రవి సంబంధిత యోగాలు
జ్యోతిష్యంలో సూర్యుని రవి అంటారు అలా సూర్యునికి సంబంధించిన యోగాలు ఇక్కడ సూచించ బడ్డాయి.
1. బుధాదిత్య యోగం : రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగం అంటారు.
గ్రహ ఉచ్చం యోగం
1.ఋశక యోగం కుజుడు ఉచ్చం అంటే మకర రాశి, లేక రాజ్యం అంటే మేషరాశి మరియు వృశ్చికరాశి లలో ఉండి అవి కేంద్రం అనబడే 1,4,7,10 స్థానాలైతే ఋశక యోగం అంటారు.
జ్యోతిష్యంలో సూర్యుని రవి అంటారు అలా సూర్యునికి సంబంధించిన యోగాలు ఇక్కడ సూచించ బడ్డాయి.
1. బుధాదిత్య యోగం : రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగం అంటారు.
- ఫలితం:- సామర్ధ్యం సూక్ష్మగ్రాహి, విచక్షణతో కూడిన కార్యాలు, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం.
- ఫలితం:- ప్రశాంత జీవితం, కీర్తి, మర్యాద మరియు అదృష్టం వరించుట.
- ఫలితం:- కీర్తి, సంపద, పలుకుబడి, వాక్పఠిమ మరియు స్వయంకృషితో అభివృద్ధి.
- ఫలితం:- సంతోషం, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి మరియు ప్రయత్నంతో ముందుకు రావడం.
చంద్రుడు సంబంధిత యోగాలు
5. చంద్రమంగళ యోగం : చంద్రుడు మరియు కుజుడు ఒకే స్థానంలో ఉన్నా నేక చంద్రునికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాలలోఉంటే చంద్రమంగళ యోగం అంటారు.- ఫలితం:- రసాయన మరియు ఔషధ వ్యాపారంలో విజయం. మనో చంచలం రావడానికి అవకాశం.
- ఫలితం:- అకస్మాత్తుగా ధనాగమనం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ యోగ జాతకులకు ధనం కొరత ఉండదని శాస్త్రం చెప్తుంది.
- ఫలితం:- కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధనాగమనం, సంపద మరియు దీర్ఘాయువు.
- ఫలితం:- ఆరోగ్యమైన శరీరం.
- ఫలితం:- స్వప్రయత్నంతో సంపాదన.
- ఈ యోగం పీడ మరియు కీడు కలిగిస్తుంది. అయినా కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలలో ఏదైనా గ్రహం ఉంటే నివృత్తి ఉంటుంది.
- ఫలితం:- కారు,బంగళా లాటి వసతులు కలిగిన జీవితం.
- చంద్రునికి , 6,8, 12వ స్థానంలో గురువు ఉంటే శకట యోగం అంటారు.
- రాశి చక్రములోని గ్రహములన్ని లగ్నము మరియు సప్తమ స్థానమల మాత్రమే ఉన్న శకట యోగము అంటారు.
- గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానములలో ఉన్న శకట యోగము సంభవిస్తుంది.
- ఫలితం:- నిలకడ లేని జీవితం, అవమానము, ఆఋధికబాధలు, శారీరక కష్టము, మానసిక బాధలు కలిగించును. ధనవంతుల ఇంత పుట్టినా ఈ యోగప్రభావమున పేదరికము అనుభవించ వలసి ఉంటుంది. అర్హతకు తగిన గౌరవము ఉండదు. మరిఏ ఇతర బాధలు ఉండవు.
- ఈ యోగముకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్నా గౌరవ మర్యాదలాకు భంగము వాటిల్లదు.
- యోగభంగము : చంద్రుడు బలము కలిగి ఉన్న ఈ యోగము భమ్గము ఔతుంది. చంద్రుడి మీద కుజుడి దృష్టి ఉన్న ఎడల ఈ యోగము భంగము ఔతుంది. లగ్నాదిపతి మరియు భాగ్యాధిపతి బలముగా ఉన్న ఈ యోగము హంగము ఔతుంది. గురువు చంద్రిడి కంటే బలముగా ఉన్న ఈ యోగము భంగము ఔతుంది.
