Thursday, 18 July 2013

ఆషాఢమాసము ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైనది.

హైందవ సంస్కృతి మాస పత్రిక
ఆషాఢమాసము ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైనది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తోలి ఏకాదశి అని అంటారు. దీనినే "శయన ఏకాదశి " అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజున శేషశాయి అయిన నారాయణుడు శయనించి మరల కార్తిక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు అందుకు దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తోలి ఏకాదశిని ఒక పండుగగా జరుపుకుంటారు. ఇది అయిన వెంటనే పండగలు మొదలవుతాయి. అన్నమాట ఉదాహరణకు మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు మెదలయినవి. ఈ తోలి ఏకాదశి రోజున విష్ణు మూర్తిని అర్చించి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి, ఉపవాసము చేసి, మరు రోజున అంటే ద్వాదశి నాడు పారణ చేయాలి. అంటే విష్ణు నివేదిత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.

ఈ మాసములో వచ్చే పున్నమిని గురుపూర్ణిమ అంటారు. యతులు అయినవారు ఈ రోజున చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తారు. విష్ణు మూర్తి శయనించిన ఈ నాలుగు నెలలను చాతుర్మాస్య దీక్ష ప్రారంభము అవుతుంది. ఒకే చోట స్తిరంగా ఈ నాలుగు మాసాలు ఉండాలి. సన్యాసి ఈ నాలుగు మాసాలు తప్పకుండా ఈ దీక్ష పాటించాలి .నాలుగు మాసాలు కుదరనపుడు రెండు మాసాలైనా ఒకే చోట నివసించాలి.

చాతుర్మాసం ద్విమాసం వా
సదైకత్రైవ సంవసెత్ \\

అని ధర్మ శాస్త్రం చెపుతోంది. పూర్తీ అహింసా వ్రతావలంబకులైన ఆ యతులు యధావిధిగా అర్చనాదులు చేస్తారు. వర్షా కాలంలో అనేక కొత్త జీవాలు, అంకురాలు భూమి పై ఏర్పడతాయి. తమ నడకవల్ల వాటికి భాద కలుగ కూడదని యతుల సంకల్పము. అందుకే ఈ నాలుగు నెలలు ఒకే చోట నుండి పూజలు చేస్తారు
హైందవ సంస్కృతి మాస పత్రిక'సౌజన్యంతో....