Tuesday, 22 November 2011

గురువు చెప్పినది చేయండి.గురువుగారు చేసినది చేయకండి.


కలౌ పంచవర్ష సహస్రాణి  అపన్డితా సు పూజితః ...సు పండితా న పూజితః  జాయతే వర్ణ సంకరహ..

పై వాక్యం చిన్నపుడు ఎవరో పెద్దవారు చెపుతుంటే విన్నాను.ఈ వాళ రోజులలో  మని మైండ్స్ అయ్యి మహామంత్రాలు , బీజాక్షర ప్రయోగాలూ పుస్తక పరిగ్జానం తో అందరూ చేస్తున్నారు. కాని ఇది ఏ మాత్రం సరి అయినది కాదు.పండితులు చెప్పే సత్య ప్రవచనాలు చేదుగా వున్నా ఆరోగ్యకరమైనవి.

అపన్డితులు చెప్పే ప్రవచనాలు తియ్యాగావున్న అనారోగ్యం కలిగిస్తాయి

నిన్న ఒకరు ఖడ్గమాల చేస్తున్నాము అని ఫోన్ చేసారు ...శ్రీ విద్యోపాసన లో వున్నతమైన దేవతల వుపాసనకి ముందు వెనుక చాలా మెట్లు వున్నై. ఇష్టం వచ్చినట్లు అన్ని మంత్రాలు చేయగుఉడదు.. ఈ మంత్రం చేస్తున్న వారిని నేను ఎవరు చేయమన్నారని అడిగాను  . ఒక గురువుగారు తిట్టి    మరి చేయవద్దు అన్నారుట.

కానీ ఎవరో  మొబైల్ సర్వీసెస్ పురోహితులు  చేయమన్నరుట.



నేను చేయవద్దు అనే చెప్పాను.

.మంత్ర భాగం లో పురానోక్తం , వేదోక్తం అని రెండు రకములు వున్నై.

వేదోక్త  పూజలన్ని యగ్జ్నోపవితం అధికారం కల్గి నిత్య సంధ్యావందనం చేయు బ్రామ్హన, వైశ్యులకు మిగిలినవారికి పురానోక్త విధాన పూజలు.

అయినా కలౌ ద్విజేతర ధన్యః అని వ్యాసుల వారు చెప్పినట్లుగా  ద్విజులకు కృతయుగ ధర్మాలు. మిగిలినవారికి తేలికైన ధర్మాలు.కాబట్టి బ్రాహ్మణులే చేయాలా మనం చేయకూడదా  అనే వితండం వద్దు.స్తోత్రములు ,,నామ జపం కలియుగం లో గొప్పవి. నామజప సుప్రితాయైనామః అని లలితా సహస్రనామములలో  వున్నది.శరీరంలోని డేభైరెండు వేల నాడులను నవరందాల గుండా   మంత్ర శక్తి ద్వారా వుద్దిపనం చెందించి చైతన్య పరిచి నామజపం ద్వారా తరించవచ్చు.

ఒక్కొక్క అక్షరం పలకటం ద్వారా శరీరంలోని ఒక్కొక్కనాడి కదులుతుంది ,తద్వారా శరీరం జాగ్రుతమవుతుంది.కాబట్టి మన తెలుగు లిపి లోని అక్షరాలని అక్షరమాత్రుకలు అన్నారు.  చిన్న విత్తనం లో ఒక పెద్ద  మర్రి చెట్టు దాగి వున్నట్లుగా  ఒక బీజాక్షరం లో అనత శక్తి దాగివుంది. శక్తి ని  భరించే వుపాధి వుండాలి.అది కేవలం ఒక్క గురువు ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది.కాబట్టి గురువు చెప్పినది మాత్రమే చేయండి. సొంత తెలివితేటలు వద్దు. ఒకసారి శంకరభగవత్పాదులు బాగా దాహం వేసి కల్లుతాగారుట,,,,అది చూసి శిష్యులు  మహదానందంగా కల్లు తాగుతున్నరుట.వెంటనే శంకరభగవత్పాదులు గ్రహించి  నాయనలారా నాకు ఇంకా దాహం తీరలేదు  అంటూ దగ్గరలో ని ఒక కొలిమిలోని మరుగుతున్న సీసం తాగారుట . వెంటనే శిష్యులు  భగవత్పాదుల కాలామిదపడి  క్షమాపణ అడిగి తమ అజ్ఞానానికి సిగ్గుపద్దరుత. కాబట్టి గురువు చెప్పినది చేయండి.గురువుగారు చేసినది చేయకండి.