- లగ్నములో చంద్రుడు లేక గురువు ఉన్నా, శుక్రుడ్రు చంద్రుడితో కలసి ఉన్నా, ఈ శకత యొగము ధనప్రాప్తి కలిగించును. చంద్రుడు ఇదే యోగము చంద్రుడు మిధున, కన్యా, తులా, వృశ్చికములలో ఉన్న కలుగును. అలాగే కటకములో శుక్రుడు బుధుడితో కలసి ఉన్నా ఈ యోగము కలుగును.
- ఫలితం:- ఆదాయాన్ని మించిన ఖర్చులు, దారిద్యం నుండి విమోచనం దొరకడం కష్టం. స్వల్ప సంతానం, అమిత ధైర్యం, కూడబెట్టిన ధనం పరుల స్వంతం.
రాజయోగం
1. విపరీత రాజయోగం 6వ స్థానాధిపతి 8, 12 స్థానాలలో ఉన్నా, 8వ స్థానాధిపతి 6వ, 12వ స్థానాలలో ఉన్నా, 12వ స్థానాధిపతి 6వ, 8వ స్థానాలలో ఉన్నా విపరీత రాజయోగం అంటారు. గ్రహాలు మిత్ర, ఉచ్చ, రాజ్య స్థానాలలో ఉంటే చక్కని ఫలితం.- ఫలితం:- ఆయా స్థానాలలో ఉన్న అధిపతి దశాకాలంలో శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. పైన చెప్పిన పద్దతిలో ఉంటే విపరీతమైన ధనాగమనం సంభవం.
- ధర్మకర్మాధిపతి యోగం;-తొమ్మిది పది అధిపతులు కలసి ఏ రాశిలోఉన్నా ఒకరిపై ఒకరు దృష్టి సారించినా పరిమార్పు చెందినా ధర్మకర్మాధిపతి యోగం అంటారు.ఈ యోగం ఉంటే ధన కనక వస్తువాహనాలు జాతకునకు లభిస్తాయని శాస్త్రవివరణ.
- అందగిరి యోగం;-మేషం ,కటకం,వృషభం,మకరం రాశులలో మిగిలిన గ్రహాలు ఉభయ రాశులలో ఉంటే అందగిరి యోగం అంటారు.ఈ యోగం ఉన్న జాతకుడు
గ్రహ ఉచ్చం యోగం
1.ఋశక యోగం కుజుడు ఉచ్చం అంటే మకర రాశి, లేక రాజ్యం అంటే మేషరాశి మరియు వృశ్చికరాశి లలో ఉండి అవి కేంద్రం అనబడే 1,4,7,10 స్థానాలైతే ఋశక యోగం అంటారు.
- ఫలితం:- హోం మరియు రక్షణ మంత్రి పదవిలాంటి ఉన్నత పదవి. శతృజయం, దేహబలం, గర్వం, మొండి వైఖరి, అకస్మాత్తు అదృష్టం, యోగ కారణంగా లభ్యమైన ధనం తానే విపరీతంగా ఖర్చుచేయుట.
- ఫలితం:- దీర్గాయువు, మేధావి, వాక్పఠిమ, సూక్ష్మగ్రాహి, ఐశ్వర్యం, ప్రజాకర్షణ రాజ్యపాలన.
- ఫలితం:- సాదువులను గౌరవించడం, నీతిమంతుడు, అందమైన శరీరం, శుభ్రమైన ఆహారం అంటే ప్రీతి, అకస్మాత్తుగా అదృష్టం కలిగి ధనవంతుడు కావడం, భూ ఆధిపత్యం.
- ఫలితం:- దృఢ శరీరం, ధైర్యం, స్త్రీ జనాకర్షణ, అదృష్ట జాతకం, విస్తార ధనం ఉత్తమ కళా నైపుణ్యం.
