భక్తి సమాచారం
'వసంతపంచమి'
విద్య ... విజ్ఞానం ... వివేకం వల్లనే ఏ రంగంలోనైనా రాణించడం జరుగుతుంటుంది. ఈ మూడూ మనిషికి తేజస్సును ... యశస్సును తీసుకు వస్తాయి. విద్యార్ధినీ విద్యార్ధులకు ఇవి సహజ అలంకారాలుగా మారాలంటే, అందుకు సరస్వతీ దేవి అనుగ్రహం వుండాలి. ఆ అనుగ్రహమే దక్కాలంటే ఆమెను భక్తి శ్రద్ధలతో పూజించాలి. భక్తులకు ఆ అవకాశాన్ని కలిగించేదే 'శ్రీ పంచమి'.
చైత్ర మాసంలో ఆరంభమయ్యే వసంతరుతువు ... మాఘమాసంలోనే అందుకు కావలసిన రూపురేఖలను సంతరించుకుంటుంది. ఆ విషయాన్ని సూచిస్తూ 'వసంతపంచమి' జరుపుకోవడం జరుగుతుంది. సరస్వతీ దేవి జయంతి ఈ రోజే కావడం వలన దీనిని 'శ్రీ పంచమి' అని అంటారు. ఈ రోజున ఆమెను ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. సరస్వతీ దేవి అభివృద్ధికి ఆధారమైన విద్యను ప్రసాదిస్తుంది. పాలనుంచి నీటిని హంస వేరుచేస్తుందని అంటారు. అలా అజ్ఞానం నుంచి జ్ఞానం వేరు చేయబడుతుందనడానికి సూచనగా ఆమె హంసను వాహనంగా చేసుకుని కనిపిస్తుంది.
అందువలన ఆమె ఆవిర్భవించిన ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించాలి. పూజామందిరాన్ని శుభ్రపరిచి సరస్వతి అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి ఇష్టమైన పాలు ... పెరుగు ... వెన్న ... పాయసం నైవేద్యంగా సమర్పించాలి. జ్ఞానాన్ని ప్రసాదించమని మనస్పూర్తిగా వేడుకోవాలి. ఇక ఈ రోజున వివిధ ప్రాంతాల్లోని సరస్వతీ ఆలయాలను భక్తులు విశేష సంఖ్యలో దర్శిస్తుంటారు. అమ్మవారికి తెలుపురంగు అంటే ఇష్టం కనుక ఆమెకి తెల్లని పువ్వులు ... అంచుతో కూడిన తెల్లని వస్త్రాలు సమర్పిస్తుంటారు.
తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించడం కోసం తల్లిదండ్రులు ఈ రోజు కోసమే ఎదురు చూస్తుంటారు. ఈ కారణంగా ప్రతి సరస్వతి ఆలయంలోను ఈ రోజున అక్షరాభ్యాసాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఇక విద్యార్ధినీ విద్యార్ధులు తమ పుస్తకాలను ... పెన్నులను అమ్మవారి పాదాలచెంత వుంచి పూజ చేయిస్తారు. ఈ రోజున అమ్మవారి కంకణాలను ధరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తుంటారు. ఇక ఈ రోజున వసంతుడితో పాటు రతీ మన్మథులను కూడా పూజిస్తూ వుంటారు గనుక, దీనిని 'మదనపంచమి' అని కూడా వ్యవహరిస్తుంటారు.