విభూతి స్నానం .......
స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే
దానిని విభూతి స్నానం అంటారు. ఎందుకనో? నీళ్ళకీ విభూదికీ ఉన్న అవినాభావ
సంబంధం ఏమిటో?
విభూది ఒక రకం బూడిదే అని మనందరికీ తెలుసు. కాని
నీళ్ళూ కూడ మరొక రకం బూడిదే అని మనలో ఎంతమందికి తెలుసు? ఉదజని వాయువు ని
ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం
అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను.
బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న
వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు
పెట్టేరా? లేక, ఇది కేవలం కాకతాళీయమా?
వివిధ హోమభస్మాలు చేసే మేలు:
శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.
శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.
శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.
శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.
శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి.
శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి
హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం
సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.
శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.
హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.
గమనిక: హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.