Monday, 31 March 2014

శ్రీ జయ నామ సంవత్సర విశేషాలు

Brahmasri Chaganti Koteswara Rao Garu.
శ్రీ జయ నామ సంవత్సర విశేషాలు

భగవంతుడు కాలస్వరూపుడు. అన్నీ ఋతువులు, కాలాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. సృష్టిలోని జీవనవ్యవస్థకు మూలం భగవంతుడే. 6 ఋతువులు, 12 మాసాలు, 365 రోజులు... ఇవన్నీ కాలస్వరూపుని విభాగాలే. ఈ 12 మాసాలలో తొలిమాసం చైత్రం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని పురాణోక్తి. కలియుగ ప్రమాణము 4లక్షల 32వేల సంవత్సరములు. శ్వేతవరాహకల్పము నందలి 7వ దైనటువంటి వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగము నందలి కలియుగ ప్రధమ పాదములో 5115 వదియు, ప్రభవాది 60 సంవత్సరాలలో 28వ దైనటువంటి ఈ సంవత్సరమును చాంద్రమానంచే శ్రీ 'జయ' నామ సంవత్సరముగా పేర్కొందురు.

ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా లెక్కించినచో, ప్రభవాది అరవై సంవత్సరాలను పన్నెండు యుగాలుగా భావించాలి. ప్రతి యుగములోని ఐదు సంవత్సరాలను వరుసగా సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరములని పిలువబడును. ఈ పరంపరలో ఆరవ యుగములోని 'ఇదావత్సర' మను నామంతో ఉన్న మూడవ సంవత్సరమే శ్రీ జయ నామ సంవత్సరం. 
పూషణం జయ నామాణమ్ జయదం భక్త సన్తతే ।
శంఖ చంక్రాంకిత కరద్వందం హృదిసమాశ్రయే ॥ 

ద్వాదశాదిత్యులలో 11 వ ఆదిత్యుడైన అయిన పూషుడు మాఘ మాసానికి అదిదేవత. ఈ పూష దేవత ప్రజలందరికీ జయమును చేకూర్చుటకు, ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును కలిగి 'జయ' అనే నామధేయము కలిగిన శ్రీ సూర్య నారాయణుడైన... శ్రీమహా విష్ణువు అధిపతిగా ఉన్న సంవత్సరమే శ్రీ జయ. మాఘమాసానికి అధిపతిగా ఉన్న సూర్యునిపేరే పూష. ద్వాదశాదిత్యులలో 11వ దేవతా స్వరూపం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో మాఘమాస ఆది అంత్యాలు శ్రవణా నక్షత్రంలోనే రావటం, ఈ శ్రవణం కలియుగ మహా విష్ణువైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కావటం, శ్రవణా నక్షత్రానికి అధిపతైన చంద్రుడే శ్రీ జయ సంవత్సరానికి రాజు మంత్రి కావటం విశేషం. మాఘమాస శుక్ల ఏకాదశి '"జయ ఏకాదశి" చంద్రుని మరో నక్షత్రమైన రోహిణిలోనే రావటం మరో విశేషం.

355 రోజులు సాగే శ్రీ జయ సంవత్సరానికి రాజ్యాధిపతి, మంత్రిత్వం చంద్రుడికి, సేన అర్ఘ మేఘాదిపత్యములు రవికి, సస్య నీరసాదిపత్యములు బుధునికి, ధాన్యాధిపత్యము కుజునికి, రసాధిపత్యము శుక్రునికి లభించగా గురు, శనులకు ఏ ఒక్క ఆధిపత్యం లభించలేదు. 

రాజు, మంత్రి ఒకరే అయినందున నిర్ణయాలు తీసుకొనుటలోను, ఆచరణలోను సమస్యలు ఉండవు. మధ్య మధ్యలో ప్రజలకు వచ్చే కష్టాలు వినటానికి రాజైన చంద్రుడు ఒక్కోసారి అందుబాటులో ఉండకపోవటం శ్రీ జయలో జరుగుతుంది. అందుకే 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు, ప్రతినెలా అమావాస్య మరియు దాని ముందు వెనుక రోజులలో ప్రజలు ఎదుటివ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తమ స్వ విషయాలను ఎదుటివారికి బహిర్గతం చేయవద్దు. గోప్యంగా ఉంచాలి. 
రాజైన చంద్రునకు అక్టోబర్ 8న పాక్షిక చంద్రగ్రహణం జరిగినందున, రాజు మంత్రి చంద్రుడే అయినప్పటికీ, అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చే వారు కూడా ఉంటుంటారు. అంచేత ప్రజలకు కొన్ని సందర్భాలలో తిప్పలు తప్పవు. కనుక వ్యావహారికంగా తెలుగునాట పాలించే నాయకులకు కూడా తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చేవారు ఉంటుంటారు. కనుక విజ్ఞతతో ఆలోచిస్తూ పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని పాలకులు గమనించాలి. 

