Tuesday, 26 April 2011

ధర్మ సూక్ష్మాలు 2వ. భాగము




భోజనమునకు  తూర్పు , పశ్చిమ , దక్షిణ  దిక్కులు  ఉత్తమమైనవి.భోజనము చేయునపుడు నేయి అభిఘారించకుండా భుజించరాదు.



భోజనమునకు  ముందు  ఉప్పు వడ్డిమ్చినచో కీర్తి ,తేజస్సు హరించును.


ప్రతి మానవుడు త్రిపుండములు(విభూతి) ధరించవలెను.దానివలన  భూత  ,ప్రేత,పిశాచ భాదలు వుండవు.


దేవాలయాలలో , పడవలలో ,  తీర్ధములలో, పెళ్ళిళ్ళలో , సభలలో , యగ్జ్న యాగాదులలో   ఇతరులును  తగిలినా దోషములేదు,.


భార్య గర్భవతి అయినపుడు  భర్త సముద్ర స్నానము , క్షవరము, పర్వతారోహణము , కుమారునికి ఉపనయనము , చావులుకు వెళ్ళుట, నూతులు తవ్వుట, చెట్లు కొట్టుట , ఇల్లు కట్టుట , కొబ్బరికాయ కొట్టుట  పనికిరాదు.