- శ్రీరామ బంటు హనుమంతుడు శనివార ప్రియుడు. హనుమంతుడు శనివారం జన్మించినందున ఆ రోజు ఆలయాల్లో విశేషంగా అర్చనలు చేస్తారు. శనివారం రోజున హనుమంతుడికి జరిగే పూజల్లో పాల్గొంటే సకలసంపదలు, ఆయుర్దాయం, సుఖసంతోషాలు చేకూరుతాయి.
ముఖ్యంగా హనుమంతుడిని కొలిచేందుకు శనివారం ప్రశస్తమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శనివారం సాయంత్రం 3.30 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు అర్చనలు, అభిషేకాలు చేయిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇంకా హనుమాన్ చాలిసా పఠనం చేస్తే మంచి ఫలితాలుంటాయి.
శనివారం రోజున హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. అలాగే వెన్నను నైవేద్యంగా సమర్పించే వారికి వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. ఇక మంగళవారం నాడు కూడా హనుమంతుడికి పాలు, వెన్న, నేతితో అభిషేకం చేయిస్తే కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. - ...
- ...
- షిర్డిక్షేత్ర నివాసాయ, సిరిసంపదదాయినే!!
సిద్ధి మంత్రస్వరూపాయం సాయినాథాయ మంగళం!!
రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సాయీరాం!!
ఈశ్వర్ అల్లా తేరానాం, సబ్‌కో సమ్మత్‌దే భగవాన్!!
భావం:
షిర్డీలో నివసించే సాయినాథా, సర్వసిరిసంపదలు ప్రసాదించే సాయిదేవా నీకు నిత్యజయ మంగళం. అన్నిటికన్నా అతిపవిత్రమైన నామం కలిగిన దేవా! నీకు మా ప్రణామములు, ఈశ్వర్, అల్లా అని పేర్లు కలిగి ఉన్న దేవా అందరినీ కాపాడు తండ్రీ! - "జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముక్దునః 2"
ఓ దేవకీ నందనా..! ఓ వృష్టివంశ మంగళ దీపమా..! సుకుమార శరీరుడా..! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!
అనే మంత్రముతో శ్రీహరిని ప్రతినిత్యం కొలిచిన వారికి మోక్షమార్గములు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. - శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై