాం వేగం 1,86,300 మైళ్ళు ఒక సెకనుకు అని కనుగొని వున్నారు. ఇది ప్రస్తుతానికి ప్రమాణము.
శ్రీ సాయణాచార్యులు చెప్పిన విషయం 1890 వ సంవత్సరంలో మాక్సుముల్లర్ సంకలణం చేసిన ఋగ్వేదం అను ఆంగ్ల గ్రంథంలో కూడ ప్రస్తావించడం జరిగింది. కనుక కాంతి వేగాన్ని ఎవరు ముందు కనిపెట్టినట్లు? మన భారతీయ ఋషులు శ్రీ సాయాణాచార్యుల వారు.