- ఫలితం:- లోక జనాకర్షణ, అకస్మాత్తుగా అదృష్టం, ప్రపంచం నలుమూలలా ఆస్థులు, దేశాధిపత్యం.
నాభాస యోగాలు
నాభాసయోగాలు ముప్పై రెండు. అవి వరుసగా నౌకా, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామపాళ, వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్ధేందు, యవ, కేదార, గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల, గోళములు. జాతక చ్రములు అన్ని ఈ యోగాలలో ఎదోఒక యోగంలో ఇమిడి ఉంటుంది. నాభాస యోగములు సంఖ్యా యోగము, దళ యోగము, ఆకృతి యోగములని మూడు విధములు.- నౌకా యోగం :- లగ్నము నుండి సప్తమ స్తానము వరకు ఏడు రాశుల అందు గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న నౌకా యోగం అంటారు.
- ఫలితం :- నౌకా యోగమున జన్మించిన జాతకుడు జల ఆధారిత సంపద కలిగి ఉంటాడు. లాభాధిఖ్యత కలిగి లోభ గుణం కలిగి ఉంటాడు.
- ఛత్ర యోగం :- చతుర్ధ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న ఛత్ర యోగం అంటారు.
- ఫలితం :- ఛత్ర యోగమున జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండు వాడు, బుద్ధిమంతుడు, దాత, రాజుకు కావలసిన వాడు, బాల్యమున వార్ధఖ్యమున సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వైర్యం కలిగి ఉంటాడు.
- కూట యోగం :- సప్తమ కేంద్రము మొదలు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న కూట యోగం అంటారు.
- ఫలితం :- కూట యోగమున జన్మించిన వాడు చెరసాల కాపలా చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్యం మొదలైనవి కలిగి దుర్గములందు నివసించు వ్డుగా ఉంటాడు.
- కార్ముఖ యోగం :- దశమ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న కార్ముఖ యోగం యోగం అంటారు.
- ఫలితం :- కార్ముక యోగమున జన్మించిన వాడు రహస్యంగా చరించు వాడు, అసత్యం చెప్పు వాడు, దొంగ, జూదరి, అరణ్య సంచారం, మద్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు.
- యూప యోగం :- లగ్నము నుండి నాలుగవ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న యూప యోగం అంటారు.
- ఫలితం :- ఆత్మ రక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవ్వంతుడు, వ్రతయమము, సాము అందు ఆసక్తుడు ఔతాడు.
- శర యోగం :- చతుర్ధ కేంద్రము మొదలు నాలుగు రాశులలో వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నశర యోగం అంటారు.
- ఫలితం :- ఆయుధములను చేయుట, దొంగలను బంధించుట, వేటాడుట, ఉన్మత్తత, క్రూరత్వము, కుశ్చితత్వము, శిల్పములందు ఆసక్తి కల వాడు ఔతాడు.
- శక్తి యోగం :- సప్తమ స్థానం నుండి గ్రహములన్నీ నాలుగు స్థానముల ఉపస్థితమై ఉన్న శక్తి యోగం అంటారు.
- ఫలితం :- వికలత్వము, ధన హీనత, వికలత్వము, అలసత్వము, అల్పాయుష్షు, సౌందర్యము, యుద్ధ నైపుణ్యము కల వాడు ఔతాడు.
- దండ యోగం :- దశమ స్థాన్మం నుండి నాలుగు రాశులందు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న దండ యోగం అంటారు.
- ఫలితం :- దండ యోగమున జన్మించిన వాడు హత ధారా పుత్రులు, సర్వ జన ద్వేషం, బంధు విరోధము, దుఃఖము, సేవకము, నీచ గుణము కల వాడు ఔతాడు.
