Thursday, 15 May 2014

: సర్వగ్రహాలు నీ అనుగ్రహరూపాలే


Bramhasri Samavedam Shanmukha Sarma



పరగెన్ నేత్రములర్క చంద్రులుగ, రెప్పల్ రాహు కేత్వాకృతుల్
వరఫాలమ్మున మంగళుండు, మది సద్భావంబు సౌమ్యుండు, శ్రీ
గురుడే చిన్మయముద్ర, విశ్వరచనా కోశమ్మె కావ్యుండునౌ
స్థిరమై కంఠము దేజరిల్లు గ్రహమూర్తీ! నీలకంఠేశ్వరా!
తాత్పర్యం: సర్వగ్రహాలు నీ అనుగ్రహరూపాలే. నీ నేత్రాలు సూర్యచంద్రులు. రెప్పలు రాహు కేతువులు. నీ నుదుట అంగారకుడు (తపోనిష్ఠలోనున్న రుద్రుని నుదుటి స్వేదబిందువు, భూమిపై పడి మంగళగ్రహమయిందని శివపురాణ కథ). `చంద్రమా మనసో జాత:' మనస్సుకి అధిపతి చంద్రుడు. మనోజనిత భావం సౌమ్యం. స్వామి భావం సౌమ్యమైన వాత్సల్యం. అది ఙ్ఞానమయభావన. కనుక బుధుడు. (సోమపుత్రుడు=బుధుడు (సౌమ్యుడు) నీ చిన్ముద్రే బృహస్పతి (గురువు). విశ్వాన్ని రచించే నైపుణ్యమే కావ్యుడు (కవి, కావ్య-శుక్రుని పేర్లు). కంఠంలోని స్థిరమైన నీలిమ స్థిరుని స్ఫురింపజేస్తోంది. (స్థిర: = శని)