Friday, 17 August 2012

అధిక మాసము – పురుషోతమ మాసం 
సుమారు ౩౩ మాసములకు ఒక మారు వచ్చునదే అధిక మాసము. అధిక మాసము ఎలా ఏర్పడుతుందో చూద్దాము మనము అనుసరించేది చాంద్ర మానము. అంటే చంద్రుని గతి ఒక మాసమునకు ౨౯.౫౩౦౫ దినములు అది ఒక వర్శమునకు ౩౫౪.౩౬౬ దినములు. సూర్య మానమందలి ఒక వర్శమునకు ౩౬౫.౨౫౮౭ దినములు అంటే ౩౬౫ దినములు సౌరమానమునకు చాన్ద్రమనమునకు వ్యత్యాసము ౧౧ రోజులు ఒక వత్సరమునకు. అదియే ౨ వస్త్సరములకు ౨౨ రోజులు ౮ మాసములు ౧౬ రోజులు ౪ ఘడియలకు ౮ రోజులు అవుతుంది అంటే ప్రతి ౩౩ మాసములకు సౌర చాంద్ర మానములకు ఒక మాసము అధికమౌతుంది. అంటే ఒక మాసమునకు ౩౦ రోజులకు బదులు ౬౦ రోజులు అవుతుంది. 
ఈ నందన వత్సరములో భాద్రపద మాసమునకు ౬౦ రోజులు వర్తిస్తుంది. అంటే ౧౮.౦౮.౧౨ నుండి ౧౬.౦౯.౧౨ వరకు అధిక భాద్రపద మాసము ౧౭.౦౯.౧౨ నుండి ౧౫.౧౦.౧౨ వరకు నిజ భాద్రపద మాసముగా అనువర్తిన్చుకోనవలెను ఈ అధిక మాసమందు శ్రీ మహావిష్ణువును పురుషోత్తమునిగా మనము ప్రార్థించ వలసి 
ఉంటుంది. ప్రతి రోజు స్నాన సంధ్యావందనాది నిత్య కర్మలు అయిన తర్వాత సూర్యునికి మహావిష్ణు స్వరూపముగా క్రింది శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను.
౧. దేవ దేవ మహాదేవ ప్రళయోత్పత్తి కారక, గృహాణ మర్గ్యం మాయ దత్తం కృత్వా మమోపరి. శ్రీ సూర్య నారాయణాయనమ ఇదం అర్ఘ్యం – ౩ తడవలు
౨ పురాణ పురుషేశాన సర్వలోక నిక్రుంతన అధిమాస వ్రాత ప్రీతో గృహాణార్ఘ్యం నమోస్తు తే పురాణ పురుశాయ నమః ఇదం అర్ఘ్యం – ౩ తడవలు
౩ స్వయంభువే నమస్తుభ్యం బ్రమ్హాణే అమిత తేజసే నమోస్తుతే శ్రియానన్ద దయాం కురు మమోపరి స్వయంభువే నమః ఇదం అర్ఘ్యం – ౩ తడవలు
౪ యస్య హస్తే గదా చక్రే గరుడో యస్య వాహనం శంఖః కరతలే యస్య స మే విష్ణుః ప్రసీదతి విష్ణవే నమః ఇదం అర్ఘ్యం – ౩ తడవలు
౫ కళా కాష్టాది రూపేణ నిమేష ఘటికాథిన యో వంచయతి భూతాని తస్మై కాలాత్మనే నమః – కాలాత్మనే నమః ఇదం అర్ఘ్యం – ౩ తడవలు
౬ కురుక్షేత్ర మాయో దేశః కాలః పూర్వ ద్విజో హరి పృథివీ సమ మిమం దానం గృహాణ పురుషోత్తమ – పురుశోత్తమాయనమః ఇదం అర్ఘ్యం – ౩ తడవలు
౭ మాలానంచ విశుద్ధ్యర్థం పాప ప్రసమనాయచ పుత్రా పౌత్రాభి వ్రుద్ధ్యర్థం తవ దాస్యామి భాస్కర - భాస్కరాయ నమః ఇదం అర్ఘ్యం – ౩ తడవలు.
ఇవి కాకుండా ఒక కంచు పాత్రలో ౩౩ అప్పములు కొంచము బెల్లము కొంచము ఘ్రుతం బ్రామ్హణులకు కింది సంకల్పముతో దానము ఇవ్వవలెను
మామ త్రయత్రిమ్సత్ దేవతా అంతర్యామి విష్ణు స్వరూపి సహస్రామ్సు ప్రీతి ద్వారా నిఖిల పాప ప్రసమన పూర్వకం పుత్ర పౌత్ర యుత ధన దానయ క్షేమ సమృద్ది లోకద్వయ సుఖ హేతు పృథివీ దాన ఫల ప్రాప్త్య అపుప చ్చిద్ర సమ సంఖ్య వర్ష సహస్ర స్వర్లోక నివాసాది ఫల సిద్ద్యర్థం మలమాస ప్రయుక్త ఆజ్య గూడ సర్పి మిశ్రిత కాంస్య పాత్రస్థ త్రయ త్రిమ్సథ్ ఆపుఉప దానాని కరిష్యే ....
ఇలా దానం చేస్తే పురుషోత్తమ మాస వ్రతం అంటారు దీనిని స్త్రీ పురుషులు అందరు చేయవలసినదే
మలం అంటే అశుద్ధం అని అర్థం మన దేహములోని అసుద్ధమును సబ్బు ద్వ్వ్రార సుద్ధము చేసుకుంటాము కాని మన మనస్సులోని అశుద్ధమును ఈ వ్రతము ద్వారానే సుద్ధి చేసుకోగలుగుతాము ఇందువల్ల మనకు మహాలక్ష్మి కటాక్షము సమ్పూర్థిగ లభిన్చును