- అర్ధ చంద్ర యోగం :- రెండవ లేక మూడవ స్థానం నుండి గ్రహములన్ని ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
- ఫలితం :- సేనాధిపతి, రాజాభిమానానికి పాత్రుడు, సౌందర్యవంతుడు, మణులు సువర్ణములు ఆభరణములు పొందు వాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు.
- గదా యోగం :- గ్రహములన్నీ సమీపముగా ఉన్న రెండు కేంద్రముల ఉపస్థితమై ఉన్న గదా యోగం అంటారు. అనగా లగ్న, చతుర్ధ స్థానము లేక, చతుర్ధ, సప్యమ స్థానం, సప్తమ, దశమ స్థానం, దశమ, లగ్న స్థానం అందు ఉన్న గదా యోగం అంటారు.
- ఫలితం :- గదా యోగమున జన్మించిన వాడు శాస్త్ర పారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞము చేయు వాడు, అభిమానవంతుడు, ధన కనక వస్తు రజ్ఞములు కల వాడు ఔతాడు.
- వజ్ర యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు శుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు అశుభ గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
- ఫలితం :- శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోదము కలవాడు, భాగ్యహాని కలుగుట, బాల్యమున వార్ధక్యమున సుఖము కల వాడు ఔతాడు.
- యవ యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు ఆశుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు శుభ గ్రహములు ఉన్న యవ యోగం అంటారు.
- ఫలితం :- యవ యోగమున జన్మించిన వాడు వ్రత నియమ శుభ కార్యముల అందు ఆసక్తుడు, యౌవనమున సుఖవంతుడు, ధనవంతుడు, దాత్రుత్వం, స్థిరమైన ధనం కలవాడుగా ఉంటాడు.
- పద్మక యోగం :- నాలుగు కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్న పద్మక యోగం అంటారు. అనగా లగ్న సప్తమాలలో ఒక దానిలో శుభ గ్రములు ఒక దానిలో అశుభ గ్రహములు అశుభులు ఉండ వలసిన చతుర్ధ, దశమ స్థానాలలో ఒక దానిలో అశుభ గ్రహములు మరొక దానిలో శుభ గ్రహములు ఉన్న పద్మక యోగం అంటారు. కాని వజ్ర, యూప, పద్మక యోగములు యోగములు అసంభములని వరాహ మిహిరుని అభిప్రాయం.
- ఫలితం :- పద్మ యోగమున జన్మించిన వాడు సౌందర్యము, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము, చిరాయువు కల వాడు.
- వాపీ యోగం :- లగ్ననముకు రెండు లేక మూడు స్థానములలో ఒక దానిలో శుభగ్రహములు మరొక దానిలో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్న వాపీ యోగం అంటారు.
- ఫలితం :- వాపీ యోగమున జన్మించిన వాడు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదుల అందు సమర్ధుడుగా ఉంటాడు.
- శకట యోగం :- గ్రహములన్నీ లగ్న సప్తమమున ఉపస్థిమైన శకట యోగం అంటారు.
- ఫలితం :- శకట యోగమున జన్మించిన వాడు రోగ పీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య కలిగిన వాడు, దరిద్రుడు, బంధు మిత్ర జన హీనుడు, బండి మీద జీవనం సాగిస్తాడు.
- విహగ యోగం :- గ్రహములన్నీచతుర్ధ దశములందు ఉపస్థిమై ఉన్న విహగ యోగం అంటారు.
- ఫలితం :- విహగ యోగమున జన్మించిన వాడు తిరుగట అందు ఆసక్తుడు, దౌత్యము, కలహ ప్రియత్వము, నీచజీవనము, పొగరు, నీచ స్వభావం కల వాడు ఔతాడు.
- వాల యోగం ;- గ్రహములన్నీ లగ్న త్రికోణం వదిలి మిగిలిన త్రికోణములందు ఉపస్థితమై ఉన్న వాల యోగం అంటారు. అంటే రెండవ, ఆరవ, దశమ స్థానాలు లేక మూడవ, ఏడవ, ఏకాదశ స్థానాలు, నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానముల ఉపస్థితమై ఉండుట.
