Monday 19 March 2012

జగద్గురువిరచిత స్తోత్రములు

జగద్గురు ఆదిశంకరాచార్య భగవత్పాద విరచిత స్తోత్రములు
ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాతమతత్వం!
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్!
యత్స్వప్నజా...గర సుషుప్తమవైతి నిత్యం!
తత్బ్రహ్మ నిష్కల్మహం న చభూతసంఘః!!

సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం!
వాచోవిభాన్తి నిఖిలా యదనుగ్రహేణ!
యం నేతి నేతి వచనైహ్ నిగమా అవోచు!
స్తం దేవ దేవమజ మచ్యుతమాహురగ్ర్యం!!
మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం!
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యాం!
యస్మిన్నిదం జగదశేషమశేష మూర్తౌ!
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై!!
అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయ విభూషణం!
ప్రాతః కాలే పటేద్యస్తు సగత్సేత్పరమం పదం!!
మూడూ లోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పటించునో వారు మోక్షమును పొందును.
See More