2014 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రక్షణశాఖ అధిపతులు అత్యుత్సాహం చూపకూడదు. జూన్ జూలై ఆగష్టు నెలలలో రక్షణశాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రక్క రాష్ట్రాల నేతలతో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగిననూ ఫలితాలు అసంపూర్ణం. ఉగ్రవాద దుశ్చర్యలను చేపట్టేవారు అధికము. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ విజయపంథాలో దూసుకువెల్లును. ఎలక్ట్రానిక్ వస్తువులు సరసమైన ధరలలో అందుబాటులోకి వచ్చును. టెలి కమ్యునికేషన్ రంగాలు బలపడును. క్రీడా రంగంలో కుంభకోణాలు బయటపడును. పర్యాటకరంగం అభివృద్ధి చెందును.

నిరుద్యోగులకు తీపివార్తలు. సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులుండును. చేతి వృత్తులు, చిన్న పరిశ్రమలకు సహాయ సహకారాలుండును. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ప్రాధమికంగా ప్రయోజనలుండును. గృహనిర్మాణ రంగం అభివృద్ధి. స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, కర్షక రంగాలలో అభివృద్ధి గతం కంటే మెరుగగును. సరిహద్దు సమస్యలచే తరచూ ఇబ్బందులు. గ్యాస్, విద్యుత్ సరఫరాలలో సంక్షోభం. విదేశీ మారకం విలువ పెరుగును.

జూలై 13 నుంచి సెప్టెంబరు 4 వరకు శని కుజులు తులారాశిలో కలయికచే వాతావరణం అనుకూలం కాదు. సెప్టెంబరు 25 నుంచి నవంబరు 12 వరకు సినీరంగానికి, కంప్యూటర్, సాఫ్ట్ వేర్ రంగములకు గడ్డురోజులు. సంగీత, సాహిత్య, కళారంగాలలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండును. 
నవమేఘ నిర్ణయానుసారం వాయు నామ మేఘం వాయువ్య భాగంలో ఏర్పడును. ఇందుచే అధిక గాలులచే భారీ వర్షములు, జల ప్రమాదములు ఉత్పన్నమగును. 7 భాగాలు సముద్రమునందు, 9 భాగాలు పర్వతములయందు, 4 భాగాలు భూమియందు వర్షములు పడును. నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, వాయుగుండాలు అధికంగా ఉన్నందున భారీ వర్షములు అధికము. మేఘాధిపతి రవి కావటంచే అక్టోబర్, నవంబర్ లలో భారీ వర్షాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు ఎంతో అవసరం. సెప్టెంబరు 17 కన్యాసంక్రాంతి వచ్చిన 7వ రోజే మహాలయ అమావాస్య రావటం, అక్టోబరు 17 తులాసంక్రాంతి వచ్చిన 7వ రోజే దీపావళి అమావాస్య రావటంచే జల సంబంధ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ వచ్చుటకు అవకాశములున్నాయి.

ధాన్యాధిపతి కుజుడైనందున ఎరుపు ధాన్యాలు, ఎరుపు నెలలు పుష్కలంగా పండుతాయి. కాని 2014 జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలు ఎరుపు పంటలకు అనుకూలం కానందున రైతాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ఘాధిపతి రవి అయిన కారణంగా వాణిజ్యం తరచూ మార్పులుంటూ, షేర్ విలువలు మోసపూరితంగా ఉండు సూచన కలదు. అక్టోబర్, నవంబరు మాసాలలో వాణిజ్య రంగానికి అనేక ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. అప్రమత్తతతో వ్యవహరించాలి. 

అక్టోబరు 16 నుంచి నవంబరు 16 వరకు మధ్యగల కాలంలో రక్షణశాఖ పనితీరు సమర్ధవంతంగాను, సమయాస్పుర్తితోను ఉండాలి. అక్టోబరు 17 నుంచి నవంబరు 27 వరకు కుజ, గురులు షష్టాష్టక స్థితులలో ఉండటము, నవంబరు 28 నుంచి 2015 జనవరి 4 వరకు ఉచ్చస్థితిలో కుజుడు, ఉచ్చస్థితిలో గురువు పరస్పర వీక్షణలతో ఉండి, కుజునిపై శనివీక్షణ కూడా ఉన్నందున ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో దుష్టశక్తులు దుష్ట పన్నాగాలు చేయు సూచన.

జయ జ్యేష్ట బహుళ సప్తమి గురువారం 19 జూన్ 2014 ఉదయం 8.47 గం॥ గురువు కర్కాటకరాశి ప్రవేశించే సార్ధ త్రికోటి తీర్థ సహిత యమునా నదికి పుష్కరాలు ప్రారంభమై జూన్ 30తో ముగియును. పుష్కర రాజైన గురువు ఉచ్చ ప్రవేశం రోజే గురువారం కావటం పైగా గురు నక్షత్రమైన పూర్వాభాద్ర సప్తమి తిదితో ఉండటం అరుదుగా వచ్చే విశేషం. ప్రయాగ, ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం స్నానయోగ్య పుణ్య క్షేత్రాలు. ధృవ, కంసఘాతికా, విశ్రమ ఘట్టములు మధురలో నున్నవి. బృందావనంలో 32 పుణ్య తీర్ధ ఘట్టాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం పవిత్ర పుణ్యప్రదం. 

