84 లక్షల జీవరాసులలో మనవ జన్మ చాలా ఉత్కృష్టమైనది.ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన ఈ జన్మ లభించినది.దీన్ని సార్ధకం చేసుకోండి.
ఉదయంనిద్రలేవగానే కుడి అరచేతిని చూసి నమస్కారం చేసుకోండి.
ఏ మానవుడు కూడా జనసంచారం లేని పాడుపడ్డ ఇళ్ళలో, స్మశానానికి దగ్గరలో, నాలుగువీధుల నడుమ, చీకటి ప్రదేశంలో ,పాముపుట్టల దగ్గర , తల్లిదగ్గర,అక్క చెల్లల దగ్గర ,పరస్త్రీల దగ్గర నిద్రించకూడదు.
ఇద్దరు బ్రాహ్మణుల మధ్య ,బ్రాహ్మణునికి అగ్నికి మధ్య ,భార్య భర్తల మధ్య, గురుశిష్యుల మధ్య , నందిశంకరుల మధ్య, ఆవు దూడ ల మధ్య దాటుట వలన,నడవడం వలన పూర్వపుణ్యం నశించును.
సహపంక్తి భోజనం చేయుచుండగా మధ్యలో లేచి వెళ్ళినచో బ్రహ్మ హత్యాపాతకం సంభవించును.
భోజనం చేయుటకు ముందుగా, భోజనం అయిన తర్వాత పాదప్రక్షాళన చేయనిచో దరిద్రం సంభవించును.
దీపం లేకుండా రాత్రిపూట భుజిన్చరాదు.
సంధ్యాకాలంలో భోజనం, నిద్ర, చదువు ,దానము, భార్యా సంగమము ,ప్రయాణం చేయరాదు.ఒకవేళ చేసినచో దరిద్రం, వ్యాధి, మరణం సంభవిస్తాయి.