Friday, 29 April 2011
Thursday, 28 April 2011
ధర్మ సూక్ష్మాలు ౩వ. భాగము
సూర్యోదయమునకు ఏ తిధి వుండునో ఆ రోజు చేయు స్నాన , దాన, జప, వ్రత , పూజా కార్యక్రమములన్నిటికి సంకల్పములో ఆ తిధే చెప్పవలెను.
సంక్రమణ కాలమందు , శ్రాద్ధదినములందు , జన్మదినములందు, అశ్ర్పుస్య స్పర్స లందు , వేడినీటి స్నానం చేయరాదు.
భోజనము చేయు కంచము పట్టుకుని ,ఒళ్ళోపెట్టుకుని , కంచము పట్టుకుని తిరుగుతూ, మంచములమీద కూర్చుని భుజించరాదు.
నీటిని త్రాగునప్పుడు చిన్న పాత్రలోనికి తీసుకుని కూర్చుని మాత్రమే త్రాగవలెను.
జపము పూజాది కార్యక్రమములలో నోటిలో ఏ పదార్దములునములుతూ క్రతువు చేయరాదు.అలా చేసినచో అది ఉచ్చిస్టము అగును.
అనుస్టానపరులు మంచినీరు నోటిలో ఎత్తి పోసుకుని తాగరాదు, పెదవులకి తగిలించుకొని (కరుచుకుని) తాగవలెను.
Tuesday, 26 April 2011
ధర్మ సూక్ష్మాలు 2వ. భాగము
భోజనమునకు తూర్పు , పశ్చిమ , దక్షిణ దిక్కులు ఉత్తమమైనవి.భోజనము చేయునపుడు నేయి అభిఘారించకుండా భుజించరాదు.
భోజనమునకు ముందు ఉప్పు వడ్డిమ్చినచో కీర్తి ,తేజస్సు హరించును.
ప్రతి మానవుడు త్రిపుండములు(విభూతి) ధరించవలెను.దానివలన భూత ,ప్రేత,పిశాచ భాదలు వుండవు.
దేవాలయాలలో , పడవలలో , తీర్ధములలో, పెళ్ళిళ్ళలో , సభలలో , యగ్జ్న యాగాదులలో ఇతరులును తగిలినా దోషములేదు,.
భార్య గర్భవతి అయినపుడు భర్త సముద్ర స్నానము , క్షవరము, పర్వతారోహణము , కుమారునికి ఉపనయనము , చావులుకు వెళ్ళుట, నూతులు తవ్వుట, చెట్లు కొట్టుట , ఇల్లు కట్టుట , కొబ్బరికాయ కొట్టుట పనికిరాదు.
ధర్మ సూక్ష్మాలు మొదటి భాగము
84 లక్షల జీవరాసులలో మనవ జన్మ చాలా ఉత్కృష్టమైనది.ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన ఈ జన్మ లభించినది.దీన్ని సార్ధకం చేసుకోండి.
ఉదయంనిద్రలేవగానే కుడి అరచేతిని చూసి నమస్కారం చేసుకోండి.
ఏ మానవుడు కూడా జనసంచారం లేని పాడుపడ్డ ఇళ్ళలో, స్మశానానికి దగ్గరలో, నాలుగువీధుల నడుమ, చీకటి ప్రదేశంలో ,పాముపుట్టల దగ్గర , తల్లిదగ్గర,అక్క చెల్లల దగ్గర ,పరస్త్రీల దగ్గర నిద్రించకూడదు.
ఇద్దరు బ్రాహ్మణుల మధ్య ,బ్రాహ్మణునికి అగ్నికి మధ్య ,భార్య భర్తల మధ్య, గురుశిష్యుల మధ్య , నందిశంకరుల మధ్య, ఆవు దూడ ల మధ్య దాటుట వలన,నడవడం వలన పూర్వపుణ్యం నశించును.
సహపంక్తి భోజనం చేయుచుండగా మధ్యలో లేచి వెళ్ళినచో బ్రహ్మ హత్యాపాతకం సంభవించును.
భోజనం చేయుటకు ముందుగా, భోజనం అయిన తర్వాత పాదప్రక్షాళన చేయనిచో దరిద్రం సంభవించును.
దీపం లేకుండా రాత్రిపూట భుజిన్చరాదు.
సంధ్యాకాలంలో భోజనం, నిద్ర, చదువు ,దానము, భార్యా సంగమము ,ప్రయాణం చేయరాదు.ఒకవేళ చేసినచో దరిద్రం, వ్యాధి, మరణం సంభవిస్తాయి.