2015 జనవరి 15 మకర సంక్రాంతి పర్వదినాన మకర సంక్రాంతి పుణ్య పురుషుడు మందాకినీ నామంతో, గజ వాహనంపై స్వాతి నక్షత్రంలో గురువారం రోజున రావటం మహా విశేష శుభప్రదం.

ఈ సంవత్సర ఆదాయం 93 కాగా, సంవత్సర వ్యయం 84 భాగాలు. ఇక ద్వాదశ రాశులకు ఆదాయ, వ్యయ, రాజ్యపూజ్య, అవమానాలను లెక్కిస్తే .... 
మేషరాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 5 అవమానం
వృషభరాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం 
మిధునరాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 1 అవమానం 
కర్కాటకరాశి వారికి 5 ఆదాయం, 8 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 1 అవమానం 
సింహరాశి వారికి 8 ఆదాయం, 2 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 4 అవమానం 
కన్యారాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 5 రాజ్యపూజ్యం, 4 అవమానం 
తులారాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజ్యపూజ్యం, 7 అవమానం 
వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 7 అవమానం 
ధనస్సురాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 7 అవమానం 
మకరరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 3 అవమానం 
కుంభరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 3 అవమానం 
మీనరాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 6 అవమానం

మొత్తం మీద 2014-2015 జయ నామ సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తే 68 శాతం ప్రజలందరూ సుఖ శాంతులతో ఉంటారు. మిగిలిన 32 శాతం ప్రజలు సుఖ శాంతులు ఉండే సూచనలు ఉన్నప్పటికీ, అనుభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక శ్రీ జయ సంవత్సరానికి దేవతా స్వరూపం శ్రీ మహా విష్ణువు కనుక ప్రతి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక నామాలను లేక భావాన్ని అర్ధవంతంగా తెలుసుకుంటే తప్పక శుభం కలుగుతుంది.

- శ్రీనివాస గార్గేయ..

. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ

Brahmasri Chaganti Koteswara Rao Garu.
చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ

ఈ శ్లోకం తాత్పర్యం తెలుసుకుందాం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం. మొదటి నెల చైత్రం. మొదటి తిథి పాడ్యమి. మొదటి వారం ఆదివారం. ఆ వేళ ఈ సృష్టి ప్రారంభమైందని అర్థం. ప్రభవించిందని అర్థం. అందుకే తెలుగుసంవత్సరాలలో మొదటిది ప్రభవ. చివరిది క్షయ. నాశనమైందని. అంటే ఈ బ్రహ్మకల్పం అంతమయ్యే సంవత్సరం అన్నమాట. అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. నిర్ణయసింధుకారుడుకూడా అదే చెప్పాడు. తత్ర చైత్రశుక్ర ప్రతిపదిసంవత్సరారంభ అన్నాడాయన. ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు. రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే… 864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలన్నమాట. ఇలా వందేళ్లు బ్రహ్మ ఆయుర్దాయం.

ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలన్నమాట. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం. ఇది ప్రారంభమై 5114 సంవత్సరాలైంది. ఉగాదినాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని అంటారు. మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదేనని ప్రతీతి. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే. వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే.

ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.
'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది.
ఉగాది - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము, అని విశదీకరిస్తూ,

''వసంతే కపిల స్సూర్యో గ్రీష్మే కాంచన సుప్రభః
శ్వేతో వర్షా సువర్ణేన పాండుశ్శధి భాస్కరః
హేమంతే తామ్ర వర్ణస్తు శిశిరే లోహితో రవిః
ఇతి వర్ణా సమాఖ్యా తాసూర్యసనతు సముద్భవా!

అని వక్కాణింప బడింది.
విష్ణు కిరణ ప్రభావితమైన వసంతం పసుపువర్ణంగాను - గోధుమ వర్ణంలోను ఉంటుంది. ఈ కిరణములు ఉత్తరాయణంలో వికాసం చెందుతాయి. గ్రీష్మమునకు కాంతులు హేతువు. అవి దక్షిణాయనంలో క్షీణత చెందును అని పై శ్లోకమునకు అర్థము.
భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణం చెప్పుచున్నది.

''చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని
శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి
వత్సరాదౌ వసంతా రపి రాజ్యే తదైవచ
ప్రవర్తయామాస తదా కాల సగణనామపి
గ్రహన్నాగే నృతూన్మాసానేవత్సరానృత్యరాధిపాన్‌.

వసంతం ప్రారంభమైనపుడు చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రస జగత్తును సృష్టించాడట. కాల గణన, గ్రహ నక్షత్ర, ఋతు, మాస వర్షాలను, వర్షాధిపులను ప్రవర్తింప చేసాడట.