Goda Kannaiah .

Wednesday, 8 August 2012

కృష్ణ అష్టమి తొమ్మిదవ తేదీ గూరువారము. 
జాతః కంసవదార్తాయ భుభారోద్ధరనాయ చ, పాణ్డవానాం హితార్థాయ ధర్మ సంస్తాపనాయచ 
కౌరవనాం వినాశాయ దైత్యానాం నిధనాయచ, పాహి మాం పద్మ నయన దేవకీ తనయ ప్రభో 
శ్రావణ మాస కృష్ణ పక్ష అష్టమి అర్ధరాత్రి దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానముగా శ్రీమన్నారాయణుడు అవతారము పొందెను అష్టమి తిథి ముక్యముగా గోకులాష్టమి అనియు రోహిణి నక్షత్రమును ముఖ్యముగా శ్రీ జయంతి అని మనము అనుసరిస్తాము. ఈ పండుగ కాసి నుండి కన్యాకుమారి వరకు అనడిచేత అనుష్టిమ్పబడే ఒక గొప్ప పండుగ ప్రొద్దున ఉపవాసము అనుష్టించి భాగవత పారాయణము లేక కృష్ణ భజనలతో ప్రొద్దు గడిపి సాయంకాలము గృహము సుబ్రముగా కడిగి రంగవల్లులతో అలంకరిచి ముఖ్యముగా కృష్ణ పాదములను ఇంటి వాకిలి నుండి పూజా మందిరం వరకు వచ్చేటట్లు పిండి ముగ్గులతో వేసి అర్ధరాత్రి సమయమునకు శ్రీ కృష్ణ పూజను చేసి పిండి వంటలను నివేదనము చేసి కడపట గోవు పాలతో శ్రీ కృష్ణునకు దేవకీవసుదేవులకు యసోదానందగోపులకు అక్రూర ఉద్దవులకు అర్ఘ్యము ఇవ్వవలెను ఇందువలన శ్రీ కృష్ణ అనుగ్రహమునకు పాత్రులై మన వంసమండలి కృష్ణుని వంటి సత్సంతానము పొందుటకు పాత్రులు అవుదాము.
మీరు అందరు అనుష్టించి సుఖ సంతోషములు పొందవలెనని దేవుని ప్రార్తిస్తుతూ ........