Monday, 15 August 2011

వధూవరుల జాతకంలో పరిశీలించవలసిన విషయాలు

 

కుజదోష విచారణ:-

పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్టమేకుజే
స్ధితః కుజః పతింహంతి నచేచ్చు భయుతేక్షితః
ఇందోరప్యుక్త గేహేషు స్ధితఃఅ భౌమోధవాశనిః
పతిహంత్రౌస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః
(బృహతృరాశరీరాశాస్త్రం)
జన్మలగ్నము- చంద్రలగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నఎడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం యిరువురికీ వున్ననూ లేదా యిరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని ఎడల వైవాహిక జీవితం కలహప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయకారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం. "నచేచ్చభయుతేక్షితః" అని ఉన కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహవీక్షణ వునచో దోఆషం వుండదు. కేవలం ఆడవరై జాతకంలో దోషం వుంటే మగవారికి యిబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవరైకి యిబ్బంది.

ద్వితీయ భౌమరోషస్తు యుగ్న కన్యక యోర్వినా| ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా| చతుర్ధే భౌమదోషస్తు మేష వృశ్చికయోర్వినా| సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా| అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా| కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే|
ద్వితీయ స్ధితి కుజదోషం మిధున కన్యకలకు లేదు. ద్వాదశ స్ధితి కుజదోషం వృషభ తులలకు లేకు. చతుర్ధస్ధితి కుజదోషం మేషవృశ్చికములకు లేకు. సప్తమస్ధితి కుజదోషం మకర కర్కాటకములకు లేదు. అష్టమ స్ధితి కుజదోషం ధనస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయనలో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నముల విషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.

ఊర్ధ్వ, అధో, తిర్యజ్మఖ నక్షత్రములు

అశ్వని, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, అనూరాధ, , జ్యేష్ఠ, రేవతి యివి తిర్యజ్ముఖ నక్షత్రములు. భరణి, కృత్త్యిక, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, మూల, పూర్వాషాఢ, పూర్వాభద్ర యివి అధీముఖములు. రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర యివి ఊర్థ్వముఖ నక్షత్రములు.

క్షీణ చంద్ర వివరణ

చంద్రుడు, శుక్ల అష్టమి లగాయతు కృష్ణ అష్టమి వరకు పూర్ణ బలవంతుడు. యిది సామాన్య నియమము. యిందలి విశేష పాఠమేమనగా కృష్ణ పక్షంలొ పాడ్యమి నుండి పంచమి వరకు మిక్కిలి పూర్ణుడు. తదాది అయిదు రోజుల మధ్యమం చివరి అయిదు రోజులు అనగా కృష్ణ పక్ష ఏకాదశి నుండి అమావాస్య వరకు చంద్రుడు క్షీణ చంద్రుడు. దీనికి వ్యతిరేకంగా కృష్ణ పక్షం ఊహించవలెను. అనగా శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు క్షీణ చంద్రుడు షష్ఠి ప్రభృతి దశమి వరకు మధ్యం తదుపరి పూర్ణిమ వరకు పూర్ణ చంద్రునిగా పరిగణించాలి. అయితే కృష్ణ పక్షంలోని చివరి అయిదు రోజులు శుభకార్య విషయంగా ప్రాంతీయ ఆచారములను పరిధిలోనికి తీసుకొని నిషేధించుచున్నాము.

గండనక్షత్ర విషయం :

ఆశ్రేషా, మూల, విశాఖ, జ్యేష్ఠ నక్షత్రములలో జన్మించిన స్త్రీ విషయంలో వివాహం పొంతనలు చూసేటప్పుడు గండనక్షత్రములుగా పరిగణీంచవచ్చును. అయితే అందులో ఆశ్రేష 4వపాదం మూల 1 పాదము, విశాఖ నాల్గవపాదం, జ్యేష్ఠ 4వ పాదం మాత్రమే దోషం గండరరక్ష జనన దోషాన్ని పరిశీలించిన మీదట ఆశ్రేషా, జ్యేష్ఠ నక్షత్రములు చివరి నాలుగు ఘడియలు మాత్రమే దోషమని మూల 1వ పాదంలో ప్రారంభంలో ప్రారంభ నాలుగు ఘడియల కాలమే దోషం అని తోచుచున్నది.

