గృహా ప్రవేశం జరుగు రోజున ప్రాతః కాలములో అభ్యంగ స్నానం కావించి శుచిఅయిన వస్త్రాలు ధరించి తొలుత వినాయక ప్రార్ధన చేసుకుని అన్ని వస్తువులు ఏర్పాటు చేసుకోవలెను.
గృహా ప్రవేశం కు పగలు ,రాత్రి రెండు వేళలు మంచివి.అయినను అపార్ట్మెంట్లకు పగలైనా రాత్రయినా మంచిదే .
కాని స్వంతంగా నిర్మించు గృహములకు పగలు శంఖు స్తాపన , రాత్రి గృహ్జాప్రవేసము ప్రసస్తము.
గృహా ప్రవేశ రోజున ముందుగా గోవు ను గృహ`ఆవరణలో కి తిసుకురావలెను.గోమాతకు సంతుష్టిగా మేతమేపి గృహము చుట్టూ ముమ్మారు అనగా మూడుసార్లు ప్రదక్షిణలు గావిన్చావలెను.
మగవారు అనగా ఇంటి యజమాని దేవునిపటము,పూజా సామగ్రిని పట్టుకోవలెను.ఆయన ధర్మపత్ని నిప్పులతో కూడిన పాత్ర పట్టుకుని దంపతులు ఇద్దరు కలిసి (మగవారికి ఎడమపక్క ఆడవారువుండవలెను)మూడుసార్లు ప్రదక్షిణ చేయవలెను.
వారి వెనుక మిగిలినవారు వరుసగా ధాన్యపుబస్తా, అరటికాయల గెల,జోడు బిందెల నీరూ ,పాలు,పెరుగు,నవధాన్యాలు, రాళ్లఉప్పు,పాలమండ,,చల్లగుంజ, ఆవిరి కుడుములు,చల్లకవ్వం,ధాన్యం తీస్కుని , ప్రదక్షిణ చేసి నూతన గృహ సింహద్వారం వద్ద నిలబడవలెను.
ముహూర్తసమయానికి రెండు నిమిషాలముంద్ర మంచి గుమ్మడికాయ మీద కర్పూరం వుంచి వెలిగించి దర్వాజా కి హారతి ఇచ్చి ఒక్కసారిగా పగిలిపోయేట్ట్లుగా ఒక్కదెబ్బతో గట్టిగా దర్వాజా కు కొట్టవలెను.
తదుపరి కొబ్బరికాయ కొట్టి కుడికాలు ముందుగా లోపలి పెట్టి ప్రవేసించ్వలెను.ప్రతి గుమ్మం వద్ద ,కిటికీలు వద్ద కొబ్బరికాయ తప్పనిసరిగా కొత్తవలెను,.
ఆడపడుచులు ఆగ్నేయాన వంటగదిలో కొత్త ఇటుకరాళ్ళతో జంటపోయ్యి ఏర్పాటు చేసి పాలపొంగాలి పెట్టవలెను. ఆ పాలు పొంగే సమయాన గృహ యజమాని పాలుపొంగ్టం చూచి అగ్నిదేవునికి నమస్కారం చేసి ఆడపడుచులకి నూతన వస్త్రాలు బహుకరించవలెను.
పురోహితులవారు యజమానులచేత విఘ్నేశ్వరపూజ ,పుణ్యాహవచనం,నవగ్రహ మంట పారధన,వాస్తు కలశ ఆరాధన గావించి నైవేద్యం ఒనరించి....అఖండదీపారాధన ఈసాన్యములో చేఇంచవలెను వెంటనే కొబ్బరికాయ కొట్టవలెను..యజమానులకి వారి అత్తవారి చేత నూతన వస్త్రాలు యజమానులకి ఇప్పించవలెను.. తదనంతరం ఆ నూతనగ్రుహములొ అందరూ ఆనందంగా సంతుష్టిగా భోజనం తప్పనిసరిగా చేయవలేను.
నూతన గృహములో గ్రుహాప్రవేశం అయిన రోజున నిదురించకుండా భగవన్నామ స్మరణ చేయవలెను.
సింహద్వారంవద్ద బూడిదగుమ్మడికాయను కట్టవలెను.
తెల్లవారిన తర్వాతమరల దీపారధన చేసుకొని పాలుకాయవలెను.
గృహప్రవేశానికి కావలసిన పూజాద్రవ్యములు
పసుపు కొత్త ఇటుకలు
కుంకుమ పాలపొంగలి గిన్నె
తోమలపాకులు అత్తవారి బట్టలు
వక్కలు చల్లగుంజ
అరటిపండులు అఖండ దీపారాధనకు మూకుడు వత్తి నూనే
ఖర్జూరకాయలు దేవునిపటములు, దీపారధన కుందులు,వత్తులు
పసుపుకొమ్ములు కొబ్బరికాయలు
బియ్యము మంచి గుమ్మడి కాయ
పూలు బూడిద గుమ్మడి కాయ
అగరవత్తులు వుట్టెలు
కర్పూరం తుండ్లు
అగ్గిపెట్టె రవికగుడ్డలు
చిల్లర బొగ్గునిప్పు
మామిడిమండలు ఆవిరి కుడుములు
కలశపాత్ర పంచే కండువా
చలిమిడి ,వడపప్పు పానకం బెల్లము
గ్లాసులు రాగివి----------------------