Monday 22 April 2013


చంద్ర గ్రహణము

స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర చైత్ర శుద్ధ పౌర్ణమి గురువారము తేది 25-04-2013 రోజున స్వాతి నక్షత్ర ద్వితీయ పాద సంచార సమయమున రాహుగ్రస్త సవ్య పాక్షిక చంద్రగ్రహణము యేర్పడును. (గురువారము రాత్రి తెల్లవారితే శుక్రవారము)



సూర్యాస్తమయము సా: 06-34 ని॥
గ్రహణ స్పర్శకాలము రా॥ 01-20 ని॥
గ్రహణ మధ్యకాలము రా॥ 01-37 ని॥
గ్రహణ మోక్షకాలము రా॥ 01-53 ని॥
ఆద్యంత పుణ్యకాలము 27 నిమిషములు

ఈ గ్రహణము స్వాతి నక్షత్రము, తులా రాశి వారు చూడరాదు. నిత్య భోజన ప్రత్యాభికాదులు సా।। 04 గంటల లోపు పూర్తి చేసుకోవలెను. పిల్లలు, రోగులు, ముసలివారు రాత్రి 07 గంటల వరకు భోజనాదులు చెసుకొవఛును.

తులారాశి వారు, స్వాతి నక్షత్రము వారు శాంతి జరిపించుకోవలెను. అంతేకాకుండా తులారాశి లోవున్న చిత్త 3, 4 పాదముల వారు, విశాఖ 1, 2, 3 పాదముల వారుకూడా గ్రహణ శాంతి జరిపించుకోవలెను. అనగా ఈ రాశి, నక్షత్రము వారు రజిత చంద్ర బింబము, నాగ ప్రతిమకు పూజ చేసి వాటితోపాటుగా యదా శక్తి ధన, ధాన్యాదులు దానమివ్వవలెను. దీని ద్వారా ఆ దోషము తొలగిపోవుటయే కాక మహాపుణ్య ఫలము కలుగును.