గణకూటమి :

వివాహ విశేషః పట్టికలో చుపిన ప్రకారం వధూవర నక్షత్రం పరస్పర దేవరాక్షస గన్ములైన అధము. మనుష్య రాక్షస గణముల విషయంలో గ్రహమైత్రి కుదిరిన స్వీకరించవచ్చును దేవ - దేవ; దేవ - మనుష్య; మనుష్య - మనుష్య; రాక్షస - రాక్షస విశేషములు.

గ్రహ మైత్రి :

నక్షత్ర విశేషములు అనే పట్టికలో నక్షత్రములు పొందిన రాశ్యాధిపుల వివరణ ఇవ్వబడినవి. వాటిని దృష్టిలో వుంచుకొని క్రింద పట్టికద్వారా ఆయా గ్రహముల శతృమిత్రత్వాలు పరిశీలించారు.

రవి:శని, శుక్రులు శత్రువులు. బుధుడు సముడు. చంద్ర, కుజ గురువులు మిత్రులు.
చంద్ర :రవి, బుధ మిత్రులు, మిగిలిన వారు సములు.
కుజ :రవి, చంద్ర, గురువుల మిత్రులు. బుధుడు శత్రువు, శుక్ర, శని సములు.
బుధ : రవి శుక్రులు మిత్రులు, చంద్రుడు శత్రువు, కుజ, గురు, శనులు సమములు
గురు : బుధ, శుక్రులు మిత్రులు, చంద్రుడు శత్రువు.కుజ గురు, శనులు సములు
గురు : బుధ, శుక్రులు శతృవులు, శని సముడు , రవి, చంద్ర, కుజులు మిత్రులు.
శుక్ర : బుధ, శనులు మిత్రులు. కుజ గురులు సములు; రవి, చంద్రులు శత్రువులు
శని : బుధ, శుక్రులు మిత్రులు; గురువు సముడు; రవి, చంద్ర, కుజులు సములు.

వధూవర రాశ్యాధిపులు పరస్పర శతృవులైనచో విడువదగినది.

స్త్రీ దీర్ఘము :

వధూనక్షత్రం నుండి వరుని నక్షత్రం లెక్కింపగా 9 నక్షత్రముల లోపు వున్నయెడల అధమము. 9 తర్వాత 18 లోపు వున్న మధ్యమము. 18 తర్వాత 27 లోపు వున్న యెడల ఉత్తమము.

గ్రహముల స్వభావములు

శని, రాహు, కేతు, కుజులు క్రూర స్వభావ గ్రహములు. శుక్ర, గురు, బుధ, చంద్రులు సౌమ్య స్వభావ గ్రహములు. అయితే " బుధః పాపాయుతః పాపః క్షీణచంద్రస్తధైవచ" అనగా పాపగ్రహములతో కలసిన బుధుడు పాపగ్రహముగాను, క్షీణ చంద్రుని పాపగ్రహముగాను చెప్పబడినది. కుజ, రవి, గురువులు పురుష స్వభావ గ్రహములు రాహు, చంద్ర, శుక్రులు స్త్రీ స్వభావం కలిగిన గ్రహాలు. శని, బుధ, కేతువులు నపుంసక స్వభావగ్రహములు, గురు, శుక్రులు, బ్రాహ్మణ గ్రహములు; రవి, కుజులు క్షాత్ర గ్రహములు. చంద్ర, బుదులు వైశ్యులు, శని శూద్ర కులాధిపతి.

తారాబలఫలమ్

సంపత తార సంపదలను, విపత్ తార కార్య నాశనమును క్షేమతారా క్షేమమును, ప్రత్యక్ తార కార్య నాశనమును సాధన తార కార్య సాధనమును నైధవ తార హీనత్వమును మిత్రతారా సుఖమును, పరమమైత్ర తార సుఖసంపదలను కలుగచేస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ప్రథమ నవకములో ప్రత్యక్ తారను విడచి మూడు నవకములలో నైథవ తారను విడచి మిగిలిన నక్షత్రములలో ముహూర్తము చేయవచ్చును.
ఒకవేళ కర్కాటక రాశికి వృషభరాశికి చెందు నక్షత్రములు తారాబల విష్యములో విపత్, ప్రత్యక్ తారలు అయినప్పటికీ శుభకార్యములు చేయవచ్చును. జన్మ నక్షత్రములో నక్షత్రము ప్రారంభమునుండి ఏడు ఘడియలు విపత్తార యందు ప్రారంభ 3 ఘడియలు ప్రత్యక్ నైథవ తారల యందు ప్రారంభ 8 ఘడియలు విడువవలెను. మిగిలిన ఘడియలు గ్రాహ్యము.