తెలుగువాళ్ల చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కాలగమనంలో మార్పు తప్పదు. కల్పంలో మహాయుగాలు, యుగాలు ఉన్నాయి. ప్రతీవాటికి ధర్మాలు మారుతూంటాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా సంవత్సరాల పేర్లనుబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవనుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క.ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. ఒక ఐతిహ్యం ప్రకారం శ్రీకృష్ణుడికి 16100మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారికి 60మంది సంతానం. వారిపేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారన్న మరో కథకూడా ప్రచారంలో ఉంది. దక్షప్రజాపతి కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు. ఏదేమైనా ఈ ఉగాదితో ప్రారంభయ్యే విజయ తెలుగు సంవత్సరాలలో 27వది. విజయాలను మూటగట్టుకుని వచ్చేది. విజయోస్తు.

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.

ఉగాది శుభాకాంక్షలతో ...
-Admin
 — with Mudium Saiprasad and 5 others.

గౌరికృతం హేరమ్బస్తోత్రమ్

Bramhasri Samavedam Shanmukha Sarma
గౌరికృతం హేరమ్బస్తోత్రమ్ 

శ్రీ గణేశాయ నమః |
గౌర్యువాచ |
గజానన జ్ఞానవిహారకారిన్న మాం చ జానాసి పరావమర్షామ్ |
గణేశ రక్షస్వ న చేచ్ఛరీరం త్యజామి సద్యస్త్వయి భక్తియుక్తా || ౧||

విఘ్నేశ హేరమ్బ మహోదర ప్రియ లమ్బోదర ప్రేమవివర్ధనాచ్యుత |
విఘ్నస్య హర్తాఽసురసఙ్ఘహర్తా మాం రక్ష దైత్యాత్వయి భక్తియుక్తామ్ || ౨||

కిం సిద్ధిబుద్ధిప్రసరేణ మోహయుక్తోఽసి కిం వా నిశి నిద్రితోఽసి |
కిం లక్షలాభార్థవిచారయుక్తః కిం మాం చ విస్మృత్య సుసంస్థితోఽసి || ౩||

కిం భక్తసఙ్గేన చ దేవదేవ నానోపచారైశ్చ సుయన్త్రితోఽసి |
కిం మోదకార్థే గణపాద్ధృతోఽసి నానావిహారేషు చ వక్రతుణ్డ || ౪||

స్వానన్దభోగేషు పరిహృతోఽసి దాసీం చ విస్మృత్య మహానుభావ |
ఆనన్త్యలీలాసు చ లాలసోఽసి కిం భక్తరక్షార్థసుసఙ్కటస్థః || ౫||

అహో గణేశామృతపానదక్షామరైస్తథా వాఽసురపైః స్మృతోఽసి |
తదర్థనానావిధిసంయుతోఽసి విసృజ్య మాం దాసీమనన్యభావామ్ || ౬||

రక్షస్వ మాం దీనతమాం పరేశ సర్వత్ర చిత్తేషు చ సంస్థితస్త్వమ్ |
ప్రభో విలమ్బేన వినాయకోఽసి బ్రహ్మేశ కిం దేవ నమో నమస్తే || ౭||

భక్తాభిమానీతి చ నామ ముఖ్యం వేదే త్వభావాన్ నహి చేన్మహాత్మన్ |
ఆగత్య హత్వాఽదితిజం సురేశ మాం రక్ష దాసీం హృది పాదనిష్ఠామ్ || ౮||

అహో న దూరం తవ కిఞ్చిదేవ కథం న బుద్ధీశ సమాగతోఽసి |
సుచిన్త్యదేవ ప్రజహామి దేహం యశః కరిష్యే విపరీతమేవమ్ || ౯||

రక్ష రక్ష దయాసిన్ధోఽపరాధాన్మే క్షమస్వ చ |
క్షణే క్షణే త్వహం దాసీ రక్షితవ్యా విశేషతః || ౧౦||

స్తువత్యామేవ పార్వత్యాం శఙ్కరో బోధసంయుతః |
బభూవ గణపానాం వై శ్రుత్వా హాహారవం విధేః || ౧౧||

గణేశం మనసా స్మృత్వా వృషారూఢః సమాయయౌ |
క్షణేన దైత్యరాజం తం దృష్ట్వా డమరుణాహనత్ || ౧౨||

తతః సోఽపి శివం వీక్ష్యాలిఙ్గితుం ధవితోఽఅభవత్ |
శివస్య శూలికాదీని శస్త్రాణి కుణ్ఠితాని వై || ౧౩||

తం దృష్ట్వా పరమాశ్చర్యం భయభీతో మహేశ్వరః |
సస్మార గణపం సోఽపి నిర్విఘ్నార్థం ప్రజాపతే || ౧౪||

