Thursday, 22 March 2012

ఉగాది


ఆరోగ్యం నయతీతి ‘నింబః’ - అనగా వేప
గుడతి రక్షతీతి ‘గుడం’ - అంటే బెల్లం
లునాతివాతం జాడ్యంవా ‘లవణం’ - అంటే ఉప్పు
సహస్రరోగాన్ విధ్యతే ఇతి ‘సహస్రవేధి’ - అంటే చింతపండు
జీర్యతే అన్నమనే నేతి ‘జీరకః’ - అంటే జీలకర్ర
... సహకారయతి మేళయతిస్ర్తి ‘సహకారః’ - అంటే మామిడి.
ఇలా... వేప ఆరోగ్యాన్ని, బెల్లం రక్షణను, ఉప్పు వాత, మాంద్యాల హరణను, చింతపండు పలు రోగ నాశకంగానూ, జీలకర్ర అజీర్ణం పోగొట్టేదిగానూ, ఇక మామిడి స్త్రీ పురుషుల కలయికకు ఉపయోగపడేదిగాను భాసిస్తూ ఉన్నాయి. గర్భిణి పుల్ల మామిడి ముక్కలు తినాలని కోరుకోవడంలోని ఆంతర్యమూ అదే!
శాస్త్రాలలో వేప పూత పచ్చడిని ‘నింబకుసుమ భక్షణం’ అని చెప్పారు. లేత మామిడి చిగురు, అశోక వృక్షం చిగుళ్లు, వేప పూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి, చెరుకు ముక్కలు కలిపి ఉగాది పచ్చడి చేస్తూంటారు. అలా ఉగాది పచ్చడిని సేవించి పంచాంగ శ్రవణం చేయాలనేది సంప్రదాయం.


ఉగాది పచ్చడి చేయడం కూడా నేర్పుతారా మీరు..అని తిట్టకండి..
పూర్తి శాస్త్రీయంగా చేయడం కోసం ఉపయోగపడుతుందని..అంతే...:)

శ్రీ కల్యాణ గుణావహం
రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం
గోదాన తుల్యం నృణామ్
ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం
... సంతాన సంపత్ప్రదమ్
నానాకర్మ సుసాధనం సముచితం
పంచాంగమాకర్ణ్యతామ్’ - అని చెప్పబడింది.
పంచాంగం’ సిరిసంపదలు కలిగిస్తుంది. శత్రువులను నశింపజేస్తుంది. చెడు స్వప్న దోషాలను పోగొడుతుంది. గంగాస్నానం చేసిన పుణ్యాన్ని, గోదానంతో సరితూగే పుణ్యాన్ని కూడా ఇవ్వగలదు. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. మంచి శుభాలనూ, సంతానాది భోగభాగ్యాలను కలిగిస్తుంది. అనేక పనులను సులభసాధ్యాలుగా చేస్తుంది. కాబట్టే ‘పంచాంగ శ్రవణానికి’ ఎంతో ప్రాధాన్యం ఉంది.