తారాబలము

జన్మ నక్షత్రము నుండిన లెక్కింపగా వరుసగా ఇరవై ఏడు నక్షత్రములకు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధవ, మిత్ర, పరమైత్ర అనబడే తొమ్మిది సంజ్ఞలు ఉంటాయి. యివే సంజ్ఞలు మరలా 10వ నక్షత్రమునుండి 18 వరకు మరలా 19 నక్షత్రం నుండి 27 వ నక్షత్రము వరకు ఉంటాయి.

త్రిజ్యేష్ఠ స్వరూపం :

" అధ్యగర్భప్రసూతాయాః కన్యకాయా పరస్యచ; జ్యేష్ఠమాసే నకుర్విత కదాచిదపి మంగళమ్" ప్రధమ గర్భంలో జన్మించిన వధూవరుల విషయంలో జ్యేష్ఠమాసంలో వివాహం చేస్తే త్రిజ్యేష్ఠ అవుతుంది. అలాగే ఆ వధూవరులు ఒకరు జ్యేష్ఠమాసంలో జన్మించిన మరొకరు జ్యేష్ఠులైతే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయ కూడదు. మిగిలిన మాసంలో చేయుటకు అభ్యంతరంలేదు. ఎటువంటి త్రిజ్యేష్ఠా స్వరూపం అయినా జ్యేష్ఠమసంలో మాత్రమే వివాహం నిషేధం మిగిలిన మాసంలో దోషంలేదు.

నక్షత్ర భేధములు

అశ్వని, హస్త, పుష్యమి నక్షత్రములు క్షీప్ర ( శీఘ్ర) సంజ్ఞ నక్షత్రములు, మూల, ఆర్ద్ర, జ్యేష్ఠ, ఆశ్రేష నక్షత్రములు దారుణ నక్షత్రములు. చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ నక్షత్రములు మృదు (సౌమ్య) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభద్రలు స్థిర (ధృవ) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభద్రలు ఉగరనక్షత్రములు. కృత్తిక, విశాఖ సాధారణ నక్Sధత్రములు. స్వాతి, పునర్వసు, శ్రవణం ధనిష్ఠ, శతభిషం నక్షత్రములు చర నక్షత్రములు

నక్షత్ర విచారణ :

జన్మ నక్షత్రములు తీసుకొన్నతర్వాత వాటి ద్వారా గ్రహమైత్రి, గణకూటమి, యోనికూటమి, రాశికూటమి, స్త్రీ దీర్గము, నాడికూటమి ముఖ్యంగా పరిశీలించాలి. యివి ఆరు కూటములు మహేంద్రకూటమి, వశ్యకూటమి, దినకూటమి, వేదాకూటమి, రజ్జుకూటమి, వర్నకూటమి యివి ఆరు కూటములు సామాస్యకూటములు. సామాన్యకూటములు ఈ పన్నెండు కూటములు కలిపి ద్వాదశ వర్గులు అంటారు. అందు ముఖ్య ఆరు వర్గులను సూక్ష్మంగా పరిశీలించగా

నాడీకూటమి :

వధూవర నక్షత్రములు యిరువురివీ ఒకే నాడీ నక్షత్రములు కాకూడదు. వేరువేరు నాడులైన విశేషము. నాడీ వివరములు పట్టికలో వున్నవి. పట్టికలో ఇచ్చినవి త్రినాడీ స్వరూపము.

యోని కూటమి :

పట్టికలో చూపిన నక్షత్ర జంతువులకు పరస్పర శతృత్వం వున్నటువంటివి
గో -వ్యాగ్రములు;
అశ్వ - మహిషములు;
గజ -సింహములు ;
కుక్క -లేడి;
పాము-ముంగీస;
కపి -ఎనుములు;
మార్జాల - మూషికములు
పరస్పర శతృత్వ జంతువులు కావున అవికాక మిగిలిన నక్షత్రములు స్వీకరించాలి.

రాశికూటమి :

అమ్మాయి రాశి లగాయతు అబ్బాయి రాశి రెండు, మూడు, నాలుగు, అయిదోది. ఆరు రాశులు కాకపోయినా శుభము. గ్రహమైత్రి కుదిరినప్పుడు రాశికూటమి, నాడీకూటమి, స్త్రీ దీర్ఘములు కుదరకపోయిననూ దోషం వుండదు.