పార్వత్యాః స్తవనం శ్రుత్వా గజాననః సమాయయౌ |

ఇతి ముద్గలపురాణోక్తం హేరమ్బస్తోత్రం సమ్పూర్ణమ్ |
Photo: గౌరికృతం హేరమ్బస్తోత్రమ్ 

శ్రీ గణేశాయ నమః |
గౌర్యువాచ |
గజానన జ్ఞానవిహారకారిన్న మాం చ జానాసి పరావమర్షామ్ |
గణేశ రక్షస్వ న చేచ్ఛరీరం త్యజామి సద్యస్త్వయి భక్తియుక్తా || ౧||

విఘ్నేశ హేరమ్బ మహోదర ప్రియ లమ్బోదర ప్రేమవివర్ధనాచ్యుత |
విఘ్నస్య హర్తాఽసురసఙ్ఘహర్తా మాం రక్ష దైత్యాత్వయి భక్తియుక్తామ్ || ౨||

కిం సిద్ధిబుద్ధిప్రసరేణ మోహయుక్తోఽసి కిం వా నిశి నిద్రితోఽసి |
కిం లక్షలాభార్థవిచారయుక్తః కిం మాం చ విస్మృత్య సుసంస్థితోఽసి || ౩||

కిం భక్తసఙ్గేన చ దేవదేవ నానోపచారైశ్చ సుయన్త్రితోఽసి |
కిం మోదకార్థే గణపాద్ధృతోఽసి నానావిహారేషు చ వక్రతుణ్డ || ౪||

స్వానన్దభోగేషు పరిహృతోఽసి దాసీం చ విస్మృత్య మహానుభావ |
ఆనన్త్యలీలాసు చ లాలసోఽసి కిం భక్తరక్షార్థసుసఙ్కటస్థః || ౫||

అహో గణేశామృతపానదక్షామరైస్తథా వాఽసురపైః స్మృతోఽసి |
తదర్థనానావిధిసంయుతోఽసి విసృజ్య మాం దాసీమనన్యభావామ్ || ౬||

రక్షస్వ మాం దీనతమాం పరేశ సర్వత్ర చిత్తేషు చ సంస్థితస్త్వమ్ |
ప్రభో విలమ్బేన వినాయకోఽసి బ్రహ్మేశ కిం దేవ నమో నమస్తే || ౭||

భక్తాభిమానీతి చ నామ ముఖ్యం వేదే త్వభావాన్ నహి చేన్మహాత్మన్ |
ఆగత్య హత్వాఽదితిజం సురేశ మాం రక్ష దాసీం హృది పాదనిష్ఠామ్ || ౮||

అహో న దూరం తవ కిఞ్చిదేవ కథం న బుద్ధీశ సమాగతోఽసి |
సుచిన్త్యదేవ ప్రజహామి దేహం యశః కరిష్యే విపరీతమేవమ్ || ౯||

రక్ష రక్ష దయాసిన్ధోఽపరాధాన్మే క్షమస్వ చ |
క్షణే క్షణే త్వహం దాసీ రక్షితవ్యా విశేషతః || ౧౦||

స్తువత్యామేవ పార్వత్యాం శఙ్కరో బోధసంయుతః |
బభూవ గణపానాం వై శ్రుత్వా హాహారవం విధేః || ౧౧||

గణేశం మనసా స్మృత్వా వృషారూఢః సమాయయౌ |
క్షణేన దైత్యరాజం తం దృష్ట్వా డమరుణాహనత్ || ౧౨||

తతః సోఽపి శివం వీక్ష్యాలిఙ్గితుం ధవితోఽఅభవత్ |
శివస్య శూలికాదీని శస్త్రాణి కుణ్ఠితాని వై || ౧౩||

తం దృష్ట్వా పరమాశ్చర్యం భయభీతో మహేశ్వరః |
సస్మార గణపం సోఽపి నిర్విఘ్నార్థం ప్రజాపతే || ౧౪||

పార్వత్యాః స్తవనం శ్రుత్వా గజాననః సమాయయౌ |

ఇతి ముద్గలపురాణోక్తం హేరమ్బస్తోత్రం సమ్పూర్ణమ్ |

Saturday, 22 March 2014

జ్యోతిష్యం ద్వారా సూచించే మొక్కలను మీ ఇంట్లో నాటండి...............

జ్యోతిష్యం ద్వారా సూచించే మొక్కలను మీ ఇంట్లో నాటండి...............

మీ రాశికి తగ్గ మొక్కలు నాటండి...!

ప్రతి మనిషికి ఒక రాశి అంటూ ఉంటుంది. ఆయా రాశులకు తగ్గట్టు వారివారి జీవితాలు ముడిపడి ఉంటాయి. వివిధ రాశులలో వివిధ గ్రహాల ప్రభావం ఉంటుంది. దీంతో వారి వ్యక్తిగత జీవితాలు మారిపోతుంటాయి.

మీ మీ రాశులకు తగ్గట్టు, వాటిపై ప్రభావం చూపే మొక్కలుకూడా ఉంటాయి. జ్యోతిష్యం ద్వారా సూచించే మొక్కలను మీ ఇంట్లో నాటండి. దీంతో మీ వ్యక్తిగత జీవితంపై మంచి ఫలితాలు చూపిస్తాయంటున్నారు జ్యోతిష్యులు.

