Sunday 9 March 2014

అస్తంగత్వం--మౌడ్యమి--మూడం.....

Nerella Raja Sekhar
అస్తంగత్వం--మౌడ్యమి--మూడం.....

ప్రతి గ్రహాం రవికి 12 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి.ఆ గ్రహాం తన కారకత్వాలను కోల్పోవుతుంది.ఆ గ్రహాం కోల్పోయిన బలాన్ని రవి స్వీకరిస్తాడు.

ఆ గ్రహాం యొక్క కారకత్వాలను రవి తన మహాదశలలో ఇస్తాడు.ఏగ్రహాం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆగ్రహాం ఏకారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలను చేయకూడదు.

కుజుడు:- కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్స్,యుద్ధాలు,రక్షణ సంభంధ నిర్ణయాలు ,పోలీస్ ఉద్యోగంలో చేరుట ఇంకా మొదలగు పనులు చేయకూడదు.

బుధ,శుక్ర మూడమిలలో అన్నప్రాశన తరువాత కార్యక్రమాలు చేయరాదు.అన్నప్రాశన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చును.

గురువు:- గురువు మూడమిలలో సుఖానికి,దనానికి,సంబందంలేని పనులు చేసుకోవచ్చు,గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఉపనయనం చేయటం మంచిది కాదు.

శని:-శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన,దీక్ష,తపస్సు,మెడిటేషన్ వంటి పనులు చేయరాదు.

మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు,శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది.

ఈ మూడమిలో జప,హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.