Tuesday, 15 November 2011


పెరటి చెట్లు ......వాటిలో ఔషధవిలువలు

తులసి
తులసి ఆకులు, బీజాలు, వేర్లను మందుగా వాడుకోవచ్చు తులసితో స్వరసం (జ్యూస్), చూర్ణం, కషాయాలు తయారుచేస్తారు మనకు సాధారణంగా కృష్ణతులసి, శ్వేతతులసి రకాలు లభిస్తాయి ఆకలి పుట్టడానికి, ఆహారం జీర్ణం కావడానికి, విరేచనం సాఫీగా అవటానికి ఉపయోగపడుతుంది దగ్గుని పోగొడుతుంది క్రిమిహరం, దుర్గంధనాశకం కఫాన్ని హరిస్తుంది మూత్రం సాఫీగా అవుతుంది ఎలర్జీలను, చర్మరోగాలను తగ్గిస్తుంది జ్వరాలను తగ్గిస్తుంది, నివారిస్తుంది.

మారేడు

మారేడుకు ‘శ్రీఫలం’ అనే పేరు కూడా ఉంది. దీని వేరు, బెరడు, ఆకులను మందుగా వాడతారు దీని ఆకుల స్వరసం సేవిస్తే ఆకలి పుట్టి, జీర్ణక్రియ బాగుపడుతుంది ఎక్కడైనా దెబ్బలు తగిలి రక్తస్రావం జరుగుతుంటే వెంటనే దాన్ని అరికడుతుంది దీనివేరు, బెరడులను కషాయంలా కాచుకుని వాడుకోవచ్చు శరీరం మీద ఎక్కడైనా వాచినట్టు ఉంటే వాటిని పోగొట్టే లక్షణం మారేడులో ఉంది జ్వరాలను తగ్గిస్తుంది అలసిపోయినప్పుడు ఈ ఫలాన్ని సేవిస్తే తక్షణమే శక్తి వస్తుంది జిగట విరేచనాల (డిసెంట్రీ) ను తగ్గిస్తుంది బాగా పండిన పండుతో లేహ్యం, పానకం (షర్బత్) తయారుచేస్తారు.

ఉసిరిక (ఆమలకీ)

షడ్రసాలలోనూ లవణరసం (ఉప్పు) మినహా మిగిలిన ఐదురసాలూ (మధుర, అమ్ల, తిక్త, కటు, కషాయ) ఉసిరికలో ఉంటాయి చ్యవనప్రాశ లేహ్యంలో ఇది ప్రధాన ద్రవ్యం ఇది ముసలితనాన్ని (వార్థక్యాన్ని) దూరం చేసి, శరీర సౌష్ఠవాన్ని పదిలపరుస్తుంది. జీవనకాలాన్ని పెంచుతుంది వయసుతో సంబంధం లేకుండా ప్రతివారు రోజుకి ఒక ఉసిరికాయను జీవితాంతం తింటే పైప్రయోజనాలను స్వంతం చేసుకున్నట్లే ఆకలిని పెంచుతుంది. దప్పికను పోగొడుతుంది. రక్తాన్ని పెంచుతుంది కామలాహరం (జాండిస్‌ను తగ్గిస్తుంది) ధీశక్తిని, మానసికశక్తిని పెంచుతుంది కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది మూలవ్యాధిని పోగొడుతుంది రక్తపిత్తం (రక్తం కారటం, హెమరేజ్) అనే వికారాన్ని తగ్గిస్తుంది కడుపులోని అల్సర్లు, వాయువు, వాంతి, మూర్ఛ, ఎక్కిళ్లు, గొంతుబొంగురుపోవడం - ఈ సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది జ్వరహరం. ప్రమేహరోగాల్ని పోగొడుతుంది కామశక్తిని, శుక్రవృద్ధిని పెంచుతుంది దీన్ని గుజ్జుతో తింటే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది పిక్కతీసిన ఉసిరికాయ ముక్కల్ని ఎండబెట్టి, పొడిచేసి (ఆమలకీ చూర్ణం) కూడా వాడుకోవచ్చు. కార్తీక మాసంలో ఉసిరికాయల పంట మొదలవుతుంది. పక్వమైన ఆమలకీ ఫలాల్లో మాత్రమే ఔషధవిలువలు ఉంటాయి. (హైబ్రీడురకం అంత మంచిది కాదు).

మామిడి (ఆమ్ర)

పిందె... కషాయరసం (వగరు), కాయ... ఆమ్లరసం (పులుపు), పండు... మధురరసం (తీపి) దీని బెరడు, ఆకులు, పువ్వులను... కషాయంలా కాచి తాగితే కఫం తగ్గుతుంది. గొంతులో మంటను పోగొడుతుంది. విరేచనాలు తగ్గుతాయి చక్కగా పక్వమైన పండు హృద్యం, వృష్యం(శుక్రవర్థకం). చర్మకాంతికరం, బల్యం, వాతహరం మృదువిరేచనం మామిడి ఒరుగులు (ఎండబెట్టి తయారుచేస్తారు) మలబంధాన్ని పోగొడతాయి మామిడితాండ్ర (ఆమ్రావర్తం) రుచిని కలిగిస్తుంది. దప్పికను (తృష్ణ), వాంతులను తగ్గిస్తుంది. పుష్టికరం జీడి (ఆమ్రబీజం) ని ఎండబెట్టి పొడిచేసి సేవిస్తే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట (అమ్లపిత్తము) తగ్గుతాయి. స్త్రీలలో తెల్లబట్ట (శ్వేతప్రదర) వికారం పోతుంది ఆమ్రపల్లవం (లేతమామిడిచిగురు) కషాయం సేవిస్తే స్వరభంగం, వమనం, అతిసారం తగ్గుతాయి ఆమ్రపత్రాల (పెద్ద లేక లేత ఆకులు) కు సూక్ష్మాంగక్రిములను ఆకర్షించి, నశింపచేసే గుణం ఉంది. పూర్తిగా పక్వం కాని పండు వల్ల అజీర్ణం, మలబంధం వంటి వికారాలు కలుగుతాయి.