రాశికి అనుగుణంగా మొక్కలు నాటండి :

** మేష రాశివారు ఉసిరికాయ చెట్టును నాటండి.

** వృషభ రాశివారు మేడి చెట్టును నాటండి.

** మిథున రాశివారు పొద్దుతిరుగుడు మొక్కను నాటండి.

** కర్కాటక రాశివారు చందనం, పారిజాతపు చెట్టను నాటండి.

** సింహ రాశివారు మోదుగ చెట్టును నాటండి.

** కన్యా రాశివారు పెసలు లేదా పసుపు చెట్టును నాటండి.

** తులా రాశివారు లవంగ లేదా సండ్ర చెట్టును నాటండి.

** వృశ్చిక రాశివారు వెదురు లేదా చెరకు చెట్టును నాటండి.

** ధనస్సు రాశివారు సండ్ర చెట్టును నాటండి.

** మకర రాశివారు రావి, తీగలు, తుమ్మ, మామిడి లేదా తులసి మొక్కలు నాటండి.

** కుంభ రాశివారు కదంబంలేదా కమలం మొక్కలు నాటండి.

** మీన రాశివారు నువ్వులు లేదా రావి చెట్టును నాటండి.

ఇలాంటి మొక్కలు మీకు నర్సరీల్లో తక్కువ ధరలలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు మీకు రుద్రాక్ష మొక్కలుకూడా లభ్యమవుతాయి. మీరు మొక్కలను కొన్న తర్వాత వాటిని ఎలా సంరక్షించుకోవాలోకూడా నర్సరీ వారు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు.

మీ రాశికి తగ్గ మొక్కలను మీ ఇంటి పెరట్లో నాటుకుంటే మీకు ఎంతో శ్రేయస్కరం అంటున్నారు జ్యోతిష్యులు.

Friday, 21 March 2014

సకాలంలో అయినా అకాలంలో అయినాసంధ్యావందనం శ్రద్ధగా చేస్తే అతడు

శ్లో|| కాలేవాప్యథవాకాలే సంధ్యావందన తత్పరః| 
అవిద్యో వా సవిద్యో వా బ్రాహ్మణో మామకీ తనుః|| 

విద్యావంతుడైనా విద్యాహీనుడైనా బ్రాహ్మణుడు సకాలంలో అయినా అకాలంలో అయినాసంధ్యావందనం శ్రద్ధగా చేస్తే అతడు నా ( మహావిష్ణువు ) దేహమే!

తన కనీస కర్తవ్యమైన సంధ్యావందనాన్ని వదలక చేసే బ్రాహ్మణుడు భూమిమీద చరిస్తూ - సాక్షాత్తూ మహావిష్ణువు ఉనికిని వ్యక్తపరుస్తున్నాడనడం లో అతి శయోక్తి లేదు. సంధ్యావందనం తనకు అంతటి పవిత్రతను ఇస్తున్నదని నమ్మిన బ్రాహ్మణుడు దానిని ఎన్నటికీ వదలడు.

రుద్ర పంచముఖ ధ్యానం-

రుద్ర పంచముఖ ధ్యానం-

సంవర్తాగ్నితటిత్ప్రదీప్తకనక ప్రస్పర్ధితేజోమయం |
గమ్భీరధ్వనిమిశ్రితోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరమ్ ||
అర్ధేన్దుద్యుతిలోలపిఙ్గళజటాభారప్రబద్ధోరగం |
వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖః శూలినః || ౧ ||

కాలభ్రభ్రమరాంజనద్యుతినిభం వ్యావృత్తపింగేక్షణం |
కర్ణోద్భాసితభోగిమస్తకమణి ప్రోద్భిన్నదంష్ట్రాంకురమ్ ||
సర్పప్రోతకపాలశుక్తిశకల వ్యాకీర్ణసంచారగం |
వందే దక్షిణమీశ్వరస్య కుటిల భ్రూభంగరౌద్రం ముఖమ్ || ౨ ||

ప్రాలేయాచలచంద్రకున్దధవళం గోక్షీరఫేనప్రభం |
భస్మాభ్యక్తమనంగదేహదహన జ్వాలావళీలోచనమ్ ||
బ్రహ్మేంద్రాదిమరుద్గణైస్స్తుతిపరైరభ్యర్చితం యోగిభిః |
వందేఽహం సకలం కళంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్ || ౩ ||

గౌరం కుఙ్కుమపంకిలం సుతిలకం వ్యాపాణ్డుగణ్డస్థలం |
భ్రూవిక్షేపకటాక్షవీక్షణలసత్సంసక్తకర్ణోత్పలమ్ ||
స్నిగ్ధం బిమ్బఫలాధరప్రహసితం నీలాలకాలంకృతం |
వన్దే పూర్ణశశాఙ్కమణ్డలనిభం వక్త్రం హరస్యోత్తరమ్ || ౪ ||

వ్యక్తావ్యక్తగుణేతరం సువిమలం షట్త్రింశతత్వాత్మకం |
తస్మాదుత్తరతత్త్వమక్షరమితి ధ్యేయం సదా యోగిభిః ||
వన్దే తామసవర్జితం త్రిణయనం సూక్ష్మాతిసూక్ష్మాత్పరం |
శాన్తం పఞ్చమమీశ్వరస్య వదనం ఖవ్యాపితేజోమయమ్ || ౫ ||

Tuesday, 11 March 2014

ధర్మ,కామ త్రికోణాలు రెండు కలిసిన యంత్రం షట్కోణ సుబ్రమణ్యేశ్వర యంత్రం.....