- ఫలితం :-
- శృంగాటక యోగం :- గ్రహములన్ని త్రికోణముల అందు ఉన్నఅంటే లగ్నము, పంచమ స్థానము, నవమ స్థానముల ఉన్న శృంగాటక యోగము అంటారు.
- ఫలితం :- శృంగాటక యోగమున జన్మించిన వాడు కలహములందు ఆసక్తుడు, యుద్ధమున తెగింపు కలవాడు, సంపన్నుడు, స్త్రీలచే ద్వేషింప బడు వాడు, సుఖవంతుడు, సౌందర్యవంతుడు, రాజాభిమాన పాత్రుడు ఔతాడు.
- చక్ర యోగం : - గ్రహములన్నీ బేసి రాశులైన ఆరు రాశులలో ఉప స్థితమై ఉన్న చక్రయోగం అంటారు. అంటే లగ్నం, మూడు, అయిదు, ఏడు, తొమ్మొది, పదకొండు స్థానాలలో ఉపస్థితమై ఉన్న చక్రయోగం అంటారు.
- సముద్ర యోగం :- గ్రహములన్నీ రెండవ స్థానం నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్న సమ రాశులలో ఉపస్థితమై ఉన్న అంటే రెండవ, నాల్గ్వవ, ఆరవ, ఏనిమిదవ, పదవ, పన్నెండ స్థానాలలో ఉపస్థితమై ఉన్న సముద్ర యోగం అంటారు.
- ఫలితం :- సముద్రము అందు పుట్టిన రత్నములు, మణులు వివిధ పధార్ధములు కలవాడు, యోగవంతుడు, జనులను ఆకర్షించు వాడు, భూములకు అధిపతి ఔతాడు.
- సల యోగం :- గ్రహములన్నీ ఉభయ చర రాశులందు ఉపస్థితమై ఉన్నసల యోగం అంటారు.
- ఫలితం :- సల యోగమున జన్మించిన వాడు తిండి పోతు, దరిద్రుడు, వ్యవసాయము చేత జీవించు వాడు, భయం, భీత స్వభావం కలవాడు, దుఃఖి, బంధు మిత్ర రహితుడు ఔతాడు.
- ముసల యోగం :- గ్రహములన్నీ స్థిర చర రాశులందు ఉన్న మసల యోగం అంటారు.
- ఫలితం :-
- రజ్జు యోగం :- గ్రహములన్నీ చర రాశులందు ఉన్న రజ్జు యోగం అంటారు.
- ఫలితం :-
- దళాఖ్య మాలా యోగం :- మూడు కేంద్రముల చంద్రుడు కాక మిగిలిన శుభగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య మాలా యోగం అంటారు.
- ఫలితం :-
- దళాఖ్య సర్పయోగం :- మూడు కేంద్రములందు చంద్రుడు కాక మిగిలిన పాపగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య సర్ప యోగం అంటారు.
- ఫలితం :-
- గోళ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఒక్క స్థానములోఉపస్థితమై ఉన్న గోళ యోగం అంటారు.
- ఫలితం :-
- యుగ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ రెండు స్థానములలో ఉపస్థితమై ఉన్న యుగ యోగం అంటారు.
- ఫలితం :-
- శూల యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ మూడు స్థానములలో ఉపస్థితమై ఉన్న శూలయోగం అంటారు.
- ఫలితం :-
- కేదార యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ నాలుగు స్థానాలలోఉపస్థితమై ఉన్న కేదార యోగం అంటారు.
- ఫలితం :-
- పాశ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ అయిదు ఉపస్థితమై ఉన్న పాశ యోగం అంటారు.
- ఫలితం :-
- దామినీ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఆరు స్థానముల ఉపస్థితమై ఉన్న దామినీ యోగం అంటారు.
- ఫలితం :-
- వీణా యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఏడు స్థానముల ఉపస్థితమై ఉన్న వీణా యోగం అంటారు.
- ఫలితం :-