Tuesday, 22 November 2011

వృక్షో రక్షతి రక్షితః .


                     వృక్షో రక్షతి రక్షితః .

పద్మమహాపురానం ఇరువైఎడవ అధ్యాయములో  అగస్త్య మహా ముని  అంపశయ్యపైనున్న భీష్మునితో వృక్ష స్తాపనవిధి గురించి తెలిపినారు.నేటి కాలం లో  పెరుగుతున్న కాలుష్య నివారణకు, వాస్తు దోష నివారణకు,

జాతకం లోని  గ్రహ దోష నివారణకు  వృక్ష స్థాపన అద్భుతమైనది.

రుద్రం లో కుడా  నమో వ్రుక్షేభ్యో ..వ్రుక్షపతిభ్యస్చ ఓనమో నమో అని స్తుతి వున్నది.

లలిత సహస్రనామాలలో కదంబ ,,దాడిమీ అనగా దానిమ్మ ,ఇత్యాది వృక్షాల ప్రస్తావన వున్నది అంటే  వృక్షాల ప్రాశస్త్యం  ఎంత గొప్పది.  శనీశ్వర సహస్రనామాలలో  శమిపత్రప్రియాయైనమః అని శమి  వృక్ష ప్రస్తావన వుండి. వనదుర్గ వుపాసన  ప్రాశస్త్యం గురించి  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుకదా!

దశపుత్ర సమం వృక్షం అని ఆర్యోక్తి . విషయం పూర్తి నిడివి టైపు చేయలేక వ్రాయలేకపోతున్నాను.అయతే ఒక చిన్న మనవి.....---ఎక్కడైనా  పెద్ద పెద్ద దేవాలయములలో  దేవతావ్రుక్షాలైన  మారేడు,,రావి,,మామిడి,,జమ్మి,,తులసి,,శ్వేతార్క,,కదంబ,,ఇత్యాది వృక్షాలను నాటండి.



ఏదైనా ఒక మంచిపని చేసినా చెడ్డపని చేసినా అందు చత్వారి సమభాగినః..నలుగురికి నాలుగు భాగాలు వుంటై.మొక్క నాటిన వారికీ ,,నాటమని చెప్పినవారికి,, సహాయం చేసినవారికి ,, ఆమోదించి మొక్క ని పెంచినవారికి అందరూ ఒక మంచి వృక్షస్తాపన యగ్జ్నం చేసినట్లు.తదుపరి పొస్ట్ లో మరిన్ని విషయాలు తెలిపి ప్రయత్నం చేస్తాను.