Nerella Raja Sekhar 

ధర్మ,కామ త్రికోణాలు రెండు కలిసిన యంత్రం షట్కోణ సుబ్రమణ్యేశ్వర యంత్రం.....
రాశి చక్రంలో దర్మ,అర్ధ,కామ,మోక్ష త్రికోణాలనే 4 పురుషార్ధాలు ఉన్నాయి.
1,5,9 ధర్మ త్రికోణాలు.
2,6,10 అర్ధ త్రికోణాలు,
3,7,11 కామ త్రికోణాలు,
4,8,12 మోక్ష త్రికోణాలు.
ధర్మ త్రికోణాలను కామ త్రికోణాలు ఎదురెదురుగా ఉండి సూటిగా ఖండించుకుంటాయి.
ఈ రెండు త్రికోణాలకు సామాన్యంగా పొసగదు.కానీ ఈ రెండిటినీ చక్కగా వినియోగించుకుంటే జీవితం భగవంతుని ఆదేశాలకు (1,5,9),ప్రకృతి (3,7,11) యొక్క అమరికలకు అనుగుణంగా ఉంటుంది.అప్పుడు మానవుడు భూమ్మీద భగవంతుని ఆదేశాలతో ప్రతిరూపం కాగలడు.
పార్వతి పరమేశ్వరుల సంతానం కుమారస్వామి.ఎవరైతే ధర్మ భావాలను(1,5,9),కామ భావాలను (3,7,11) సరిగా సమన్వయం చేయగలడో వాడు కుమారుని అంశ అవుతాడు.దీనిని సూచిస్తూ ఎదురెదురుగా ఖండించుకుంటున్న రెండు త్రికోణాలు ఉంటాయి.
ఊర్ధ్వముఖంగా ఉన్న 1,5,9 భావాలు దర్మాత్రికోణాలు,అగ్నితత్వం కలిగి ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ఉంటాయి.(అగ్నిజ్వాల ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే ప్రజ్వలిస్తూ ఉంటుంది.)
అదోముఖంగా ఉన్న 3,7,11 భావాలు కామ త్రికోణాలు,జలతత్వం కలిగి ఎప్పుడు అదోముఖంగానే ఉంటాయి.(నీరు ఎప్పుడు అదోముఖంగానే ప్రవహిస్తూ ఉంటుంది.)
దర్మ,కామ రాశి చక్రంలోని భావ త్రికోణాలు ఆరు కోణాలుంటాయి.అందుకే శివశక్తుల కలయిక అయిన కుమార స్వామిని "షణ్ముఖుడు" అంటారు.
"ధర్మం ఎక్కువై కామం తగ్గితే దైవత్వం
కామం ఎక్కువై ధర్మం తగ్గితే రాక్షతత్వం"
రెండు సమపాళ్ళలో ఉంటేనే మానవత్వం.
ఈ ఙ్ఞానం కలగాలంటే పై ఆరు భావాలు బాగుండాలి.కాబట్టి సంతానం లేనివారు షట్కోణ సుబ్రమణ్యేశ్వరస్వామి యంత్రాన్ని నిష్ఠగా పూజిస్తే సంతానం కలుగుతుంది అని ప్రతీతి.
Nerella Raja Sekhar's photo.
Nerella Raja Sekhar's photo.

Sunday, 9 March 2014

బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం

హిందూ హిందుత్వం
బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం
అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.
సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది. మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున 459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.
కృతయుగం——-17,28,000
త్రేతాయుగం—– 12,96,000
ద్వాపరయుగం— 8,64,000
కలియుగం——- 4,32,000
_____________________
43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.
_____________________
మన లెక్కల ప్రకారం 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.
2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం. 360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో 31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.
ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ సంవత్సరం.
ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు గడిచాయి.ఇది ప్రస్తుతం మనమున్న కాలం.

14మంది మనువుల పేర్లు.

1. స్వాయంభువుడు 2. స్వారోచిషుడు 3. జౌత్తమి 4. తామసుడు
5. రైవతుడి 6. చాక్షుసుడు 7. వైవస్వతుడు (ప్రస్తుత మనువు)
8. సాపర్ణి 9. దక్ష సాపర్ణి 10. బ్రహ్మ సాపర్ణి 11. ధర్మ సాపర్ణి
12. రుద్ర సాపర్ణి 13. దేవ సాపర్ణి 14. ఇంద్ర సాపర్ణి

అస్తంగత్వం--మౌడ్యమి--మూడం.....

