పాణి గ్రహణం
పాణి గ్రహణం
పార్వతీపరమేశ్వరులు సనాతన దంపతులు, వారి దాంపత్యము తపస్సంపద యొక్క ఫలితం , లోకానికి తల్లిదండ్రులైన వారికి మన నమస్సులు.
వివాహం :
దీని సంస్కృతపదం: "వహ్" అనే ధాతువుకు "వి" అనే ఉపసర్గను "ఘిజ్ఞ్" అనే ప్రత్యయాన్ని చేరిస్తే :వి+ వహ్+షిజ్ఞ్" = వివాహం. అర్ధం: విశేషప్రాపణం అంటే విశేషమైన సమర్పణం .
ఇక పర్యాయపదాలు : పరియణం,ఉద్వాహం,కళ్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంధం, దారోపసంగ్రహణం, దార పరిగ్రహం, దారకర్మ,దారక్రియ యిత్యాదులు.
వివాహ పద్ధతులు : బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. ఇక వీటి అర్ధాలు తెలుసుకుందామా:
బ్రహ్మం : అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే బ్రాహ్మ వివాహం అవుతుంది ) శాంతాఋష్యశృంగులు)
దైవం: యజ్ఞంలో ఋత్విక్కుగా వున్నవారికి దక్షిణగా కన్యను యిచ్చి వివాహం చేయటం, యిది దైవ వివాహం.
ఆర్షం: వరుని నుండి గోవుల జంటను తీసుకుని కన్యను యివ్వటం, ఇది ఋషులలో ఎక్కువగా యుంటుంది, కనుక ఆర్షం అయింది.
ప్రాజాపత్యం: వధూవరులిద్దరు కలసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం. (సీతారాములు)
అసురం: వరుని వద్ద ధనం తీసుకొని కన్యకు యిస్తే అసుర వివాహం (కైకేయి దశరధులు)
గాంధర్వం: పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండ) చేసుకునేది గాంధర్వ వివాహం (శకుంతలా దుష్యంతులు)
రాక్షసం: యుద్ధం చేసి కన్యను అపహరించి చేసుకునే వివాహం: (మండోదరిరావణుడు)
పైశాచికం: కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకునే వివాహం.
పైన చెప్పిన వాటిలో అత్యంత శ్రేష్ఠం : బ్రహ్మం. ప్రజాపత్యం ధర్మబద్ధం .
నిషిద్ధాలు : రాక్షసం ,పైశాచికం.
ఈ నవనాగరికతలో పైన చెప్పినవన్నీ కాకపోయినా, కొన్నైనా సాధ్యపడుతున్నాయా? మనమంతట మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాము.
Vijaya Gopal Mallela