Thursday, 28 April 2011

ధర్మ సూక్ష్మాలు ౩వ. భాగము



సూర్యోదయమునకు  ఏ తిధి వుండునో ఆ  రోజు చేయు  స్నాన , దాన, జప, వ్రత  , పూజా కార్యక్రమములన్నిటికి సంకల్పములో ఆ తిధే చెప్పవలెను.



సంక్రమణ కాలమందు , శ్రాద్ధదినములందు , జన్మదినములందు,  అశ్ర్పుస్య స్పర్స లందు ,  వేడినీటి స్నానం  చేయరాదు.



భోజనము చేయు కంచము పట్టుకుని ,ఒళ్ళోపెట్టుకుని ,  కంచము పట్టుకుని తిరుగుతూ, మంచములమీద కూర్చుని భుజించరాదు.



నీటిని త్రాగునప్పుడు  చిన్న పాత్రలోనికి తీసుకుని కూర్చుని  మాత్రమే త్రాగవలెను.



జపము  పూజాది కార్యక్రమములలో నోటిలో ఏ పదార్దములునములుతూ క్రతువు చేయరాదు.అలా చేసినచో అది ఉచ్చిస్టము అగును.



అనుస్టానపరులు మంచినీరు  నోటిలో  ఎత్తి పోసుకుని తాగరాదు, పెదవులకి తగిలించుకొని (కరుచుకుని) తాగవలెను.