Nerella Raja Sekhar
అస్తంగత్వం--మౌడ్యమి--మూడం.....

ప్రతి గ్రహాం రవికి 12 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గ్రహాలు అస్తంగత్వం చెందుతాయి.ఆ గ్రహాం తన కారకత్వాలను కోల్పోవుతుంది.ఆ గ్రహాం కోల్పోయిన బలాన్ని రవి స్వీకరిస్తాడు.

ఆ గ్రహాం యొక్క కారకత్వాలను రవి తన మహాదశలలో ఇస్తాడు.ఏగ్రహాం అయితే అస్తంగత్వం చెందుతుందో ఆగ్రహాం ఏకారకత్వాలను తెలియజేస్తాయో ఆ కార్యక్రమాలను చేయకూడదు.

కుజుడు:- కుజుడు అస్తంగత్వం చెందినప్పుడు ఆపరేషన్స్,యుద్ధాలు,రక్షణ సంభంధ నిర్ణయాలు ,పోలీస్ ఉద్యోగంలో చేరుట ఇంకా మొదలగు పనులు చేయకూడదు.

బుధ,శుక్ర మూడమిలలో అన్నప్రాశన తరువాత కార్యక్రమాలు చేయరాదు.అన్నప్రాశన ముందు కార్యక్రమాలు చేసుకోవచ్చును.

గురువు:- గురువు మూడమిలలో సుఖానికి,దనానికి,సంబందంలేని పనులు చేసుకోవచ్చు,గురువు అస్తంగత్వం చెందినప్పుడు ఉపనయనం చేయటం మంచిది కాదు.

శని:-శని అస్తంగత్వం చెందినప్పుడు ఉపాసన,దీక్ష,తపస్సు,మెడిటేషన్ వంటి పనులు చేయరాదు.

మూడమి అన్ని గ్రహాలకు ఉన్న గురు,శుక్ర మౌడ్యమి మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది.

ఈ మూడమిలో జప,హోమాది శాంతులు గ్రహా శాంతికి అభిషేకాలు గండనక్షత్ర శాంతులు అన్ని వ్రతాలు చేయవచ్చును.


Sunday, 2 March 2014

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం

 శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామ స్తోత్రం

స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః |
పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః || ౧ ||
ద్విషణ్ణేత్రశ్శక్తిధరః పిశితాశాప్రభంజనః |
తారకాసురసంహారి రక్షోబలవిమర్దనః || ౨ ||
మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్యసురక్షకః |
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలో భక్తవత్సలః || ౩ ||
ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచధారణః |
సేనానీరగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః || ౪ ||
శివస్వామి గణస్వామి సర్వస్వామి సనాతనః |
అనంతమూర్తిరక్షోభ్యః పార్వతీ ప్రియనందనః || ౫ ||
గంగాసుతశ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః |
జృంభః ప్రజృంభః ఉజ్జృంభః కమలాసనసంస్తుతః || ౬ ||
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణస్సుమనోహరః |
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహహ్పతిః || ౭ ||
అగ్నిగర్భశ్శమీగర్భో విశ్వరేతాస్సురారిహా |
హరిద్వర్ణశ్శుభకరో వటుశ్చ పటువేషభృత్ || ౮ ||
పూషాగభస్తిర్గహనో చంద్రవర్ణ కళాధరః |
మాయాధరో మహామాయీ కైవల్యశ్శంకరాత్మజః || ౯ ||
విశ్వయోనిరమేయాత్మా తేజోనిధిరనామయః |
పరమేష్ఠీ పరబ్రహ్మ వేదగర్భో విరాట్సుతః || ౧౦ ||
పులిందకన్యాభర్తాచ మహాసారస్వతవృతః |
అశ్రితాఖిలదాతాచ చోరఘ్నో రోగనాశనః || ౧౧ ||
అనంతమూర్తిరానందశ్శిఖండీకృతకేతనః |
డంభః పరమడంభశ్చ మహాడంభోవృషాకపిః || ౧౨ ||
కారణోత్పత్తిదేహశ్చ కారణాతీతవిగ్రహః |
అనీశ్వరోఽమృతఃప్రాణః ప్రాణాయామ పరాయణః || ౧౩ ||
విరుద్ధహంత వీరఘ్నో రక్తశ్యామగలోఽపిచ |
సుబ్రహ్మణ్యో గుహప్రీతః బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || ౧౪ ||

దుర్గాసప్తశ్లోకీ

 దుర్గాసప్తశ్లోకీ

శివ ఉవాచ-
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||
దేవ్యువాచ-
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||
ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |
ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||
దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోzస్తు తే || ౩ ||
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోzస్తు తే || ౪ ||
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోzస్తు తే || ౫ ||
రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || ౬ ||
సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || ౭ ||
ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణా |